మెయిన్ ఫీచర్

పరమ గురువరేణ్యులు రాఘవేంద్ర తీర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే
మధ్వ సంప్రదాయంలో రాఘవేంద్రులు ఉత్తుంగ శిఖరం. భగవంతుడే వ్యాస మహర్షిగా జన్మించి వేదరాసిని విగడించి మానవుల్లోని అజ్ఞానాన్నిపోగొట్టి జ్ఞాన దారిని చూపించినట్టు శంఖు కర్ణుడనే పరిచారకుడు తన మూడవ జన్మగా కాంచీపురం సమీపంలోగల భువనగిరి గ్రామం లోని తిమ్మనభట్టు, గోపమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1595లో మన్మధ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు జన్మించాడు. అతనికి జననీ జనకులు అతనికి వేంకటనాధుడని నామకరణం చేశారు. ఆ వేంకటనాథుడే రాఘ వేంద్రస్వామిగా ఎందరో భక్తజనుల హృదయాల్లో కొలువయ్యారు.
తుంగభద్ర నదీ తీరంలో పూర్వం జమదగ్నిమహర్షి భార్య రేణుకాదేవి, మంచాల గ్రామంలో గురురాఘవేంద్రుడు బృందావన ప్రవేశం చేశారు.
శ్రీరాఘవేంద్రులు పిలిస్తే పలికే దైవం. కులమతాలకు అతీతంగా ఆయనకు ఎందరో శిష్యులున్నారు. నేటికీ శ్రీ రాఘవేంద్రస్వామి. నిత్య సత్య చైతన్యమూర్తి. తన మహిమ లతోను, లీలలతోతన్ను నమ్ముకున్న భక్తకోటికి దయామయుడుగా రక్షకుడుగా ఆరాధ్యదైవమై నిలుస్తున్నాడు.
రాఘవేంద్రస్వామి సన్యాస దీక్షతీసుకోక ముందే సర్వశాస్త్ర పారంగతుడు. వేంకట నాథ నామం ఉన్నప్పుడే సరస్వతి అనే కన్యతో ఆయనకు వివాహం జరిగింది. వారిద్దరికి మగసంతానం కూడా కలిగింది. కాని ఆ సమయంలో వేంకట నాథుణ్ణి దారిద్య్రబాధ చుట్టుకుని ఉండేది. ఓసారి తన భార్యబిడ్డలతో వేంకటనాథుడు కుంభ కోణం వెళ్లగా అక్కడ అనుకోకుండా శ్రీ సుధీంద్ర తీర్థులవారి ఆశ్రయం లభించింది.
శ్రీసుధీంద్ర తీర్థుల వారు వేంకటనాథుని అమోఘమైన ధీశక్తిని, అఖండమైన విద్యా శక్తిని గ్రహించారు. తన తర్వాత ఈ మధ్వ పీఠానికి వేంకటనాథుడే రక్షకుడని తలపోశారు. మేథాశక్తిని, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్ని తెలుసుకొన్న సుధీం ద్రులు ఓరోజు వేంకటనాథుని మఠబాధ్యతలు తీసుకోమని చెప్పగా వేంకటనాథుడు తనకు భార్యాబిడ్డలున్నారని తాను ఏవిధంగా మఠబాధ్యతలు నిర్వర్తిస్తానని అంటూ ఎంతో వ్యాకులపడ్డాడు.
కాని కారణ జన్ముడైన వేంకటనాథునికి చదువుల తల్లి సరస్వతీ దేవి కలలో కనబడి ‘‘నాయనా వేంకటనాథా! మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్ధుడవు నీవే. లే! ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి’’ అని చెప్పింది. వెనువెంటనే నిద్ర నుండి మేల్కొనిన వేంకట నాథుడు తనగురువుగారైన సుధీంద్ర తీర్థుల వారి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లి తన స్వప్నం గురించి చెప్పాడు. సుధీంద్రు ల వారు ఎంతో సంతోషించి వేంకటనాథునికి సన్యాస దీక్ష ప్రసాదించి రాఘవేంద్రునిగా ఆశీర్వదించారు.
ఇక అప్పట్నుంచి మధ్వపీఠ బాధ్యతలను నిర్వర్తిస్తూనే జనుల్లో నూతనో త్తేజానికి దారిచూపుతున్నారు. ఓసారి ఓ నవాబు స్వామిని పరీక్షించదలిచి మద్యమాంసాలను పంపితే స్వామి మహిమ వల్ల అవి పూలపండ్లుగా మారిపోయాయ. ఇక అప్పట్నుంచి ఆ నవాబుకూడా స్వామి వారి శిష్యగణంలో చేరిపోయారు.
ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు. నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆదోనిలోని గవర్నరు వద్ద దివాను స్థాయికి తీసుకువెళ్లారు. స్వామి మహిమను తెలుసుకొన్న సిద్ధి మస్సానెత్‌ఖాన్ మంత్రాలయం గ్రామాన్ని రాఘవేంద్రులకు రాసి ఇచ్చారు. (మద్రాస్ డిస్ట్రిక్ట్ గెజిటీర్ పునర్ముద్రణ 1916 చాప్టర్ 15 ఆదోని తాలూకా పేజీ 213) మద్రాసు గవర్నర్ ధామస్ మన్రోకు రాఘవేంద్రస్వామి చూపిన అద్భుతాలు కోకొల్లలు. వీటిల్లో కొన్ని ‘బళ్లారి జిల్లా గెజట్’లో మనకు కనబడుతాయ. గురు రాఘవేంద్రుల యశశ్చంద్రికలు అనుభవించవలసిందే కాని వర్ణించడానికి మాటలు చాలవు.
స్వామి స్వయంగా తాను బృందావన ప్రవేశం చేస్తానని తన శిష్యుడైన వెంకన్నకు చెప్పి తానే బృందావన నిర్మాణం చేయంచి తాను శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించాడు. శ్యాసని నిలిపివేసి మనోలయం చేశాడు. 1200 సాలగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధిగతుడైన తర్వాత ఆయన చూపిన మహమలను అను భవించేవారు నేటికీ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని రాఘవేంద్రులు చెప్పిన మాట అక్షరసత్యమే. ఇప్పటికీ రాఘవేంద్రపీఠంలో చదివే రాఘవేంద్రుని స్తుతి - రాఘవేంద్రుని ప్రియశిష్యుడైన అప్పణాచార్యులు తన గురువు సమాధి చెందుతున్నారన్న విషయం తెలుసుకొని తుంగభద్రా తీరానికి చేరుకొంటూ దారిలో గురుస్తుతి చేస్తూ వచ్చారట కాని బృందావన సమీపానికి వచ్చేసరికి గురువులు సమాధి గతులయ్యారు. అప్పణాచార్యులు దుఃఖం పట్టలేక శోకిస్తుంటే సమాధిలోంచి రాఘవేంద్రస్వామి ఆ గురుస్తుతి లో ఆగిపోయన చివరి ఏడు అక్షరాలను పలికి ఆ శిష్యుని దుఃఖాన్ని దూరంచేసాడా రాఘవేంద్రులు. ఆ స్తుతినే నేటికి భక్తజనం జపిస్తుంటారు.
23 ఏళ్ల వయస్సులో సన్యాస దీక్ష తీసుకొని అతిపవిత్రమైన నియమనిష్ఠలతో పీఠబాధ్యతలు 40 ఏళ్లు మోసి ఎన్నో మహిమలను లీలలను చూపిన రాఘవేంద్ర స్వామిని తమ ఇలవేల్పుగా సద్గురువుగా నేటికీ జనం కొలుస్తునే ఉన్నారు.

- హనుమాయమ్మ