అంతర్జాతీయం

బార్సిలోనా ఆగంతకుడికోసం ముమ్మరవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, ఆగస్టు 19: స్పెయిన్‌లో రక్తపాతం సృష్టించిన ఇద్దరు ఆగంతకుల్లో ఒకడిగా అనుమానిస్తున్న మొరాకో జాతీయుడికోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. స్పెయిన్‌లోని రెండవ పెద్ద నగరమైన బార్సిలోనాతోపాటు సముద్ర తీరప్రాంత పట్టణమైన కాంబ్రిల్స్‌లో గురువారం ఈ ఇద్దరు ఆగంతకులు తమ వాహనాలతో ఉద్ధేశ్యపూర్వకంగా పాదచారులపైకి దూసుకెళ్లి మారణ హోమాన్ని సృష్టించిన విషయం విదితమే. ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో 14 మంది మరణించగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్పెయిన్ ప్రభుత్వం, అంతలోనే తేరుకుని ప్రజలను అప్రమత్తం చేసింది. దీంతో ఈ దాడుల వెనుక ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు స్పెయిన్ దర్యాప్తు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.