అంతర్జాతీయం

ఉ.కొరియా మరో క్షిపణి ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 29: అమెరికాసహా పలు దేశాలు చేస్తున్న హెచ్చరికలు ఉత్తర కొరియాను ఏమీ భయపెట్టలేకపోతున్నాయి. శుక్రవారం రాత్రి ఆ దేశం మరో ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. నెల రోజుల్లో ఈ రకంగా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించటం ఇది రెండోసారి. రష్యా, ఇరాన్, ప్యాంగ్‌యాంగ్‌లపై అమెరికా కాంగ్రెస్ తాజా ఆంక్షలు విధించి 24 గంటలు పూర్తి కాకుండానే ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేయటం అమెరికాకు తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ‘ఈ సంవత్సరంలో ఉత్తర కొరియా 12వ క్షిపణిని ప్రయోగించింది. ఇది రెండో ఖండాంతర క్షిపణి. ముప్యాంగ్-ని తీరంనుంచి ప్రయోగించిన ఈ క్షిపణి దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్రంలో పడింది’ అని పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. క్షిపణి ప్రయోగం తరువాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అన్ హర్షం వ్యక్తం చేశారు. క్షిపణి రూపకర్తలను ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాలోని చికాగో వంటి మహానగరాలు తమ గుప్పిట్లో ఉన్నాయని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై అమెరికా స్పందిస్తూ ‘ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై మా భాగస్వాములతో కలిసి చర్చించి ఒక అంచనా వేస్తున్నాం.
ఎలాంటి ముప్పు వచ్చినా మమ్మల్ని మేము రక్షించుకోవటానికి, మాతోపాటు మా మిత్ర దేశాలను సంరక్షించుకోవటానికి అన్నివేళలా సంసిద్ధంగా ఉంటాం’ అని పెంటగాన్ ప్రతినిధి కెప్టెన్ జెఫ్ డేవిస్ తెలిపారు. ఉత్తర కొరియా ప్రపంచ సమస్యగా మారుతోందని కాంగ్రెస్ ప్రతినిధి పాల్ రియాన్ అన్నారు.

చిత్రం.. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో సంబరాలు చేసుకుంటున్న కిమ్ జోంగ్