అదిలాబాద్

మహిళా డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 21: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి ప్రమాణాల సంస్థ (న్యాక్) గుర్తింపు లభించింది. ఈ కళాశాలను యూజిసి పరిధిలో ‘బి’గ్రేడ్ హోదా రావడంతో అదే స్థాయిలో నిధులు కూడా మంజూరు కానున్నాయి. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నత ప్రమాణాల స్థాయి మెరుగుపడడంతో ఈ కళాశాలకు జాతీయ స్థాయి న్యాక్ గుర్తింపు లభించడం గమనార్హం. ప్రభుత్వం యూజిసి కింద రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టనుంది. ముఖ్యంగా కళాశాల విద్యార్థినిల కోసం వౌలిక వసతులు, బోదన పద్దతులు, ల్యాబ్‌ల ఉన్నతీకరణ, క్రీడావిభాగాలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. గత డిసెంబర్ మాసంలో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి ప్రమాణాల సంస్థ ప్రతినిధుల బృందం మహిళా కళాశాలను పరిశీలించిన పిమ్మటే న్యాక్ గుర్తింపులో చోటు లభించడం గమనార్హం. మహిళా డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి హోదా లభించడంతోయూజిసి విశ్వవిద్యాలయం నిధుల నుండి 12వ ఆర్థిక సంఘం ప్రణాళికలో భాగంగా రూ.2కోట్ల నిధులతో అభివృద్ధి చేయడమే గాక బోధన పద్ధతులను మరింతమెరుగుపర్చి కళాశాలలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పనున్నారు. విద్యార్థినిల సంఖ్య పెరుగుతుండడం, ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో రావడంతో ఈ కళాశాలకు ప్రైవేట్ కళాశాలకు దీటుగా ముందుకు సాగుతోంది. సామాజిక అంశాలపై వివిధ కార్యక్రమాలు కూడా త్వరలో నిర్వహించనున్నారు. క్రీడా రంగంలోను విద్యార్థినిలు ప్రతిభకనబర్చి జాతీయ స్థాయిలో రాణించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ మహిళా కళాశాలకు న్యాక్ గుర్తింపు రావడం పట్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్, సీనియర్ లెక్చరర్ దేవేందర్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ కళాశాలను మరింత అభివృద్దిలో తీసుకవచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తామని, ముఖ్యంగా వౌలిక వసతులు, కనీస అవసరాలు గుర్తించి చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.