అదిలాబాద్

మిషన్ భగీరథ విజయవంతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రారంభించిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు మిషన్ భగీరథ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై ట్యాంకు నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు, ఎల్ అండ్ టి ప్రతినిధులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. కంకాలమ్మ గుట్టపై నిర్మించే ప్రతిపాదిత స్థలం దాని వివరాలు, ఎత్తు, దాని ద్వారా అందించే తాగునీరు, అందులో లబ్ధి పొందే గ్రామాలు, కుటుంబాలపై పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం లోటుపాట్లను, ఇబ్బందులను స్థానిక మిషన్ భగీరథ డిఇ నాగేశ్వర్ రావు, ఎల్‌అండ్‌టి ప్రాజెక్టు మేనేజర్ సుబ్రహ్మణ్యం పేర్కొనగా, వాటిపై అప్పటికప్పుడే స్పందించి కంకాలమ్మ గుట్టపై మెట్ల వద్ద అన్నివిధాలా అనుకూలమైన పరిస్థితులున్నాయని, అక్కడే తగినంత ఎత్తులో ట్యాంకు నిర్మాణం చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పాన్ని నెరవేర్చేందుకు చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే పనులు ప్రారంభించడంతో పాటు స్థల నిర్ధారణ జరిపి ఈ మిషన్ భగీరథలో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహా ఇతర మంత్రుల ఆదేశాలతో పనులను వేగవంతం చేసి లక్ష్యాన్ని చేరుకునేందుకు కాంట్రాక్టు పొందిన ఎల్ అండ్ టి సంస్థతో పాటు అందరితో చర్చలు జరిపి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బృహత్తర మిషన్ భగీరథ కల సాకారం కావాలంటే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి కృషి ఎంతో అవసరమని ఈ సందర్భంగా సిఈ పేర్కొన్నారు. ఆయన వెంట వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధి శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరమణ, డిఇలు నర్సింగరావు, సందీప్, తదితరులున్నారు.