మెయిన్ ఫీచర్

కపిల గీతాసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరికలు బహు విచిత్రమైనవి. ఒక్కో కోరిక మనుజుని అధఃపాతాళానికి పడవేస్తుంది. మరో కోరిక ద్వారా అత్యున్నతమైన పదవి అంటే భగవంతుని సానిధ్యాన్నికూడా దరిచేరుస్తుంది. కనుకనే మనుజులు బాగా ఆలోచించిమాత్రమే కోరికలను కోరుకోవాలి. ఇహలోక సుఖాలన్నీకూడ క్షణభంగురమైనవి. జీవితం బుద్భుదప్రాయం. ఇక అందులో కోరికలు బహుస్వల్పకాలికమైనవి. జ్ఞానులు ఈవిషయాన్ని తెలుసుకొన్నవారు కనుక వారే కోరికలను కోరుకోరు.
ఓసారి కర్దమ మహర్షి తపస్సు చేయాలని అనుకొని తన భార్యయైన దేవహూతి తనకు కన్యాదాన ఫలితాన్ని,సుపుత్రసందర్శనం కలుగచేయమని కోరుకుంది. దానివల్ల కర్దమ మహర్షి దేవహూతి కోసం దివ్యవిమానములను, సుందర వనాలను సృష్టించి ఆమె కోరికలను తీర్చాడు. తన కొడుకు విశ్వారాధకుడు కావాలని దేవహూతి కోరుకుంది. కర్దమ మహర్షి ‘‘దేవహూతి గతంలో మనలను మెచ్చిన శ్రీహరి తానే మన పుత్రుడుగా పుడతానని చెప్పిన సంగతి మరిచితివా! ఆయనే రాబోయే కాలంలో నీకుమారుడుగా పుట్టబోతున్నాడు నీవు చింతించకుము’’అని దేవహూతికి ఆనందాన్ని కలిగించాడు. కర్దముడు చెప్పినట్టుగా సత్యధర్మాలను తన ప్రాణంగా భావించింది దేవహూతి. అనేక పుణ్యకార్యాలను చేపట్టింది. ఎన్నో వ్రతాలను ఆచరించింది. ఎన్నో నోములను నోచింది. తనకు పుట్టబోయే శిశువు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ యన్ననమ్మకంతో ఎన్నో పుణ్యకవ్రతాలు చేయించిది.వాటి అన్నింటి ఫలితంగా దేవహూతికర్దములకు తొమ్మిది మంది కూతుర్లు పుట్టారు.
కళ ,అనసూయ, శ్రద్ధ, హవిర్భువు ,గతి, కియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అనే తొమ్మిది మంది కుమార్తెలను కర్దమప్రజాపతి పొందాడు.
ఆ తరువాత శ్రద్ధాసక్తులను దానాలను, మిగులాసక్తితో వ్రతాలునోములు ఆచరించిన వారికి శ్రీహరియే కపిలునిగా పుట్టాడు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు కూడి వచ్చారు. కర్దమదేవహూతులను ఆశీర్వదించారు. అపుడే కనులుతెరిచిన కపిలునికి బ్రహ్మాది దేవతలు నమస్సులు చేశారు. దిన దిన ప్రవర్థమానమయ్యే కపిలుని చూచుకొమ్మని దేవహూతికి చెప్పిన ముందే అనుకొన్నప్రకారం కర్దముడు తపోభూమికి తరిలాడు.
దేవహూతి తన కుమారుడే అఖిలలోకాలకు సంరక్షకుడని అనుకొంది. సంరక్షకుణ్ణి తనకు జ్ఞానోపదేశం చేయమని వేడుకొంది. అపుడు దేవహూతికి కపిలుడు చేసి ఆత్మజ్ఞానోపదేశమే కపిలగీతిగా ప్రసిద్ధి చెందింది. ‘‘అమ్మా! మానవుల్లోని మనస్సే విషయభోగములందు ఆసక్తికి కారణవౌతున్నది. కాని ఆ మనస్సే భగవంతునియందు నిలిపితే మోక్షాన్ని కలిగించడానికి హేతువు అగుచున్నది.కనుక నీవు నీ మనస్సును ఆధీనంలో తెచ్చుకొని ఆ మనస్సును పరమాత్మయందే నిలుపుము. ఈ మనస్సు వల్లే ‘నాది’ ‘నేను’ అనే భావాలు ఏర్పడి దానిద్వారా లోభమాత్సర్యాది గుణాలు కలుగుతున్నాయి. కనుక సర్వమునకు కారణం భగవంతుడని అనుకొంటే సర్వమూ ఈశ్వరమయము అని తెలుసుకొంటే ఇక నాది నేను అనుభావాలు దూరమవుతాయి. అపుడు సమత్వబుద్ధి ఏర్పడుతుంది. ఎల్లెడలా సర్వాంతర్యామిని దర్శించుభాగ్యం అలవడుతుంది’’అని చెప్పాడు యజ్ఞము, దానము, తపస్సు, వేదాధ్యయనం, నిష్కామ కర్మము, ధృడమైన వైరాగ్యాది భావన వల్ల కూడా భగవంతుని దరి చేరవచ్చు అని కపిలుడు దేవహూతికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. సజ్జనులందరూ తనకోసం కాక నలుగురి కల్యాణంకోసం శ్రమిస్తుంటారు కనుక సజ్జన సాంగత్యం చేసినట్టయితే సమత్వబుద్ధి కలుగుతుంది. దేవహూతి కోరిక వల్ల ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే కుమారుడిని పొందగలిగింది. కనుక కోరికలను కోరుకునేటపుడే కాస్తనిదానించి ఆలోచించి కోరుకుంటే ఆ కోరికలు తీరే సమయంలో మంచిఫలితాలను పొందవచ్చు. ఆవేశంతోనో, ఆగ్రహంతోనో, లోభంతో కోరుకున్న కోరికలు కోరుకున్నవారిని అధఃపాతాళానికి పడవేస్తాయి. అసురులైన వారి కోరికలు అల్పయశస్సును కోరుకుంటాయి. వారి మితిమీరిన కోరికలే వారినే నాశనం చేస్తాయని మనకు రావణాసురుడు, హిరణ్యాక్షుదుల్లాంటి అసురుల జీవితాలు తెలుపుతున్నాయి. కపిలుడు చెప్పినట్లు నిరంతర భగవంతుని ధ్యానం చేయడం వల్ల కామలోభాది గుణాలు దూరం అవుతాయి. భక్తిమార్గంలో నడిచినవారికి అయాచితంగానే శ్రద్ధ, సమత్వబుద్ధి, త్యాగం అనే లక్షణాలు దరిచేరుతాయి. భక్తితో భగవంతుని కట్టెదుట నిలుపుకోవచ్చు. కలియుగంలోకేవల నామజపంతోనే అనంత రూఫదారుడు, అఖిలలోకారాధ్యుడు అనంతనామధారుడైన భగవంతుని దర్శనం పొందవచ్చు. ఈ కపిలగీత వల్ల మనమూ మనకు లభించిన మానవజన్మను సార్థకం చేసుకోవాలి. ఈ కపిలగీతను అందరూ అర్థం చేసుకొని పరమాత్మకు ప్రతిరూపులు కావాలి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు