అంతర్జాతీయం

రేపు పాక్ కొత్త ప్రధాని ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 30: పదవీ చ్యుతుడైన నవాజ్ షరీఫ్ స్థానంలో కొత్త ప్రధాన మంత్రిని పాకిస్తాన్ పార్లమెంటు మంగళవారం ఎన్నుకోనుంది. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై దాఖలయిన కేసుల్లో సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనను అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త సభా నాయకుడ్ని ఎన్నుకోవడం కోసం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆదేశించారు. మరో వైపు జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్ కొత్త ప్రధాన మంత్రి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలనుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జాతీయ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం నామినేషన్ పత్రాలను స్వీకరిస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ పత్రాలను పరిశీలించి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
పాకిస్తాన్ ముస్లింలీగ్- నవాజ్ పార్టీ (పిఎంఎల్-ఎన్) ప్రస్తుతానికి షాహిద్ ఖకన్ అబ్బాసీని ప్రధానమంత్రిగా నామినేట్ చేసింది. అయితే ఆ తర్వాత నవాజ్ షరీఫ్ సోదరుడు షఎహబాజ్ షరీఫ్ ప్రధాని కావడం కోసం ఆయన తప్పుకొంటారు. గతంలో కూడా పాకిస్తాన్‌లో ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లు జరిగాయి. సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ హయాంలో ముషారఫ్ నామినేట్ చేసిన షౌకత్ అజీజ్ అధికార పిఎంఎల్‌క్యు పార్టీనుంచి ఎన్నికయ్యే వరకు చౌధరి షుజాత్ హుస్సేన్‌ను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. కాగా, మిగతా చిన్న పార్టీల సాయంతో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడం కోసం ప్రధాన ప్రతిపక్షాలయిన ఆసిఫ్ అలీ జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి), ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చర్చలు జరుపుతున్నాయి.
పంజాబ్ సిఎంగా హెహబాజ్ కుమారుడు
నవాజ్ షరీఫ్ స్థానంలో కొత్త ప్రధానిగా నియమితుడు కానున్న ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి షఎహబాజ్ షరీఫ్ తన వారసుడిగా కుమారుడు హమ్జా షాబాజ్‌ను నియమించాలని అనుకుంటున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే దేశంలో రెండవ అతిపెద్ద రాష్టమ్రైన పంజాబ్ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై తుది నిర్ణయం నవాజ్ షరీఫ్‌దేనని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలు మరో ఏడాదిలో జరుగనున్న తరుణంలో కీలక రాష్టమ్రైన పంజాబ్ రాష్ట్రంపై పట్టును కోల్పోవడానికి అధికార పిఎంఎల్-ఎన్ ఎట్టి పరిస్థితుల్లోను ఇష్టపడదని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లు ‘డాన్ న్యూస్’ పత్రిక పేర్కొంది. పంజాబ్‌లో మిగతా పదవీ కాలానికి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్న తన కుమారుడ్ని తన వారసుడిగా నియమించాలని షెహబాజ్ కోరుకుంటున్నారని, అయితే ముఖ్యమంత్రి పదవికి హమ్జా సరయిన అభ్యర్థా, కాదా అనేది నిర్ణయించేది నవాజ్ షరీఫేనని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ నాయకుడు చెప్పారు.