అంతర్జాతీయం

రెస్టారెంట్‌పై ఐఎస్ కాల్పులు..18 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔగాడ్వావొ, ఆగస్టు 14: ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఇస్లామిక్ మిలిటెంట్లు బీభత్సం సృష్టించారు. రాజధాని ఔగాడ్వాగొలోని ఓ టర్కీష్ రెస్టారెంట్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 18 మందిన పొట్టనబెట్టుకున్నారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఏడు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. విదేశీ రెస్టారెంట్‌పై ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఇది రెండోసారి. కాల్పులు తమపనేనని ఇప్పటి వరకూ ఏ సంస్థా ప్రకటించుకోలేదు. ఉగ్రవాదుల కాల్పుల్లో కనీసం 18 మంది మృతి చెందారని, ఎనిమిది మంది గాయపడ్డారని బుర్కినాఫాసొ సమాచారశాఖ మంత్రి రెమి డండ్జినొ స్పష్టం చేశారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులూ మృతి చెందారని ఆయన అన్నారు. మృతులందరూ విదేశీయులేనని మంత్రి చెప్పారు. మృతుల్లో ఒకరిని ఫ్రెంచ్ జాతీయుడిగా గుర్తించారు. అజీజ్ ఇస్తాంబుల్ సమీపంలో దాడి జరిగినట్టు సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2016లో ఇదే రెస్టారెంట్ వద్ద ఐఎస్ ముష్కరులు జరిపిన కాల్పుల్లో 30 మంది వరకూ మరణించారు. అజీజ్ ఇస్తాంబుల్ రెస్టారెంట్‌కు ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు మోటర్ సైకిళ్లపై వచ్చి కాల్పులకు తెగబడినట్టు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. అత్యంత పేద దేశమైన బుర్కినాఫాసొపై ఐఎస్ ఉగ్రవాదుల కాల్పులు జరపడం దారణమని ఆయన అన్నారు.