అంతర్జాతీయం

ప్రజాస్వామిక తీర్పును కాపాడుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 10: తాము ఇచ్చిన తీర్పును కాపాడుకోవాలని, తద్వారా అప్రజాస్వామిక మార్గాల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులను తొలగించకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇటీవల పదవీచ్యుతుడైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశ ప్రజలను కోరారు. పదవీచ్యుతుడైన తర్వాత తన రాజకీయ బలాన్ని చూపించడానికి షరీఫ్ ఇస్లామాబాద్‌నుంచి తన సొంత పట్టణమైన లాహోర్ దాకా భారీ కాన్వాయ్‌తో రోడ్డు షో నిర్వహించారు. రావల్పిండిలో జరిగిన భారీ ర్యాలీలో షరీఫ్ మాట్లాడుతూ ఈ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి రావల్పిండిలో ఆగిన షరీఫ్ గురువారం లాహోర్‌కు యాత్రను కొనసాగించారు. రావల్పిండినుంచి తన యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన అక్కడి పంజాబీ హౌస్‌లో పార్టీ నేతలతో సమావేశమైనారు.
కాగా, 70 ఏళ్ల పాక్ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా తన పూర్తి పదవీ కాలం పూర్తి చేయకపోవడం విచారకరమని షరీఫ్ అన్నారు. ‘సగటున ఈ దేశంలో ప్రతి ప్రధానికి ఏడాదిన్నరకు మించి పరిపాలించేందుకు అవకాశం ఇవ్వలేదు. కొంతమందిని హత్య చేశారు, కొందరిని అరెస్టు చేశారు, మరి కొందరు ప్రవాస జీవితం గడుపుతున్నారు’ అని ఆయన అన్నారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో తాము ఎన్నుకున్న ప్రతినిధులను తొలగించకుండా తాము ఇచ్చిన తీర్పును కాపాడుకుంటామని ప్రతిన బూనాలని ఆయన ప్రజలను కోరారు. ‘మీ ప్రధానమంత్రిని ఈ విధంగా అవమానించడానికి అనుమతించబోమంటూ నాకు హామీ ఇవ్వండి’ అని ఆయన కోరారు. మీరు మీ హక్కులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మీరు ఎన్నుకొన్న నేతలను పదవులనుంచి దించేస్తారని షరీఫ్ తన మద్దతుదారులను హెచ్చరించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పును సైతం ఆయన విమర్శిస్తూ, తనపై అవినీతికి సంబంధించి ఎలాంటి ఆరోపణ లేదని జడ్జీలు అంటున్నారని, అలాంటప్పుడు తనను ఎందుకు అనర్హుడిగా ప్రకటించారని ప్రశ్నించారు. దీనిపై నిర్ణయాన్ని చరిత్రకే వదిలేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాదు మీరు ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారా అని సభకు హాజరయిన జనాన్ని ఆయన అడగ్గా, వారంతా లేదు, లేదంటూ కేకలు వేశారు. ‘ఒక కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తే ఇప్పుడు ప్రజాకోర్టు తన తీర్పు ఇచ్చింది’ అని సభకు హాజరయిన జనాన్ని చూపిస్తూ షరీఫ్ అన్నారు. కోర్టు తీర్పుపై తనకు తీవ్ర అభ్యంతరాలున్నప్పటికీ దాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పిన షరీఫ్ తనను తిరిగి పదవిలో నియమించడం కోసం పోరాటం చేయవద్దని తన అభిమానులను కోరారు. అయితే దేశాభివృద్ధికి, మెరుగుదల కోసం తనకు అండగా నిలవాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. సభ అనంతరం రాత్రి విశ్రాంతి తీసుకోవడం కోసం రావల్పిండిలోని పంజాబ్ హౌస్‌కు వెళ్లిపోగా, జనం కూడా ప్రశాంతంగా అక్కడినుంచి వెళ్లిపోయారు.