అంతర్జాతీయం

బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థకు చైనా ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియామెన్, సెప్టెంబర్ 4: బ్రిక్స్ దేశాల ఆర్థిక, సాంకేతిక సహకార ప్రణాళికకు 76 మిలియన్ల అమెరికన్ డాలర్లను అందించేందుకు చైనా ముందుకు వచ్చింది. దీనితోపాటు అభివృద్ధి బ్యాంక్ కొత్త బ్లాక్‌ల ప్రాజెక్టులకోసం మరో నాలుగు మిలియన్ డాలర్లు ఇస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం తెలిపారు. అయిదు దేశాల బ్రిక్స్ సమైక్యంగా ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘బ్రిక్స్ దేశాల ఆర్థిక సహకార ప్రణాళికకు 500మిలియన్ యాన్ (76మిలియన్ డాలర్లు) ఇస్తామని ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా బ్రిక్స్ దేశాలలో కొత్త అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు నాలుగు మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు అయిదు కూడా సమైక్యంగా అంతర్జాతీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవలసి ఉందని ఆయన పేర్కొన్నారు. అయిదు దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ప్రపంచ వేదికలపై ఒకే గొంతు వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ సమాజం మన సంయుక్త ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సి ఉండేలా వ్యవహరించాలి. బ్రిక్స్ దేశాలు ప్రపంచంలో బహుళత్వాన్ని, అంతర్జాతీయ సంబంధాలను, శాంతి, సుస్థిర వాతావరణాలను పాదుకొల్పేందుకు సంసిద్ధంగా ఉండాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ముందుకురావాలని ఆయన అన్నారు. ఉత్తర, దక్షిణ ప్రపంచాల మధ్య అభివృద్ధి విషయంలో అంతరాలను తొలగించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల విదేశీ పెట్టుబడులు 197 బిలియన్ డాలర్లు ఉందని, ఇది కేవలం 5.7 శాతం పెరుగుదలేనని ఆయన అన్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక రంగాలు, సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక సహకారం వంటి వాటిలో అయిదు దేశాల మధ్య పరస్పర సహకారం అత్యవసరమని ఆయన తెలిపారు.
ఉత్సాహపూరిత వాతావరణంలో..
ఉత్సాహపూరిత వాతావరణం మధ్య బ్రిక్స్ దేశాలు తొమ్మిదో సమ్మిట్ ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఐదు దేశాల అధినేతలు గ్రూప్ ఫొటోలతో బిజీబిజీగా గడిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జింపింగ్ కరచాలం చేసుకున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగున్న శిఖరాగ్ర సమావేశంలో రషా, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాధినేతలు పాల్గొంటున్నారు. చైనా పోర్టు సిటీ జియామెన్‌కు విచ్చేసి మోదీ మంగళవారం చైనా అధ్యక్షుడు జింపింగ్‌తో అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. డోక్లామ్ వివాదం తరువాత జీ, మోదీ మధ్య జరిగే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓ అంతర్జాతీయ వేదికపై పలు కీలకమైన అంశాలపై బ్రిక్స్ దేశాలు చర్చించనున్నాయి.
బ్రెజిల్ అధ్యక్షునితో మోదీ భేటీ
బ్రిక్స్ సమ్మిట్‌కు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమర్ సోమవారం ఇక్కడ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ప్రజాస్వామ్య విలువలపై ఇరు దేశాధినేతలు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆర్ కుమార్ ట్వీట్ చేశారు. గత అక్టోబర్‌లో గోవాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లోనూ మోదీ, టెమర్ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు.
మోదీ, పుతిన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సోమవారం భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ప్రపంచ అంశాలతోపాటు ద్వైపాక్షిక సహకారంపై కూడా చర్చించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఇద్దరు నేతలు విడిగా సమావేశమై భారత, రష్యా దేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వ్యాపార సంబంధాలపై చర్చలు జరిపారు.

చిత్రాలు బ్రిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమర్‌లతో కరచాలనం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.