మరో రీమేక్ కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు వెంకటేష్ ఇటీవలే నటించిన ‘దృశ్యం’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు ఆయన దృష్టి రీమేక్ సినిమాలపై పడింది. దృశ్యం సినిమా కూడా మలయాళ హిట్ ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్న వెంకటేష్, మరో రీమేక్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకే ఓ మలయాళ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయిన వెంకటేష్ తాజాగా ‘టూ కంట్రీస్’ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను నిర్మాత బండ్ల గణేష్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బండ్ల గణేష్‌తో వెంకటేష్ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. మొత్తానికి హిట్ సినిమాలని బాగానే క్యాచ్ చేస్తున్నాడు వెంకటేష్. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం వుంది.