మెయిన్ ఫీచర్

సిరి సంపదలకు చిహ్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి కార్యంలోనూ తొలి పూజలందుకునే దైవం, విఘ్న నాశకుడు శ్రీ వినాయకుడు. ఈయనకి 64 రూపాలున్నాయంటారు. వాటిలో 32 రూపాలు ముఖ్యమైనవనీ, మళ్లీ అందులో షోడశ రూపాలు అతి ముఖ్యమైనవని చెబుతారు. వీటిలో శే్వతార్క గణపతిని ఎక్కడా చెప్పకపోయినా తెల్ల జిల్లేడు వృక్షాలు 100 సంవత్సరములపైన వున్నట్లయితే వాటి మూలంలో గణపతి ఆకారం తయారవుతుందని ప్రశస్తి. అయితే ఇలాంటి గణపతి రూపం దొరకటం దుర్లభమని పెద్దలు చెబుతారు. లక్ష్మీగణపతి- సిద్ధి గణపతి- ఏకదంత గణపతి- సువర్ణ గణపతి- ఇలా అనేక గణపతుల ఆరాధనలతో కొనసాగే గణపతి నవరాత్రుల ఉత్సవాలలో గణపతికి ప్రత్యేకంగా శే్వతార్క పత్రంతో చేసే పూజ గురించి మన గ్రంథాలలో కూడా ప్రస్తావన వుంది అని అంటారు. ఈ శే్వతార్క గణపతి ఆరాధనతో సర్వగ్రహ దోష నివారణ అవుతుంది అని పండితులు చెపుతూ ఉంటారు.
జిల్లేడు అంటే హలాహలమును తనలో ఇముడ్చుకున్న పరబ్రహ్మ ప్రతిరూపము. అట్టి జిల్లేడు ఆకును దేహముపై వుంచుకొని స్నానం చేస్తే మానవుడి శరీరంలో వున్న విషతుల్య పదార్థాల్లో విష ప్రభావాన్ని జిల్లేడు ఆకర్షించి స్వీకరిస్తుంది. అందుచేత మానవుడు తనకు తెలిసీ తెలియకుండా తన దేహంలో చేరుకున్న విష పదార్థాల ప్రభావం నుంచి రక్షింపబడతాడు. అంతేకాదు విషపూరితమైన దుష్ప్రభావాలు కూడా తొలగిపోయి ఉద్ధరించబడతాడు.
రథసప్తమి నాడు రుూ స్నానం చేయడంవలన- విషప్రభావం నుంచి రక్షించబడ్డ మానవ శరీరం ఆనాటి పవిత్ర సూర్య కిరణాల ప్రభావం చేత మరలా పరిపుష్టమూ, తేజోవంతమూ అవుతుంది. అలాగే వినాయక చవితినాడు- వినాయకుడికి, యిష్టమనే పేరిట ఆ గణేశ్వరుడి ప్రతిరూపమైన జిల్లేడుతో పూచిస్తారు.
పూజా సమయంలో జిల్లేడులోని విషాకర్షక శక్తి మనిషి దేహంలోని విషాన్ని ఆకర్షించి, ఆ దేహాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. కేవలం స్పర్శ లేదా ఆ గాలి పీల్చడంవల్ల కూడా మానవుడు ఉద్ధరించబడతాడనడానికి ఇది నిదర్శనం. అలాగే జిల్లేడు మొక్క ఆకులు వాతావరణంలో విషాన్ని ఆకర్షించి లోకానికెంతో మేలు చేస్తున్నాయి. జిల్లేడు మొక్క పాలల్లోంచి ఉద్భవించే విషం- ఆ ఆకుల్లోంచి వచ్చే విషం- లోకంలోని జీవరాశులన్నింటిలోంచి ఆకర్షించబడిన విషమే. ఆ విధంగా జిల్లేడును లోక సంరక్షణార్థం సృష్టించిన భగవంతుడు దాని పవిత్రతను లోకానికి చాటడానికే తాను స్వయంగా జిల్లేడు వేరుమీద శేతార్క గణపతిగా అవతరించాడు. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు.
ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి.
ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శే్వతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్రం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు.
శే్వతార్క మూలానికి వశీకరణ శక్తి ఉంటుందట, ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఆ ఆవు నెయ్యి గోరోజనంలో శే్వతార్క మూలాన్ని గంథంలా అరదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థిస్తూ నుదుటిమీద తిలకంవలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా వస్తుంది. కేతుగ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలిగిపోవాలంటే శే్వతార్క గణపతిని పూజించాలి.
శే్వతార్క గణపతిని పూజా గృహంలో పెట్టుకుని దాని ముందు ప్రతిరోజూ ఓం గం గణపతియే నమః అని ఒక జపమాల జపించడవంల్ల జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ధన ధాన్య సుఖ సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. దారిద్య్ర నివారణకు తరుణోపాయం శేతార్క గణపతి జీవితంలో సర్వతోముఖాభివృద్ధి కోసం దిగువ చెప్పిన మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం ఒక జపమాల చేయాలి.
‘ఓం నమో విఘ్న హరాయ గం గణపతియే నమః’

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి