అంతర్జాతీయం

విజరుూ విశ్వ తిరంగా ప్యారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్/మెల్‌బోర్న్, ఆగస్టు 15: ‘విజరుూ విశ్వ తిరంగా ప్యారా’ అన్నట్లు విశ్వవ్యాప్తంగా మన త్రివర్ణ పతాకం వినువీధుల్లో రెపరెపలాడింది. ప్రపంచంలోని పలు దేశాల్లో భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అనేక దేశాల్లోని భారతీయ సంస్థలు, దౌత్య కార్యాలయాలు, ప్రవాస భారతీయ సమాజాలు పెద్దఎత్తున వేడుకలను జరుపుకున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు దేశభక్తి గేయాలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లోని భారతీయ దౌత్య కార్యాలయంలో అక్కడి రాయబారి విజయ్ గోఖలే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. దౌత్యకార్యాలయంలో ప్రవాస భారతీయులను ఆయన కలుసుకున్నారు. షాంఘైలో భారత దౌత్య కాన్సులేట్ జనరల్ ప్రకాశ్ గుప్తా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత్ చైనా పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ తరుణ్ విజయ్‌తోపాటు అనేకమంది భారతీయులు పాల్గొన్నారు. గువాన్‌ఝావ్‌లో భారత దౌత్యాధికారి వైకె శైలాస్ థంగల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 150మంది భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తన సార్వభౌమత్వాన్ని సాధించుకున్న శుభ సందర్భమని ఆయన పేర్కొన్నారు. భారత దౌత్య కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏడు దశాబ్దాల్లో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో భారత్ ఆస్ట్రేలియాలు పరస్పర సహకారంతో బలమైన భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల వ్యాపారం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. మెల్‌బోర్న్ భారత దౌత్య కార్యాలయంలో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. సిడ్నీ, మెల్‌బోర్న్ సహా ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మెల్‌బోర్న్‌లో భారతీయ సినిమా పండుగలో పాల్గొనేందుకు వచ్చిన నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన కార్యక్రమంలో ఆరు వందల మంది ప్రవాస భారతీయులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. జపాన్‌లో భార దౌత్యవేత్త సుజన్ ఆర్ చినాయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఒకమైలు దూరం ఫ్రీడమ్ రన్‌ను నిర్వహించారు. ఈజిప్ట్‌లో భారత దౌత్యవేత్త సంజయ్ భట్టాచార్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ దేశంలోని వౌలానా ఆజాద్ సాంస్కృతిక కేంద్రంలోనూ జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ‘్భరత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రవాస భారతీయులు కార్యక్రమాన్ని హోరెత్తించారు. దక్షిణాఫ్రికాలోని అన్ని ప్రధాన నగరాల్లో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెటోరియా, డర్బన్, కేప్‌టౌన్, జోహనె్నస్‌బర్గ్ తదితర నగరాల్లో ప్రవాస భారతీయులు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు.

చిత్రం.. వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ వింగ్ కమాండర్ బిలాల్‌కు మిఠాయలు
అందజేస్తున్న బిఎస్‌ఎఫ్ కమాండెండ్ సుదీప్