అంతర్జాతీయం

బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 28: దక్షిణ ఇంగ్లండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో విప్రోలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లు ఉన్నారు. మినీ బస్సు రెండు ట్రక్కుల మధ్య చిక్కుపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవర్ల మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు మినీ బస్సులో 11 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలున్నట్టు వారు పేర్కొన్నారు. భారతీయ ఇంజనీర్లు నాటింగావ్‌లోని ఇప్రోలో పనిచేస్తున్నారని తెలిపారు. తమ సిబ్బంది అకాలం మరణంపై సంస్థ ప్రతినిధి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్తికేయన్ రామసుబ్రహ్మణ్యం పుగలూర్, రిషీ రాజీవ్ కుమార్, వివేక్ భాస్కరన్ మృతిచెందినట్టు విప్రో ఉద్యోగి వెల్లడించారు. అలాగే మనోరంజన్ పన్నీర్ సెల్వం అనే మరో ఉద్యోగి మృత్యువుతో పోరాడుతున్నాడు. మినీబస్సు డ్రైవర్ సిరియాక్ జోసెఫ్ కూడా భారత్‌కు చెందినవాడే.