మెయిన్ ఫీచర్

సమైక్య జీవనకాంతి సంబరాల సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రతి రోజు మనిషికి ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు. పనె్నండు రాసులలోను ఆయన సంక్రమణం చేస్తూ, సంవత్సరంలో నెలకొక రాశి చొప్పున ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు కనుక ప్రతి నెల సంక్రాంతి ఉంటుంది. దానినే మాస సంక్రాంతి అంటారు. ద్వాదశ రాసుల్లో ప్రతి రాశిలోను ఏడాదికొకసారి ఆయన ప్రవేశిస్తూ ఉన్నా కూడా మకర రాశిలోనికి ఆయన ప్రవేశం శ్రేష్టమైందిగా పరిగణించబడింది. మకరరాశి లోనికి జరిగే ఆ ప్రవేశం మకర సంక్రాంతి. అదే మనకి సంక్రాంతి. ఈ మకర సంక్రమణం రోజున దక్షిణాయనం ముగిసి, ఉత్తరాయనం ప్రారంభమవుతుంది. ఈ రెండు ఆయనాల్లో ఉత్తరాయణం శ్రేష్టమైనది. దక్షిణాయనంలో అంపశయ్య మీదికి వాలిపోయిన భీష్ముడు పుణ్యకాలంలో దేహ త్యాగం చేసే ఉద్దేశ్యంతో ఉత్తరాయణం దాకా వేచి ఉన్నాడని మహాభారతం చెప్తోంది. కనుకనే మిగిలిన పదకొండు సంక్రమణాలకన్నా మకర సంక్రమణంకు మనవాళ్ళు విశేష ప్రాధాన్యత ఇచ్చారు.
సూర్యుడిలో అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడన్నా, సూర్యుడికీ ఆయనకీ తేడా లేదన్నా, సూర్యుడే ఆయన అన్నా ఒక్కటే! అందుకే సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఆ ప్రత్యక్ష దైవానికి సంబంధించిన పర్వదినమే మకర సంక్రాంతి.
మంచి ముత్యాలతో మెరుస్తూ చిరుగాలికి తలలూపుతూ గుమ్మడిపూలు సంక్రాంతి రాకని చాలముందుగానే చాటింపు వేస్తాయి. కళ్ళాపి చల్లిన నేల మీద కళ్ళుని లాగిపట్టుతూ అల్లిబిల్లిగా అల్లుకున్న ముగ్గులూ, దినకరుడు మనకు చూపించే ప్రకృతిలోని రంగుల మేళవింపుతో హృదయాలను గిలిగింతలు పెట్టే రంగవల్లులూ సంక్రాంతి సుందరి పదపల్లవాల మోపడంకోసం రత్నకంబళ్ళు పరుస్తాయి. పల్లెపట్టుల్లో కళ్ళాల వీడి ధాన్యరాసులు సంక్రాంతి మాతకు పూర్ణకుంభాలుగా భాసిస్తాయి. ముగ్గులూ, రంగవల్లులూ వాటి మధ్య గోమయశిఖరం మీద సంక్రాంతి పతాకాల్లో రెపరెపలాడే గుమ్మడి పూలూ సంక్రాంతి ప్రమిదల పండుగగా రూపొందిస్తాయి. గంగిరెద్దులూ, కోళ్ళ పందేలూ, వినోదాలా వగైరా సంక్రాంతిని పురుషుల పర్వదినంగా అభివర్ణిస్తాయి. ఆహారోత్పత్తిలో ఏడాది పొడవునా శ్రమించిన ఎడ్లనీ, ఎరువునీ, పాలను అందించిన గేదెలూ, ఆవులూ, మేకలూ వగైరా పశువులకు రైతు సంక్రాంతి సందర్భంగా విశ్రాంతినిచ్చి, అలంకరించి వాటికోసం పండుగ చేస్తాడు. మనుషులకూ, పశువులకూ సమానంగా సంక్రమించిన ఏకైక పర్వదినం మకర సంక్రాంతి. అదే ఈ పండుగలోని ప్రత్యేకత.
కనుమ రోజున జరిగే పశువుల పండుగ కోసం సేద్యానికి ఉపయోగపడే ఎడ్లనీ, పాడి ఆవుల్నీ, అన్ని రకాల పశు సంతతినీ రైతు శుభ్రంగా స్నానం చేయించి కడుపునిండా మేత పెడతాడు. అట్లానే ప్రకృతి సమతౌల్యత ను కాపాడే పశుపక్ష్యాదులను కూడా రైతు ఆదరిస్తాడు. సేద్యం చేసే ఎడ్లకూ, పోట్లగిత్తలకూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వీటిని అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరిపించే ఆచారం కూడా ఉంది.

- కె.వి.నాగేశ్వరరావు