అంతర్జాతీయం

‘అజేయుడు’ ఇక లేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జూన్ 4: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్, ‘అజేయుడు’ మహమ్మద్ అలీ దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని మృతి వార్త ప్రపంచ క్రీడా రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 32ఏళ్లు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడిన 74ఏళ్ల అలీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గత రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసినట్టు కుటుంబీకులు ప్రకటించారు. బాక్సింగ్ చరిత్రలోనే అత్యుత్తమ ఫైటర్ల జాబితాలో అలీది అగ్రస్థానం. అంతులేని ఆత్మవిశ్వాసానికి, లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించని పట్టుదలకు మారుపేరైన అలీ అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. వియత్నాంపై అమెరికా యుద్ధాన్ని నిరసించాడు. సస్పెన్షన్ వేటుపడినా జంకలేదు. సైన్యంలో ఉన్నతాధికారి హోదాను సైతం కాదనుకొని, ప్రభుత్వ ఆగ్రహానికి గురైనప్పుడు కూడా అలీ రాజీ పడలేదు. అసాధారణ బాక్సర్‌గా, పోరాటయోధుడిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న అలీ తనను తాను ‘ది గ్రేటెస్ట్’ అని ప్రకటించుకున్నప్పుడు కాదని వ్యతిరేకించిన వారే లేరు. అతనిపట్ల బాక్సింగ్ ప్రపంచానికి ఉన్న గౌరవం అలాంటిది. 1942 జనవరి 17న జన్మించిన అలీ అసలు పేరు కాసియస్ మార్సెలస్ క్లే. 1960లో ప్రొఫెషనల్‌గా మారాడు. కెరీర్‌లో 61 ఫైట్స్‌లో 56 గెలిచాడు. వీటిలో 37 నాకౌట్ ద్వారా సాధించిన విజయాలే. కేవలం ఐదు ఫైట్స్‌లో అతను పరాజయాలను చవిచూశాడు. అలీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీసహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.