మెయిన్ ఫీచర్

ముక్కంటి తనయునికి మొక్కులిడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న లుగుపిండితో బొమ్మచేసి ప్రాణం పోసుకొని పార్వతీ నందనుడిగా కనులు తెరిచిన వినాయకుడు ముక్కంటినే ఎదరించి తండ్రి అనురాగాన్ని సంపాదించాడు. తల్లిదండ్రుల అనురాగం సంపా దించి వారిని అలరించి వారిచేత దీవనలు పొందిన ఈ గణపతి విఘ్నాలకు అధిపతిగా ఈశ్వరుని చేత నియమించబడ్డాడు. విఘ్నహరునిగా లోక ప్రసిద్ధుడయ్యాడు.
గణపతి ప్రథమారాధ్యునిగా పూజలందుకుంటున్నాడు. ఆఖరికి ఆదిదంపతులైన శివపార్వతులు కూడా వారి కల్యాణం నిర్విఘ్నంగా జరగాలని ఈ గణపతిని పూజిస్తారు. లోకకల్యాణ కారకపనులు చేసినపుడు ముందుగా ఆదిదేవుని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. వ్యక్తిగత పనులు చేసినపుడు కూడా మున్ముందు గణపతిని ఆరాధించడమే ఆచారం.
చిన్ని కళ్లతో, చేటలంత చెవులతో, ఏనుగుతొండంతో మరుగుజ్జురూపంతో బానపొట్టతో, ఏకదంతంతో ఉన్న స్వరూపమే గణపతిగా మనం ఆరాధిస్తాం. కాని...
ఆ ప్రథమారాథ్యుడే కుడుముల ప్రియుడే, పార్వతీ నందనుడే త్రినేత్రుని బిడ్డడిగా మూడు కన్నులతో దశభుజాలతో చేతిలో సుదర్శనాయుధాన్ని పట్టుకొని అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోప్రథమారాధ్యుడు కొలువైనాడు.
ఈ స్వామికి పది చేతులుండడంతో దశభుజగణపతిగా ప్రసిద్ధి కెక్కినాడు. ఫాలభాగంలో మూడవ నేత్రంతో అరిష్టాలను తొలగించే వానిగా ఖ్యాతి చెందాడు కనుకనే ఈ గణపతిని ముక్కంటి గణపతిగా కొనియాడబడుతున్నాడు.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో కొలువైన గజాననుడు పదిచేతులలో - నారికేళం, చక్రం, త్రిశూలం, ధనుస్సు, అంకుశం, శంఖం, పవిత్రం, శరం, ఖడ్గంలాంటి ఆయుధాలను ధరించి తన దేవేరి అయన సిద్ధితో కలసి దర్శనం ఇస్తాడు.
ఈ స్వామి ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం వికసించి ఉంటుంది. ఇలాంటి గణపతి స్వరూపాన్ని మహాగణపతిగా ఆరాధిస్తారు. ఈముక్కంటి గణపతి ఆధ్యాత్మిక సాధన చేసేవారి సాధనలు ఫలప్రదం చేయడంలో ముఖ్యడంటారు.
ఈ దశభుజగణపతి కోరిన కోరికలు సిద్ధింపచేసేవానిగా ప్రసిద్ధి కెక్కిసిద్ధివినాయకుడన్న ఖ్యాతి గడించాడు. ఈ స్వామికి కుడివైపున సూర్యుడు, ఎడమవైపున చంద్రుడూ ఉంటారు. వీని వల్ల విశ్వగణపతిగా కీర్తిస్తారు.
సుఫలాలను ప్రసాదిస్తారనడానికి ప్రతీకగా స్వామి చేతిలో నారికేళం ఉంటుంది. ఈ దశభుజగణపతికి కోరికను చెప్పి ముందు ఒక కొబ్బరికాయను కొట్టి కోరిక తీరిన తర్వాత తిరిగి 107 కొబ్బరికాయలను నివేదించడం ఇక్కడి ఆచారం.
ఈదశభుజ గణపతి ఆలయాన్ని పద్నాల్గవ శతాబ్దంలో భూపతిరాయలు నిర్మించారని చారిత్రికాధారాలు చెబుతున్నాయి. మంగళవారాల్లో మహాగణపతికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతినెలా సంకటాలు తొలిగించమని కోరుతూ సంకట చతుర్థిని నిర్వహిస్తారు.
ఈ దశభుజ గణపతి ఆలయం పక్కనే నరసింహుని ఆలయం కూడా ఉంది. లక్ష్మీదేవి సమేతలక్ష్మీనరసింహస్వామి కొలువైన ఈ నరసింహుని ఆలయం కూడా రాయలనాటి కాలంనాటిదని అంటారు.
అనంతపురానికి సుమారు వందకిలోమీటర్ల దూరంలో రాయదుర్గం వుంది. ఈ రాయదుర్గంలోదశభుజ గణపతి ఆలయం, నరసింహస్వామి ఆలయం చాలా పురాతనమైనవి. వీటిని చూడడానికి యాభైకిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక బళ్లారి నుంచి యాత్రీకులు అనేకమంది ప్రతిరోజు వస్తుంటారు.

- చివుకుల రామమోహన్