అంతర్జాతీయం

తిరుగులేని సత్తా మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 30: తమపై దాడిచేసే శత్రు సేనలన్నింటినీ తిప్పికొట్టగలిగే ఆత్మవిశ్వాసం, సామర్థ్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి (పిఎల్‌ఏ) ఉన్నాయని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదివారం నాడిక్కడ ఉద్ఘాటించారు. పిఎల్‌ఏ ఆవిర్భవించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన భారీ సైనిక కవాతులో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తిరుగులేని నాయకత్వం కిందే పిఎల్‌ఏ పనిచేయాలని, పార్టీ ఎలాంటి ఆదేశాలు జారీచేసినా వాటిని త్రికరణశుద్ధిగా అనుసరించాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. తమపై దాడిచేసే శత్రుసేనలన్నింటినీ 23లక్షల మంది సైనికులతో కూడిన పిఎల్‌ఏ తిరుగులేని రీతిలో తిప్పికొట్టగలుగుతుందన్న ధీమాను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. పిఎల్‌ఏపై పూర్తిస్థాయి ఆధిపత్యం కలిగిన కేంద్ర మిలిటరీ కమిషన్‌కు సారథ్యం వహిస్తున్న జిన్‌పింగ్ తమ సైన్యం ప్రపంచంలోని అతిపెద్దదని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యాల మధ్య తలెత్తిన డోక్లామ్ వివాదాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించకపోయినా, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఇది అద్దం పట్టింది. డోక్లామ్‌పై రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంతోపాటు జాతీయ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకోకలిగే తిరుగులేని శక్తి చైనా ఆర్మీ సొంతమని జిన్‌పింగ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి పరిరక్షణతోపాటు ఒకే చైనా లక్ష్యాన్ని సాధించడానికి కూడా తమ సైన్యం దోహదపడగలదన్న ఆశాభావాన్ని తమ పది నిమిషాల ప్రసంగంలో వ్యక్తం చేశారు. మంగోలియా జూరిహిలోని అతిపెద్ద సైనిక స్థావరంలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా చైనా సైన్యంలోని వివిధ దళాలు తమ శక్తియుక్తులను ప్రదర్శించాయి.
దీర్ఘశ్రేణి అణు సాంప్రదాయక క్షిపణులను, కొత్తగా సమకూర్చుకున్న జె-15 యుద్ధవిమానంతోనూ చైనా ఈ సందర్భంగా విన్యాసాలు చేసింది. చైనా సైన్యం ఎప్పటికప్పుడు యుద్ధ తంత్రానికి పదును పెట్టుకోవాలని, జాతీయ రక్షణ విషయంలో ఆధునికతను సంతరించకుకోవాలని జీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్ కలిగిన దేశం చైనాయేనని తెలిపారు. దేశ రక్షణకోసం 152 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నామన్నారు. 1927 ఆగస్టు 1న మావో నాయకత్వంలో చైనా పాలన సాగుతున్న తరుణంలో పిఎల్‌ఏ ఆవిర్భవించింది. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు సారథ్యం వహిస్తున్న మావో జాతీయ విమోచన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోనే చైనా సైన్యం పనిచేస్తోంది. దీనిపై చైనా ప్రభుత్వ పెత్తనం ఎంతమాత్రం ఉండకపోవడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

చిత్రాలు.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వార్షికోత్సవంలో ప్రసంగిస్తున్న * జిన్‌పింగ్. సైనిక దళాల ప్రదర్శన