లిప్‌లాక్‌కు సై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేసి స్టార్ హీరోయిన్ రేసులో ఉంది. ప్రస్తుతం మహేష్ సరసన ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్న రకుల్, మరోవైపు కోలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. తమిళంలో కార్తీ సరసన ‘్ధరన్ అధికారన్ ఒండ్రు’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ భామ తాజాగా లిప్‌లాక్ సన్నివేశాలకు సిద్ధమంటూ కామెంట్ చేయడం విశేషం. అవసరమైతే సన్నివేశాల డిమాండింగ్ మేరకు లిప్‌లాక్ సన్నివేశాల్లో నటిస్తానని ఓ సందర్భంలో చెప్పింది. గతంలో ఎట్టి పరిస్థితుల్లో లిప్‌లాక్ సన్నివేశాలు చేయనని శపథం చేసిన రకుల్, ఎందుకిలా మారిందని షాక్ అవుతున్నారు సినీ జనాలు. మొత్తానికి హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవాలంటే ఇలాంటివన్నీ తప్పదని తెలుసుకున్నట్టుంది.