అంతర్జాతీయం

కుడంకుళం కర్మాగారం జాతికి అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కుడంంకుళం అణు విద్యుత్‌ కేంద్రం ప్రారంభం ద్వారా భారత్‌, రష్యా మధ్య సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రష్యా సహకారంతో నిర్మించిన ఈ అణువిద్యుత్‌ కేంద్రంలోని మొదటి యూనిట్‌ను నరేంద్రమోదీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేశారు. వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల కుడంకుళం మొదటి యూనిట్‌ నిర్మాణం 2002లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.