మంచి మాట

జ్యేష్ఠం... నక్షత్రగుచ్ఛము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలలో అసంబద్ధముగా కనపడే విషయాలు నవీన విజ్ఞానం పెరిగిన తర్వాత అద్భుత శాస్ర్తియ విజ్ఞాన అవతారాలు అవుతున్నాయి.
రామ, భరత, లక్ష్మణ, శత్రుఘు్నలలో ప్రథముడైన శ్రీరాముని జ్యేష్ఠుడుందురు. యుధిష్ఠిర, భీమార్జున, నకుల, సహదేవులలో ప్రథముడైన యుధిష్ఠిరుని పాండవ జ్యేష్ఠుడుందురు. అశ్వని, భరణి, కృత్తిక..... రేవతి ఇత్యాది 27 నక్షత్రములలో అశ్వినినీ జ్యేష్ఠా నక్షత్రమనుట లేదు. వేదాలలో నక్షత్ర క్రమము కృత్తికాదిగా ఉన్నది. కృత్తిక, రోహిణీ, మృగశిర..... భరణి ఈ విధముగా కృత్తికనైన జ్యేష్ఠానక్షతమనుట లేదు. జ్యోతిషములో కొన్ని విషయాలకు అశ్వినీ ప్రథమ నక్షత్రము వేదాలలో కృత్తిక ప్రథమ నక్షత్రము అందుకే అనాదిగా మన దేశములో అశ్వినీ నక్షత్రమునాడు పూర్ణచంద్రుడైన పూర్ణిమతో అశ్వయుజ మాసము ఐపోగా తర్వాత వచ్చు దీపావళినాడు లక్ష్మీపూజ చేసి కార్తికమాస శుక్ల పాడ్యమి నుండి మన ఆర్యవైశ్యులు కొత్త వ్యాపార గణన లెక్కల పుస్తకములు ప్రారంభింతురు. కాని చైత్రే మాసి సితే బ్రహ్మ స్వసర్జ ప్రథమే... హని అని ఉండుటచే చైత్రమాసిదిగా క్రొత్త సంవత్సరమును లెక్కించుచున్నాము. ఆ చైత్ర శుక్ల పాడ్యమినుండియే శక కాలమునకు పంచాంగములను సరిచేసికొని అహర్గణన ప్రారంభింతురు.
కాని మన 27 నక్షత్రాలలో అశ్విన్యాదిగా 18వ నక్షత్రమునకు వేదములు జ్యేష్ఠ అను నామమును ఇచ్చినవి. ఇందులో విశేషమేమిటి అనగా ‘‘అనూరాధా జ్యేష్ఠ్యాంతం వృశ్చికం’’ అనుటచే సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ మాసములలో రాత్రి 8, 9 గం.ల మధ్యలో దక్షిణాకాశము వైపు చూచినచో తేలు ఆకారములలోనే ఎన్నో చుక్కలు ఉండి తోక చివర్లో పైకి ఒంపు తిరిగి ఆ చివరి నక్షత్రము ఆ తోక ముల్లు పదునుగా ఉండవలె కనుక మినిక్ మినిక్‌మని జ్యేష్ఠ నక్షత్రము మిక్కిలి సన్నగా ఉండును. మన సాధారణమైన దృష్టికి అరుంధతి నక్షత్రమంత సన్నగా ఉన్నట్టు కనపడును. దానికి వేదము జ్యేష్ఠా అను పేరు పెట్టినది. జ్యేష్ఠా అనగా పెద్దది అని అందరికి తెలియును. మరి అంత సన్నగా ఉన్న దానికి పెద్దది అను అర్థమిచ్చు జ్యేష్ఠా అను పేరు వేదములు ఎందుకు పెట్టినవి? ఆ నక్షత్రమునకు దేవజ్యేష్ఠుడైన ఇంద్రుడు అధిపతి అట. అనగా ఇంద్రలోకము ఆ జ్యేష్ఠా నక్షత్రములో భ్నదని తలంపవలెను. కాని నవీన ఖగోళ శాస్తమ్రు ప్రకారము జ్యేష్ఠా నక్షత్రమునకు ‘‘అంతేరే’’ అని పేరు ఆ నక్షత్రమట నవీన ఖగోళ శాస్తమ్రులో వ్రాసినారు, అది ఒక నక్షత్రము కాకపోవచ్చునట. అది అనేక నక్షత్రముల గుచ్ఛముల (గెలాక్సీ) సముదాయము కావచ్చునట. ఇది ఒక నోవానో, నెబ్యూలానో కావచ్చునట. కాని మనకు సన్నటి ఒక తార వలె కనపడును. మరి అనేక నక్షత్రముల సముదాయమైన నోప అని తెలియుట చేతనే కదా. ఇంద్రో జ్యేష్ఠానామధిపతిః అని జ్యేష్ఠా అని ఒక తారగా కాకుండా జ్యేష్ఠానాం బహువచనములో చెప్పుటచే అనేక తారల సముదాయమని తెలిసినట్లగుచున్నది.
ఈ విధముగా నవీన విజ్ఞానము అధికమగుకొలది వేదాలలో అసంబద్ధముగా కనపడే విషయాలు అద్భుత శాస్ర్తియ విజ్ఞానావతారాలు అగుచున్నవని అందరును గ్రహించవచ్చును. ఇట్లు చాలా పెద్దగా ఉన్న నక్షత్ర సముదాయం అంతులేని దూరము ఉండుటచే సూది మొనంత చిన్నగా కనపడుచున్నది. వేదము అపౌరుషేయము కనుక ఇది చాల పెద్ద నక్షత్ర గుచ్ఛమని గ్రహించుటచే దీనికే జ్యేష్ఠా (పెద్దది) నామకరణము చేసెను ఇదే వేదము యొక్క అద్భుత అపౌరుషేయత్వమునకు ప్రమాణము.

- బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ