అంతర్జాతీయం

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో, సెప్టెంబర్ 7: ప్రతిరోజు కేవలం 25 నిమిషాలు హఠయోగ, ధ్యానం చేస్తే మెదడు పని తీరుతో పాటుగా దాని శక్తి కూడా మెరుగపడుతుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. పావ్చాత్య దేశావాల్లో ఎక్కువ మంది హఠయోగాను ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కేవలం 25 నిమిషాలు హఠయోగా, లేదా మనస్ఫూర్తిగా ధ్యానం చేసినట్లయితే మెదడు పని తీరు గణనీయంగా మెరుగపడ్డమే కాకుండా, అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా వ్యక్తి ప్రవర్తన ఉండడానికి, కుంగుబాటు ఆలోచనలు, ప్రవర్తనలనుంచి బైటపడడానికి దోహదపడుతుందని ఈ అధ్యయనం జరిపిన వారిలో ఒకరైన కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పీటర్‌హాల్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 31 మందిని మూడు జట్లుగా విభజించి ఒక్కో జట్టు 25 నిమిషాలు హఠయోగా,25 నిమిషాలు ధ్యానం (మెడిటేషన్), 25 నిమిషాలు వౌన పఠనం చేసేలా చూశారు. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే విషయంలో వౌన పఠనం జరిపిన వారికన్నా కూడా హఠయోగా, ధ్యానం సాగించిన వారి పని తీరు గణనీయంగా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ‘మైండ్‌ఫుల్‌నెస్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రధాన రచయిత కింబర్లీ లూ తెలిపారు. ధ్యానం, హఠయోగ రెండూ కూడా మెదడు శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడుతాయని, అయితే ధ్యానంతో పోలిస్తే హఠయోగా మరింత మెరుగ్గా తోడ్పడుతుందని కూడా ఆయన తెలిపారు.