అంతర్జాతీయం

అమెరికా కాస్కో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, ఆగస్టు 7: తమ అణు కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా తెగేసి చెప్పింది. ఐక్య రాజ్య సమితి విస్తృతస్థాయిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో మరింతగా రెచ్చిపోయిన ఉత్తర కొరియా అమెరికాకు గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరిక స్వరాన్ని వినిపించింది. తమవద్దనున్న వ్యూహాత్మక అణుశక్తిని ఉపయోగిస్తామని, అమెరికా తమపై సైనిక చర్యకు దిగితే అదే స్థాయిలో ప్రతిఘటిస్తామని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అణు కార్యక్రమాన్నిగాని, క్షిపణి కార్యక్రమాన్నిగాన చర్చలకు పెట్టే ప్రసక్తే లేదని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ -హో ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మనీలాలో దీన్ని మీడియాకు పంచారు. కల్పిత ఆరోపణల ఆధారంగానే ఐక్య రాజ్య సమితి తమపై ఆంక్షలు విధించిందని ఆ ప్రకటనలో ఉత్తర కొరియా పేర్కొంది. తదుపరి చర్యలు చాలా తీవ్రంగానే ఉంటాయని, న్యాయం కోసం పోరాడతామనీ తెలిపింది. ఈ ఆంక్షలను బ్టి చూస్తే ఐక్య రాజ్య సమితి తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్న అభిప్రాయం కలుగుతోందనీ వ్యాఖ్యానించింది. గత నెలలో తాము జరిపిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం అన్నది మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాలే తమ లక్ష్య పరిధిలోకి వచ్చినట్టు అయ్యిందని స్పష్టం చేసింది. ఈ క్షిపణులన్నీ కూడా తాము న్యాయబద్ధంగా ఆత్మరక్షణ కోసమే రూపొందించుకున్నవేనని కూడా వెల్లడించింది. ఈ ఆంక్షలను తమ సార్వభౌమత్వాన్ని అత్యంత దారుణంగా ఉల్లంఘించడంగా పేర్కొన్న ఉత్తర కొరియా ‘ఎట్టి పరిస్థితుల్లోనూ మా అణుశక్తిని బలోపేతం చేసేకునే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’ అని కూడా తన ప్రకటనలో ఉద్ఘాటించింది. అయి తే, ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలను ఇప్పటి వరకూ దాన్ని వెనకేసుకుంటూ వచ్చిన చైనా, రష్యాలూ బలపర్చడం ఈనేపథ్యంలో అత్యంత కీలక పరిణామం. గత నెలలో రెండు ఖండాంతర క్షిపణులను ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించినప్పటి నుంచీ దాని ఆలోచనలపై అమెరికా సహా అనేక దేశాల్లో ఎనలేని ఆందోళన మొదలైంది. ఒకదాని తరువాత ఒకటిగా ఉత్తర కొరియా ఈ పరీక్షలు జరపడం పొరుగున ఉన్న దక్షిణ కొరియాలోనూ కలవరానే్న రేపింది. తాజా ఆంక్షల ప్యాకేజీని రూపొందించిన అమెరికాపై గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ తాజా ప్రకటనలో రెచ్చిపోయిన ఉత్తర కొరియా ‘మీరు చేసిన నేరానికి వెయ్యి రెట్లు మూల్యం చెల్లించుకుంటారు’ అని హెచ్చరించింది. తాము ఉత్తర కొరియాకు చాలా దూరంగా ఉన్నామని, తమ భూభాగం సముద్రంలో ఉందని అమెరికా ధీమాగా ఉండవచ్చునేమోనని పేర్కొన్న ఉత్తర కొరియా, ఇంతకుమించిన తప్పుడు అంచనా మరొకటి ఉండదని కూడా హెచ్చరించింది. ఈ తీర్మానాన్ని బలపర్చిన ఇతర దేశాలు కూడా తమ తప్పిదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.