అంతర్జాతీయం

ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 27: గత జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశం భారత్-అమెరికా సంబంధాలు మరింత ముందుకు సాగడానికి బలమైన పునాదిని వేసిందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో రక్షణ, ఉగ్రవాద నిరోధం ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ప్రధాని మోదీ వైట్‌హౌస్ సందర్శన ఇరుదేశాల మధ్య సంబంధాలు పురోగతిపై భారత అధికారుల్లో ఉన్న అనుమానాలను తొలగించి వేసిందని ట్రంప్ ప్రభుత్వంలోని ఆ అధికారి పిటిఐకి చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్వేచ్ఛాయుత సముద్ర మార్గాల కొనసాగింపు కోసం భారత్‌తో కలిసి పని చేయడం, వాణిజ్య స్వేచ్ఛ అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలకు కట్టుబడి ఉండడం ఇరువురు నేతలు చర్చించిన ప్రధానాంశాలని తాను భావిస్తున్నట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి గత ఎనిమిది నెలల ట్రంప్ ప్రభుత్వ కాలంలో భారత్-అమెరికా సంబంధాలను సమీక్షిస్తూ చెప్పారు. ఉమ్మడి ప్రకటనలో ఈ అంశాలు చాలా స్పష్టంగా ప్రతిబింబించాయని కూడా ఆయన చెప్పారు. రక్షణ సహకారం మోదీ పర్యటనలో ప్రధానాంశమని ఆయన అంటూ, భారత్‌కు గార్డియన్ ద్రోన్‌ల విక్రయించడానికి దాదాపు 200 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకోవడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఒక నాటోయేతర మిత్ర దేశానికి ఈ తరహా టెక్నాలజీని అందించాలని అమెరికా నిర్ణయించడం ఇదే మొదటిసారని కూడా ఆయన చెప్పారు. ఈ విక్రయానికి సంబంధించిన షరతులపై ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఈ తరహా రక్షణ ఒప్పందాలు పూర్తిగా అమలు కావడానికి కొంత సమయం పడుతుందని కూడా ఆ అధికారి చెప్పారు. ఉగ్రవాదం విషయంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య అభిప్రాయాలు చాలా వరకు కలిశాయని, ఉమ్మడి ప్రకటనలో ఈ అంశం కూడా ప్రతిబింబించిందని ఆ అధికారి గుర్తు చేశారు. ఆర్థిక, వాణిజ్య అంశాలు కాస్త సమస్యాత్మకమైనవని ఆ అధికారి అంటూ, మార్కెట్ అవకాశాలకు సంబంధించి ఇరుపక్షాలకు కూడా కొన్ని ఇబ్బందులున్నాయని, వాటిని పరిష్కరించుకోవలసిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. ఏ విధంగా చూసినా మోదీ పర్యటన ఇరుపక్షాల్లోను గొప్ప విశ్వాసాన్ని పాదుకొల్పిందని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.