అంతర్జాతీయం

నేపాల్‌కు భారత్ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఆగస్టు 15: డబ్బై ఒకటో స్వాతంత్ర దినోత్సవం జరుపుకొన్న భారత్ పొరుగుదేశం నేపాల్‌కు ఇండిపెండెంట్స్‌డే గిఫ్టు ఇచ్చింది. నేపాల్‌లోని ఆసుపత్రులు, చారిటబుల్ సంస్థలకోసం 30 అంబులెన్స్‌లు అందించింది. వాహనాలకు సంబంధించి తాళం చెవులను ఇక్కడి భారత రాయబారి మంజీత్ సింగ్ పూరి నేపాల్ అధికారులకు అందజేశారు. ఖాట్మండులోని భారత ఎంబసీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ కానుకను అందజేశారు. ఎంబసీ ప్రాంగణంలో త్రివర్ణపతానికి ఆవిష్కరించిన మంజీత్‌సింగ్ భారత రాష్టప్రతి ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు.
ఏడు దశాబ్దాలుగా భారత్ సాధించిన ప్రగతిని ఆయన ప్రస్తావించారు. అమర జవాన్ల భార్యలకు 57.3 మిలియన్ నేపాల్ రూపాయలు, దుప్పట్లు ఆయన అందజేశారు. దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల లైబ్రరీలకు భారత్ పుస్తకాలు అందజేసినట్టు ఎంబసీ వర్గాలు తెలిపాయి.