కిట్టూకు ఆదరణ బ్రహ్మాండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్ కథానాయకుడు ఎ.కె.మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వంశీకృష్ణ దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం రూపొందించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ పరీక్షలు ఉన్నాగానీ, సినిమాను విడుదల చేయడానికి ఆలోచించామని, అయితే తాము అనుకున్నదానికన్నా మూడు రెట్లు విజయాన్ని భారీ ఓపెనింగ్స్ రూపంలో ప్రేక్షకులు అందించారని, ఆ సక్సెస్‌లో అందరికీ బాధ్యత ఉందని తెలిపారు. కథను నమ్మి మాకేం కావాలో నిర్మాత సమకూర్చడంతో తాము ఈ విజయం సాధించామని, పృథ్వి పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని, రాజ్‌తరుణ్ ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో తాను సీరియస్ రోల్ చేశానని, తొలిసారిగా దర్శకుణ్ణి చూసి సినిమా హిట్టవుతుందని భావించానని నటుడు సమీర్ తెలిపారు. చిన్న చిన్న విషయాలను కూడా వదలకుండా కేర్ తీసుకుని రూపొందించిన ఈ సినిమా అందరికీ నచ్చడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రూపొందించిన ఈ సినిమాతో నిర్మాత మరో సక్సెస్‌ను కొట్టారని, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని నటుడు ప్రవీణ్ తెలిపారు. వేసవిలో చల్లని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారని, ‘కుమారి 21ఎఫ్’ సినిమా రికార్డులను క్రాస్ చేసిందని, దర్శకుడు పని రాక్షసుడిలా ఔట్‌పుట్ రాబట్టడంలో విజయవంతమయ్యారని, నటుడు పృథ్వి తెలిపారు. ఓ మంచి కథను నమ్మి నిర్మాత ఈ చిత్రాన్ని రూపొందించారని అందుకు తగిన విధంగా దర్శకుడు కూడా అందరికీ నచ్చేలా కథను, స్క్రీన్‌ప్లేను రాసుకోవడం ప్లస్ అయ్యిందని, అనూప్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ అని కథానాయకుడు రాజ్‌తరుణ్ అన్నారు. అను ఇమ్మాన్యుయల్ గ్లామర్‌గా కనబడుతూ మంచి ప్రతిభ చూపిందని, ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాజారవీంద్ర, స్నిగ్ధ, సుదర్శన్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.