అంతర్జాతీయం

ఆసియాన్ బంధం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, ఆగస్టు 6: ఆసియాన్‌తో గత పాతిక సంవత్సరాలుగా భారత్ సంబంధాలు ఎన్నో కొంత పుంతలు తొక్కుతూ వస్తున్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ అన్నారు. ఈ కూటమితో సాంస్కృతికంగానూ, రాజకీయంగానూ లోతైన బంధాన్ని పెనవేసుకుంటూ వచ్చిన భారత్ మంత్రిత్వ స్థాయి సమావేశాలు, శిఖరాగ్ర సదస్సులతో మరింత చేరువైందని అన్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర భద్రత పరిస్థితుల సంస్థాపనకు ఆసియాన్ దేశాలు కీలకపాత్ర వహిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. మొత్తం ప్రపంచ విస్తృత ప్రయోజనాలకు అద్దంపట్టే శక్తియుక్తులు, సామర్థ్యం ఆసియాన్‌కు ఉన్నాయని అన్నారు. 15వ ఆసియాన్-్భరత్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె.సింగ్, ఈ ఐదు దశాబ్దాల కాలంలో ఆసియాన్ ఎంతగానో విస్తరించిందని, వలస కాలం నాటి అవశేషాలను పక్కనబెట్టి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు.
1997నాటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంనే ఈ ప్రాంత దేశాలు ఎంతగానో పురోగమించాయని, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ప్రక్రియ ద్వారా ఎంతో ప్రగతిని సాధించాయని తెలిపారు. భారత్‌కు సంబంధించినంతవరకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆసియాన్‌ది అత్యంత కీలకమైన పాత్ర అని సింగ్ తెలిపారు. మొత్తం ప్రపంచ దేశాల సాంస్కృతిక, వాణిజ్య తదితర విస్తృత లక్షణాలకు ఆసియాన్ ప్రాతినిధ్యం వహిస్తోందని తెలిపారు. ఆసియాన్‌తో భారత్ సంబంధాలు ఏర్పడి 25 సంవత్సరాలు నిండాయని పేర్కొన్న ఆయన, అన్ని విధాలుగా ఈ స్నేహబంధం విస్తరిస్తోందని వార్షిక శిఖరాగ్ర సదస్సులో మంత్రుల సమావేశాలు వీటిమధ్య నిర్ణీత కాలవ్యవధిలో జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

చిత్రం.. ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడుతున్న వి.కె.సింగ్