అంతర్జాతీయం

మెక్సికో గోడ నిర్మాణానికి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 28: మెక్సికోతో ఉన్న సరిహద్దు వెంబడి గోడను నిర్మించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మెక్సికో నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్‌ను అరికట్టేందుకు వంద మైళ్ల మేరకు ఉన్న మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వివాదాస్పద గోడ నిర్మాణ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ అమోదం తెలిపింది. అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో నిన్న 235-192 ఓట్లతో బిల్లును ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు చట్టం కావాలంటే సెనేట్‌లో కూడా ఆమోదం పొందిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. సెనేట్‌లో ప్రతిపక్ష పార్టీ డెమోక్రాట్లకు మెజారిటీ ఉంది. బిల్లు సెనేట్ ఆమోదం పొందడం అంత సులువేమీ కాదు. మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలనుకోవడం బాగా ఖర్చుతో కూడుకున్నదని డెమోక్రాట్స్ అంటున్నారు. దీనికి బిల్లులో పేర్కొంటున్నట్లు 4-6 బిలియన్ల డాలర్లు కాదని, సూమారు 30నుంచి 40 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని వారు వాదిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మెక్సికో సరిహద్దు వెంట గోడ కట్టడానికి అమెరికన్లపై ఒక్క డాలర్ వ్యయ భారం పడకుండా మెక్సికోనే దాన్ని భరించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారని గుర్తు చేశారు. ఇది అనవసరమైన వ్యయమని, దీనివల్ల ప్రజలపై భారం పడుతుందని డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు.