మెయిన్ ఫీచర్

మాల ధారణం.. ప్రశాంతతకు చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంప్యూటర్ యుగంలో కలియుగ దైవం అయ్యప్ప ఆరాధాన అతిముఖ్యమైంది. కార్తిక మాసం ప్రారంభం అయ్యిందంటే చాలు అయ్యప్ప మాలాధారణ ఆరంభ వౌతుంది. జాతీ, మత, కుల, భాషా బేధాలు లేకుండా సర్వే సర్వత్ర స్వాములు నల్లవస్తమ్రులు ధరించి మాలాధారులై, నుదుట విభూతి, చందన, కుంకుమ రేఖలతో కన్పింస్తుంటారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఎలుగెత్తి ఆ స్వామి నామాలు ఉచ్చరిస్తూ స్వామి పూజలను, భజనలను తనువు మరిచి భక్తి పారవశ్యంతో చేసే ఆరాధన దినదిన ప్రవర్థమానవౌతోంది. మాలధారణ చేసిన స్వాములు ఎన్ని రోజులు దీక్ష చేసుకోవాలో ముందే నిర్ణయంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటారు. సాధారణంగా 41 రోజులు తీసుకుంటారు. అయతే ప్రస్తుతం ఈ సంఖ్యను 21, 11కు కూడా కుదించుకుంటున్నారు. మాలధారణ చేసిన నాటినుంచి నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. చన్నీటి స్నానం, బ్రహ్మచర్యం, ఏకభుక్తం, భూశయనం, వ్యసనాలకు దూరంగా వుండటం, కోపం-ఆవేశం దరికి చేరకుండా ప్రశాంత చిత్తంతో స్వామిని నిరంతరం స్మరించుకోవడం, ఎదుటి వ్యక్తిలో స్వామిని చూడటం వంటిని కచ్చితంగా పాటించడం వలన మనిషిలోని కోప తాపాలు తగ్గి, ఆ భగవంతుని చేరుకునేందుకు మార్గం సుగమనం అవుతుంది. అయ్యప్పస్వామి మాలాధారణ చేసిన వారిలో మొదటిసారి మాలాధారణ చేసిన వారిని కనె్నస్వాములుగా, రెండవసారి మాలాధారణ చేసినవారిని కత్తిస్వామి, మూడవసారి మాలాధారణ చేసిన వారిని గంటస్వాములు, నాల్గవసారి మాలాధారణ చేసిన వారిని గదస్వాములు, ఐదవసారి మాలాధారణ చేసిన వారిని పెరుస్వాములు, ఆరవసారి దీక్షమాల వేసినవారిని గురుస్వాములు అని పిలుస్తూ అయ్యప్ప స్వామిగానే భక్తులు సంభావిస్తారు.
క్రీ.శ.10వ శతాబ్ధమునందు తమిళభాషలో రచించబడిన పింగళ నిఘంటు అను గ్రంథములవలన హరిహరపుత్రన్, అయ్యన్, అర్యన్, పూరణైకళ్వన్, పుట్కళైమణాళన్, అరతె్తైక్కాప్పోన్, శాతవాహన్, కోయికొడియోన్, శాత్తన్, వెల్లైయానైవాహనన్, కారి, చెండాయుధన్, యోగి, కడల్‌నిరవణ్ణన్ అనుపలు నామాలు అయ్యప్పకు ఉన్నట్లు తెలుస్తుంది.
క్రీ.శ.1081కి పిదప కొందరు పాండ్యరాజుల వళ్లియూర్ నందును, తెన్‌కాశియందు సామంతరాజులై పాలించుచున్న సమయంలో వారి వంశానికి చెందిన రాజకుటుంబీకులు కేరళ దేశమునకు వలస వెళ్లి పందళ రాజ్యమును స్థాపించారు. పందళరాజుకు అడవిలో మణిహారముతో అయ్యప్పస్వామి కంటపడటంతో, అతన్ని తీసుకుని పందళరాజు పందళరాజ్యానికి తీసుకుని వెళ్లి పెంచుకోవడం, తరువాత పెంపుడు తల్లికి శిరోభారం వచ్చి పులిపాలకోసం అడవికి మణికంఠుడు వెళ్ల్లి పులిపై ఎక్కివచ్చి పులిపాలను తెచ్చి సాటిలేని పరాక్రమాన్ని ప్రజలకు తెలియచేసినట్లు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ భువిపై అవతరించిన హరిహరపుత్రుడైన అయ్యప్పస్వామి తాను వచ్చిన కార్యం ముగిసిందని తన పెంపుడు తండ్రితో చెప్పి, అందరు చూస్తుండగానే జ్యోతి పుంజముగా మారి శబరిమాలై కొండల్లో అదృశ్యం అయిపోయినట్లు, జ్యోతిపుంజముగా మారే ముందు తన తండ్రి కోరికను మన్నించి ప్రతి మకరసంక్రాంతి నాడు తాను జ్యోతిరూపంగా దర్శనమివ్వడం జరుగుతోందని, తన ఆలయాన్ని శబరికొండపై నిర్మించాల్సిందిగా చెప్పినట్లు స్థానికచరిత్ర చెబుతోంది. అయ్యప్పవారు జ్యోతిరూపంగా దర్శనమిచ్చిన రోజు సంక్రాంతి పర్వదినం కావున అప్పటి నుండి ప్రతి మకర సంక్రాంతికి భక్తులు శబరిమల యాత్రకు వెళ్లి మకర జ్యోతిని దర్శించుకోవడం ఆచారంగా వస్తుంది. పూంజ్ఞార్ పాండ్యవంశ చరిత్ర ప్రకారం కొల్లం అండు 270 మొదలు 296 వరకు అనగా క్రీ.శ 1095 మొదలు 1121 వరకు 26 సంవత్సరాలు శ్రీ మణికంఠుడు కేరళ వర్మపేరిట నివసించి పలు అద్భుత లీలావినోదములను ప్రదర్శించాడన్న ప్రచారం ఉంది.
పిటి.రాజన్ అనే తమిళనాడుకు చెందిన భక్తుడు పంచలోహముతో శ్రీ అయ్యప్పస్వామి వారి విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో తిప్పి, పలు మహానీయులచే పూజలు చేయించి, శబరిమలకు తీసుకుని వచ్చి అప్పటి శబరిమల ప్రధాన తంత్రిగారిచే కేరళ ఆచారం ప్రకారం జీవోద్వాసన చేసి ప్రతిష్టించారు. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఉండే పంచలోహంతో తయారు చేసిన శాస్తావారి విగ్రహాన్ని పిటి.రాజన్ చేసిందే. దారితప్పి పతనం వైపు ఒరిగి పోతున్న మానవాళికి ధర్మప్రబోధ చేసి, సద్గురువై, సన్మార్గము చూపించే అయ్యప్పస్వామి మాలను జీవితంలో ఒక్కసారి అయిన ధరించి తీరాల్సిందే.
41 దినముల దీక్ష అనంతరము గురుస్వామి చేత ఇరుముడి ధరించిన కనె్నస్వాములు మాత్రం విధిగా శబరిమాల యాత్రకు బయలుదేరిన స్వాములు అడవుల గుండా పెద్ద పాదము కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో నల్లని బట్టలు క్రూరజంతువుల భారీ నుండి కాపాడుతుంటాయి. ఇంతే కాకుండా అయ్యప్పస్వామి వారు తన దీక్ష బూనిన స్వాములకు శనేశ్వరుని నుండి ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా, శనేశ్వర స్వామికి ఇష్టమైన నల్లవస్త్రాలు ధరించాలన్న నిబంధనలు పెట్టారంటారు.
ఇరుముడి కట్టుకుని శబరిమాలై యాత్రకు వెళ్లే భక్తులు ఉదయానే్న ఇంటివద్ద కొబ్బరికాయను కొట్టి భారమంతా స్వామిపై వేసి తీర్థయాత్రలకు బయలుదేరాల్సి ఉంటుంది. తిరిగి స్వామి వారి దర్శనం అయి స్వామివారికి ఇరుముడి అందించే వరకు దీక్షాబద్ధులై ఉంటారు. శబరిమాలై చేరుకునే ముందు స్వాములు కేరళలోని ఎరుమేళిలో ఆగి అక్కడ రంగులు పులుముకుని పెటైతుళ్లి ఆడుతారు. రంగులు పులుముకున్న శరీరంతోనే ఎరుమెళిలో ఉన్న అయ్యప్పస్వామి మిత్రుడైన వావర్‌స్వామి మసీదుకు వెళ్లి అక్కడ విభూతి పెట్టుకుని పంబానదికి చేరుకుంటారు. పెద్దపాదం నడక కూడా ఇక్కడి నుండి ప్రారంభిస్తారు. మార్గం మధ్యలో శరణ్‌గుత్తివద్ద కనె్నస్వాములు తమ వెంట తెచ్చిన భాణాలు గుచ్చుతుంటారు. శబరిమాలకు చేరిన తరువాత 18 మెట్లను నమస్కరిస్తూ ఎక్కి స్వామివారి సన్నిధానికి చేరుకుని అయ్పప్పకు ఇరుముడి సమర్పించుకుని దర్శించుకుంటారు.

- వుక్కల్‌కర్ రాజేందర్‌నాథ్