శ్రీకాకుళం

మాయలోళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయలోళ్ళు
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
జిల్లాలో రెండు వందలకు పైగా మందుల దుకాణాలకు మార్చి మాసాంతానికి తాళాలు పడనున్నాయి. ఈ మేరకు ఆయా దుకాణాల యాజమాన్యాలు సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లాలో కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు వ్యాపారంలో కలకలం రేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 700 రిటైల్ మందుల దుకాణాలతోపాటు వందకుపైగా హోల్‌సేల్ దుకాణాలు జిల్లాలో ఉన్నాయి. వీటిలో గత ఏడాది డిసెంబరులో 74 దుకాణాలు బోర్డులు తిప్పేసి, వేరొక వ్యాపారాలను వెతుకుంటున్నాయి. వీటిలాగే మరో రెండునెలల తర్వాత ఏకంగా రెండువందల దుకాణాలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి.
మూడు పైసలకు లభించే ఫార్మా ముడిసరుకు ట్యాబ్‌లెట్‌గా రూపాంతరం చేసేందుకు 15 పైసల వరకూ ఖర్చు చేస్తే, దానిపై పది పైసలు లాభంతో ఫార్మా కంపెనీ ముడిసరుకునే కిలోల చొప్పున్న అమ్మకాలు చేస్తోంది. దీనిని 70 నుంచి 80 పైసల వరకూ పెంచుకుపోతూ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు తమ బ్రాండ్‌తో ట్యాబ్‌లెట్స్‌ను మార్కెట్‌లోకి ప్రొపగాండా కమ్ డిస్ట్రిబ్యూటర్స్(పిసిడి) విధానంలో విడుదల చేస్తూ కెమిస్టుల అవతారమెత్తాయి. ట్యాబ్‌లెట్స్ రూపాలను మార్చేసి రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ అంతా రెండేళ్ళ కిందటే వచ్చింది. కానీ, జిల్లాకు మాత్రం కొద్ది నెలల కిందటే పరిచయమైంది. కొన్ని ఆసుపత్రుల్లోని ఫార్మా కౌంటర్‌లో ఈ పిసిడి విధానాన్ని అడ్డం పెట్టుకుని, డాక్టర్ చీటి వెళ్లేపనిలేకుండా మందులు అమ్ముకుంటున్నారు. మందులు అమ్మాలంటే ఆ దుకాణానికి ఫార్మాటిక్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనుమతులు తప్పనిసరి. కొన్ని నిబంధనలకు లోబడి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఇటువంటి దుకాణాలకు అనుమతిస్తారు. చీటి ప్రకారం ఆ యజమానులు మందులను విక్రయించాలి. అయితే, జిల్లాలో కొందరు పెద్ద వైద్యుల నుండి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల వరకు సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. వీరికి ఏ లైసెన్సులు అవసరంలేదు. నేరుగా మందుల కంపెనీల రిప్రజింటేటివ్‌లు, హోల్‌సేల్ డీలర్ల వద్ద నుండి మందులు కొనుగోలు చేసుకొని తమవద్దే ఉంచుకొని రోగులకు నేరుగా అందజేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మందుల దుకాణం పెట్టుకున్న యజమానులు దివాళా తీసే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా యాంటీబయోటిక్ ఇంజక్షన్లు, మాత్రలు, బలం టానిక్‌లు తమ వద్ద నిల్వఉంచుకొని రోగులకు నేరుగా అమ్మేస్తున్నారు.
ప్రధానంగా విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి రోగాలు వచ్చినప్పుడు రోగులతో నేరుగా వైద్యం ఖర్చులు, మందులతో సహా ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి జ్వరాలు వచ్చినప్పుడు ఆ రోగికి వారం రోజులు వైద్యం రెండుపూటలా అందించాల్సి ఉంది. ఇక అతిసారం వచ్చినప్పుడు కూడా రోగులకు సెలైన్‌లు అధికమొత్తంలో పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలైన్‌లు కూడా నేరుగా తెప్పించుకొని రోగులకు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని మందుల కంపెనీల రిప్రజింటెటివ్‌లు గ్రామీణ ప్రాంత వైద్యులతో ఒప్పందాలు కుదుర్చుకొంటున్నారు. ఇందులో
ఎంబిబిఎస్ నుండి ఆర్‌ఎంపి, పిఎంపిలు కూడా ఇదే తరహా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. ఆ కంపెనీల నుండి శక్తి, బలం ఇచ్చే టానిక్‌లని రోగులకు వైద్యులు అంటకడుతున్నారు. ఒక లక్ష్యం ప్రకారం ఈ టానిక్‌లు అమ్మితే వైద్యులకు ద్విచక్రవాహనాలు, ఖరీదైన విద్యుత్ గృహోపకరణాలు బహుమతులుగా అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొద్దిరోజులుగా ఔషధ నియంత్రణ శాఖ ఇన్‌స్పెక్టరు కార్యాలయం జిల్లాలో గల మందుల దుకాణాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది. ఇప్పటికే 80 శాతం పూరె్తైన ఈ ప్రక్రియలో ప్రొపగాండా కమ్ డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు మాత్రం పొందుపరిచేందుకు అనే్వషిస్తున్నా జతకావడంలేదు.
దీనివల్ల రానున్న రోజుల్లో మందుల దుకాణాల యాజమాన్యాలకు తీవ్రమైన నష్టం జరుగుతోందన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ, పిడిసి విధానంపై నిఘా అంతం తమాత్రమేనన్న విమర్శలు ఉన్నాయి.

మండల స్థాయిలోనే ధాన్యం కొనుగోలు
నరసన్నపేట, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డిఆర్‌డిఎ పిడి పి.తనూజారాణి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్క రైతు వారికి సంబంధించిన వివరాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని అమ్మజూపాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని పక్కాగా పూర్తిస్థాయి వివరాలతో మాత్రమే ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. అయితే, ఇటీవల అమ్మిన ధాన్యానికి అనుకున్న సమయంలో డబ్బులు రావడంలేదంటూ రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించే దిశగా తమవంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. దళారులను ఎటువంటి పరిస్థితుల్లో ఆశ్రయించకూడదన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల తీరును పరిశీలిస్తూనే ఉన్నామని ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా పనిచేస్తున్నామని ఆమె స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం గోవిందరాజులు, ఎంఎంఎస్ అధ్యక్షురాలు అరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

సర్వేయర్ ఇంట్లో జెసి తనిఖీలు
హిరమండలం, జనవరి 23: హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సుభలై కాలనీ మెయిన్ రోడ్డులో నివాసముంటున్న పాతపట్నం సర్వేయరు రెడ్డి గవరయ్య ఇంట్లో జెసి వివేక్‌యాదవ్ సోదాలు నిర్వహించారు. గతంలో సర్వేయరు గవరయ్య హిరమండలంలో పనిచేశారు. అప్పట్లో సర్వేయరు పలు అవినీతులకు పాల్పడినట్టు నిర్వాసితులు ఆరోపణలు చేస్తూ జెసి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జేసి సర్వేయరు గవరయ్య నివాసానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాసితులు పట్టాలు, పాసు పుస్తకాలు, రబ్బర్ స్టాంప్‌లు మొదలైనవి లభమయ్యాయి. వీట్లో హిరమండలం మండలంతోపాటు, గతంలో ఈయన పని చేసిన భామిని మండలం, ప్రస్తుతం పని చేస్తున్న పాతపట్నం మండలాలకు సంబంధించిన విలువైన పత్రాలను గుర్తించారు. అంతేకాకుండా సర్వేయరు చొర్లంగి గ్రామంలో ఉన్న ఇంట్లో కూడా సోదలు నిర్వహించి పలు రకాలు రెవెన్యూ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలను పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యతోపాటు ఎస్‌డి సిలకు అప్పగించారు. ఈయన వెంట తహశీల్దారు రామారావు ఉన్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని

విజయవంతం చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 23: ఈ నెల 26న జరగనున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 25న ప్రతీ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్దను, మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలో ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముందుగా ఓటర్లు నమోదుపై స్కూలు విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రంలో బాపూజీ కళామందిర్‌లో నుండి ర్యాలీని ప్రారంభించి అంబేద్కర్ ఆడిటోరియం వరకు కొనసాగుతుందని చెప్పారు. ర్యాలీలో అన్ని ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎన్.సిసి విద్యార్థులను, జూనియర్ ఓటర్లు, సీనియర్ సిటిజన్స్, మహిళలు, మహిళా సంఘాల సభ్యుల పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, రంగవళ్లులు, ముగ్గుల పోటీలు వంటి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అదే రోజు ప్రతీ పోలింగ్
కేంద్రం వద్ద ఓటర్లు నమోదు కార్యక్రమం ఉంటుందని, యువ ఓటర్లు నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
బాల్య వివాహాలను ఆపుదాం
పుస్తకాలు పట్టుకునే వయస్సులో పుస్తెల భారం వద్దంటూ బాల్య వివాహాలను ఆపుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ బాలికల దినోత్సవంను పురస్కరించుకొని కలెక్టర్ బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ కలిసి నడుద్దామని శనివారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి దశలో కొన్ని పసిమొగ్గలు బాల్య వివాహం అనే దురాచారానికి బలి అవుతున్నారని, ఈ అకృత్యాన్ని అరికట్టి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన వివాహ వయస్సు అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు అని ఈ వయస్సులోపల వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహం చేసినవారు, పురోహితులు, పాల్గొన్న వారు, ఫోటో, వీడియోగ్రాఫర్లు తోపాటు సహకరించినవారికి నేరస్తులుగా పరిగణించి లక్షరూపాయల జరీమానా లేదా రెండు సంవత్సరాల జైలు శిక్ష, లేదా రెండు కలిపి శిక్ష విధిస్తారని తెలిపారు.
ఆనందంగా చదువుకోండి: కలెక్టర్
సీతంపేట: గిరిజన విద్యార్థులు ఆనందంగా ఉండాలని, మానసిక స్థైర్యంతో ముందుకు నడవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మినృసింహాం సూచించారు. శనివారం స్థానిక పిఎంఆర్‌సి కేంద్రంలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు శారీరక, మానసిక ఆరోగ్యం అనేది మన దినచర్యపై ఆధారపడి ఉంటుందన్నారు. రాబోయే ఏడాది నుండి నూతన వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల నుండి ఆరోగ్యంతో పాటు వారి దినచర్యకు సంబంధించి అన్ని వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసేలా చూస్తామన్నారు. ప్రతీ రోజు నిద్రించే ముందు డైరీ రాసుకునే అలవాటు చేసుకుంటే మంచిదని అన్నారు. రేపటి నుండి గిరిజన విద్యార్థుల్లో కొన్ని మార్పులు కోరుతున్నట్టు ఆయన చెప్పారు. నిర్మలమైన మనస్సుతో పదో తరగతి పరీక్షలు రాయాలని, తద్వారా మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ జల్లేపల్లి వెంకటరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు సవరతోట మొఖలింగం, ఏపి ఓ శామ్యూల్, డిడి ఎంపివి నాయక్, డిప్యూటీ డిఇఓ మల్లయ్య, సర్పంచ్ భారతి, సిఎంఓ శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోకేష్‌కు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసుల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మంత్రి తన పిల్లలతో కలిసి లోకేష్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమానికి చేస్తున్న కృషిని కొనియాడారు.
రాష్టస్థ్రాయి అర్చరీ పోటీలకు జిల్లా జట్టు
బలగ, జనవరి 23: స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి జూనియర్, మినీ సబ్ జూనియర్ బాలబాలికల అర్చరీపోటీలు శనివారం నిర్వహించారు. ఆర్చరీ ఇండియన్ రౌండ్ బాలుర పోటీల్లో కవిటి మండలానికి చెందిన డి.బలరాం, పాతపట్నం మండలం సీదికి చెందిన ఎన్.రవికుమార్, అదే గ్రామానికి చెందిన ఏ.అశోక్‌లు పోటీల్లో గెలుపొందారు. బాలికల విభాగంలోవంగరమండలం ఏపిఆర్‌ఎస్‌కు చెందిన ఏ.శిరీష, కె.శాంతిలు విజేతలుగా నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 28వ తేదీ ఉదయం ఏడుగంటలకు స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంకు వయస్సు ధ్రువీకరణపత్రం, మూడు పాస్‌పోర్టుసైజ్ ఫోటోలు, ఆధార్ కార్డుతో హాజరు కావాలని పేర్కొన్నారు. రాష్టస్థ్రాయి పోటీలు విజయవాడలో జరుగుతాయని జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి ఎల్.చిట్టిబాబు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
శ్రీకాకుళం(టౌన్), జనవరి 23: హెచ్‌సియూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద దగ్ధం చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను బర్తరఫ్ చేయాలని, విసి అప్పారావులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కెవిపియస్ జిల్లా కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ సంఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా ప్రధాన మంత్రి, రాష్టప్రతి స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఈ ఘటనపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోరు మెదపపోవడం చూస్తుంటే రాజకీయ దురుద్దేశంతోనే వీరు ఉన్నారన్నారు. తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వై.చలపతిరావు, ప్రవీణ్‌కుమార్, సత్యంనాయుడు పాల్గొన్నారు.

దిశానిర్దేశం చేయగలిగేది యువతే

నరసన్నపేట, జనవరి 23: ఏ దేశమైన.. ఏ రాష్టమ్రైన... ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే యువతే కీలక బాధ్యత వహించాలని అంబేద్కర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ హెచ్.లజపతిరాయ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని జమ్ము గ్రామంలో ఏర్పాటు చేసిన జాతీయ సేవా పథకంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి యువత ప్రభుత్వంపై ఆధార పడకుండా నిరుద్యోగ సమస్యను తేలికగా నిర్మూలించుకోవచ్చునని అన్నారు. ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న దృక్పథాన్ని విడనాడాలని కోరారు. ఎందరో మహానుబావుల ఉన్నా మనదేశంలో ప్రతీ ఒక్క నిరుద్యోగికి ఏ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉద్యోగాలను కల్పించలేదని భవిష్యత్‌లో తెలివైన విద్యార్థి మరో పదిమందికి ఉపాధి కల్పించే దిశగా యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కన్న ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవడంలో యువత సఫలీకృతం కావాలన్నారు. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ సంస్థల ద్వారా మన రాష్ట్రానికి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జాతీయ సేవా పథకంలో సేవ ఒక్కటే పరమావతి కాదని త్యాగంతో కూడుకున్న సేవ పదిమందికి ఆదర్శప్రాయం కావాలని సూచించారు. దీనిని ఎందరో మహానుబావులు పాటించడంవలనే వారిని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని కొనియాడుతున్నారన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో వౌలిక వసతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక నివేదికను తయారు చేసి విద్యార్థులు అందించగలిగితే ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుతామని హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ సంజీవరావు, ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రలోభాలకు గురికావద్ద్దు
గార, జనవరి 23: ఆకర్షణకు ప్రేరేపితం అయ్యే విధంగా సమాజంలో పరిస్థితులు నెలకొంటున్నాయని, ఈ దృష్ట్యా బాలికలు ప్రలోభాలకు గురికావద్దని ఐ.సి.డి.ఎస్. సి.డి.పి.ఓ. హైమావతి హెచ్చరించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఎస్.పి.ఎన్. డిగ్రీ కళాశాల, సాలిహుండాం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు సమాజ స్థితిగతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలు అధిగమించి ఉజ్వల భవితను సొంతంగా చేసుకోవాలని సూచించారు. నిరంతరం విద్యాభ్యాసంపై దృష్టి సారించాలన్నారు. కిశోర బాలికలకు విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, సమాజ స్థితిగుతులపై కనీసం ప్రాథమికమైన అవగాహన అవసరమన్నారు. బాల్య వివాహాలు వలన ఎన్నో అనర్థాలు చోటుచేసుకుం టున్నాయని, కిశోర బాలికలు బాల్య వివాహాలు పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్. సూపర్‌వైజర్ అరుణకుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు, కస్తూరిబా విద్యాలయం ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
ఓటు విలువ తెలపండి
సారవకోట, జనవరి 23: జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈనెల 25న మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటు విలువను తెలియజేయాలని బూత్ లెవల్ అధికారులకు తహశీల్దార్ ఈశ్వరమ్మ ఆదేశించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25న ప్రజాప్రతినిధులు ఓటర్లను ఆహ్వానించి సీనియర్ ఓటర్‌ను సన్మానించాలని ఆమె సూచించారు. ప్రతీ ఎన్నికలలో విధిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లను చైతన్య పరచాలని ఆమె సూచించారు. మరణించిన వారిపేర్లను ఓటర్ల జాబితానుండి తొలగించి అర్హత గలవారందరికీ ఓటు హక్కు కల్పించడానికి డిఎల్‌వోలు కృషి చేయాలని ఆమె కోరారు. గ్రామస్థాయిల వద్ద అన్ని శాఖల అధికారులను స్వయంశక్తి సంఘాల మహిళలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులుగా చేయాలని ఆమె హితవుపలికారు. మండలంలోగల 55 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బిఎల్‌ఓలు రెవెన్యూ పరిశీలకులు, గ్రామపరిపాలనాధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో సుభాస్ చంద్రబోస్ జయంతి
శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: భారతీయ జనతా పార్టీ నగరశాఖ ఆధ్వర్యంలో శనివారం నేతాజీ సుభాస్‌చంద్రబోస్ జయంతి వేడుకలు స్థానిక ఆర్ట్స్‌కళాశాల రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముఖ్య కారకుడు నేతాజి సుభాస్ చంద్రబోస్ అని తెలిపారు. నేతాజీ అదృశ్యమై ఇంతకాలమైన దేశ ప్రజల మనస్సులో ఆయన దాగి ఉన్నారన్నారు. నేతాజీ స్థాపించిన అజాద్ హింద్ పౌజ్ సమర్థ సైనిక సామర్థ్యాన్ని గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం దేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు సిద్ధపడ్డారన్నారు. సుభాస్ చంద్రబోస్ రికార్డులను బయట పెట్టి దేశ ప్రజలకు నిజాలు తెలియజేయడానికి బిజెపి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, రెడ్డి భాగ్యలక్ష్మి, ఈశ్వరమ్మ, తమ్మినేని పురుషోత్తం, సంపతిరావు రమణమూర్తి, దయాసాగర్, సత్యనారాయణ, రమేష్‌బాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేడు హిందూస్థానీ సంగీత విందు
శ్రీకాకుళం(కల్చరల్), జనవరి 23: వారణాశికి చెందిన సుప్రసిద్ధ బెనారస్ హిందూ యూనివర్శిటీ కళాకారులు హిందూస్థానీ శాస్ర్తియ సంగీత కచేరీలతో ఆదివారం సంగీతాభిమాలనులకు వీనుల విందు చేయనున్నారు. మిత్రా సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళామందిరంలో ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు జాతీయ యువజనోత్సవాలలో బంగారు పతకం సాధించిన యువ సితార వాయిద్య కళాకారుడు అంకుర్ మిశ్రా సంగీత కచేరి జరుగుతుంది.

సమస్యలకు పరిష్కారం చూపించండి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 23: బాలల హక్కుల పరిరక్షణకు సమస్యలు ఏకరువు పెట్టడం మానుకొని పరిష్కార మార్గాలు చూపితే బాగుంటుందని జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఐసిడియస్, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణపై మేథావుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
దేశ సౌభాగ్యంలో పిల్లలు లేని సమాజం ఊహించలేమని, వారి రక్షణపైనే సమాజం ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇంటిలోపల, బయట బాలలకు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లలపై దుష్టశక్తుల ప్రేరేపణలు పనిచేస్తున్నాయని, దీంతో వారు మోసపోతున్నారని తెలిపారు. ఇటీవల జిల్లాలో ఆడపిల్లలపై ఇటువంటి మోసం చేసే కేసులు అధికంగా నమోదు అవుతున్న విషయాన్ని ఆయన ఉదహరిస్తూ వీటన్నింటిపైన నిరంతర చర్చ, అవగాహన అవసరమన్నారు. ఇటువంటి వాటిపై కొన్ని సందర్భాల్లో చట్టాలను పక్కనబెట్టి మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవలసి ఉందని పేర్కొన్నారు. పిల్లలకు కుటుంబ పోషణ కరవై, తండ్రి మృతిచెందిన ఆడపిల్లల విషయంలో ఇటువంటివి అధికమన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో వారు సామాజికంగా ఏవిధంగా అధిగమించాలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో చట్టాల అమలు సాధ్యం కాగలదన్న ఆకాంక్షను వెల్లడించారు. జిల్లాలో ప్రధానంగా వలసలు అధికంగా ఉండటం, నిరక్షరాస్యత వంటి కారణాలతో బాల నేరాలు, బాల్య వివాహాలు సంబవిస్తున్నట్టు పేర్కొన్నారు.
కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, ఐసిపియస్ అధికారి కె.వి.రమణ, బాలల సంక్షేమ సమితి చైర్మెన్ పి.సన్యాసప్పారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, ఎపిపి పాలిశెట్టి మల్లిబాబు, గీతా శ్రీకాంత్ పాల్గొన్నారు.