అంతర్జాతీయం

జర్నలిస్టుల పాలిట మరుభూమి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం * తాజా నివేదిక వెల్లడి
లండన్, డిసెంబర్ 29: మీడియా సిబ్బందికి సంబంధించి భారతదేశం పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌కన్నా కూడా ఆసియాలో అత్యంత ప్రమాదకరమైందని అంతర్జాతీయ మీడియా నిఘా సంస్థ ఒకటి తన వార్షిక నివేదికలో అభిప్రాయపడింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 110 మంది జర్నలిస్టులు మృతిచెందగా, ఒక్క భారత్‌లోనే తొమ్మిది మంది రిపోర్టర్లు హత్యకు గురయ్యారని ‘రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్’ (ఆర్‌ఎస్‌ఎఫ్) నివేదికలో తెలిపింది. 2015లో భారత్‌లో ఇప్పటివరకు 9 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని, వీరిలో కొంతమంది వ్యవస్థీకృత నేరాలు, రాజకీయ నాయకులకు అలాంటి వాటితో సంబంధాలుండడం, అక్రమ మైనింగ్‌లాంటి వాటిపై కథనాలు రాసినందుకు హత్య చేయబడ్డారని ఆర్‌ఎస్‌ఎఫ్ పేర్కొంది. జర్నలిస్టులపై హింస విషయంలో పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌లకన్నా కూడా భారత్ ముందుందని వారి మరణాలు నిరూపిస్తున్నాయని ఆ సంస్థ అభిప్రాయపడింది. జర్నలిస్టుల రక్షణకు ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని తమ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని, జర్నలిస్టులకు ఎదురవుతున్న ప్రమాదం స్థాయికి తగిన విధంగా స్పందన అత్యవసరమన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 110 మంది జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా చనిపోయారని, వీరిలో 67 మంది జర్నలిస్టులు విధినిర్వహణలో చనిపోగా, మరో 43 మంది అస్పష్టమైన కారణాల వల్ల చనిపోయారని సంస్థ తెలిపింది. జర్నలిస్టుల రక్షణకు ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా ఆ సంస్థ తెలిపింది. వీరిలో మూడింట రెండు వంతుల మంది శాంతిగా ఉన్న దేశాల్లో చనిపోవడం గమనార్హం. ఈ ఏడాది చనిపోయిన 110 మంది జర్నలిస్టులకు ఎమర్జెన్సీతో సమానమైన స్పందన అవసరం. జర్నలిస్టుల భద్రతకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి చెందిన ప్రత్యేక ప్రతినిధిని తక్షణమే నియమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా, జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో సిరియా ప్రథమ స్థానంలో ఉండగా, ఫ్రాన్స్, బ్రెజిల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని అమెరికాకు చెందిన ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టు’ తెలిపింది.