అంతర్జాతీయం

సైనిక చర్యకు వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/జియామెన్, సెప్టెంబర్ 4: అణు పరీక్షలతో, ఖండాంతర క్షిపణలు ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాకు అమెరికా గట్టి హెచ్చరిక చేసింది. తమతో పాటు మిత్రదేశాల జోలికి వస్తే సైనిక చర్య తప్పదంటూ గద్దించింది. అమెరికా విదేశాంగ మంత్రి జైమ్స్ మట్టి ఈ మేరకు ఉత్తర కొరియాను చర్యలపై సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తర కొరియా తాజాగా హైడ్రోజన్ బాంబు పరీక్షించిన నేపథ్యంలో అమెరికా తీవ్రంగా స్పందించింది. ‘మాతోపాటు మా కూటమి దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ జోలికివస్తే సైనిక చర్య తప్పదు. మా శక్తి, సామర్థ్యాలు తక్కువ అంచనావేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని విదేశాంగ మంత్రి జేమ్స్ మట్టీస్ స్పష్టం చేశారు. అమెరికా భూభాగం లేదా ప్రాదేశిక ప్రాంతాలు, గ్యామ్‌పై దాడి జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడిన మట్టీస్ ‘ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి మా వద్ద అస్త్రాలున్నాయి’ అని ప్రకటించారు. జాతీయ భద్రత సభ్యులతో వెస్ట్‌వింగ్‌లో సమావేశమైన మట్టీస్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఉత్తర కొరియా దుందుడుగు చర్యలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో భద్రతాధికారులు సమావేశమయ్యారు. హెచ్చరికలను పెడచెవిన పెడుతూ హైడ్రోజన్ బాంబు పరీక్షకు తెగబడిన ఉత్తర కొరియాకు బుద్ధి చెప్పాలని ట్రంప్ విజ్ఞప్తి చేసినట్టు విదేశాంగ మంత్రి తెలిపారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కవ్వింపు చర్యలపై ఐరాసా భద్రతా మండలి ముక్తకంఠంతో ఖండించింది. ఉత్తర కొరియా అణు పరీక్షలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక్కడ జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కవ్వింపు చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు సడలించడానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలని సదస్సు పిలుపునిచ్చింది. ఈ మేరకు బ్రిక్స్ డిక్లరేషన్‌లో ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా గర్హించింది. కొరియా పెనెన్‌సులాలో ఉద్రిక్తతలు వాంఛనీయం కాదు. చర్చలద్వారానే పరిష్కరించుకోవాలని పేర్కొంది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను కట్టడి చేయాలని బ్రిక్స్ పిలుపునిచ్చింది. ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తూ అంశాతిని రేపుతున్న దక్షిణ కొరియాపై తొలిసారిగా చైనా అధికారిగా నిరసన తెలిపడం గమనార్హం.

చిత్రం..అమెరికా విదేశాంగ మంత్రి జేమ్స్ మట్టీస్