మెయిన్ ఫీచర్

మోక్షసౌధానికి సోపానాలివిగో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖ స్థానం అందుకున్నా గోదాదేవి చరిత్ర పావనమైనది. భక్తి , కళా, సామ్రాజ్యాలను తన అసమాన ప్రతిభతో ప్రకాశింపచేసిన విజయనగర సార్వభౌములు సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు ఆదేశానుసారం ‘‘ఆముక్తమాల్యద’’ అను అద్భుతమైన ప్రబంధాన్ని రచించి, తద్వారా గోదా వైభవం చరిత్రను మనకందించారు. ‘‘ప్రేమ-్భక్తి తపస్విని’’ గోదాదేవి శ్రీకృష్ణుని హృదయాన్ని అందుకున్న గాథను అందమైన కావ్యంగా మలిచారు.
గోదాదేవి ఆ విల్లిపుత్తూరు లో వెలసిన వటపత్ర శాయికి పరమభక్తుడైన విష్ణుచిత్తులకు తులసీవనంలో పాదులు చేస్తుండగా, విదేహ చక్రవర్తికి వైదేహి లభించినట్లుగా దొరికింది. ఇరువురూ శ్రీహరి వరప్రసాదులే. శ్రీహరి వాహనమైన గరుడుడు తన స్వామిని అల్లునిగా చూడాలని , భూదేవి తన పతికి ఇష్టమైన పుష్పకైంకర్యం చేసి తరించాలని కోరుకున్నారు. వారిరువురి ఇచ్ఛను ఈ యుగంలో శ్రీవిల్లిపుత్తూరులో ఫలింపచేశాడా శ్రీహరి. కోదై అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటూ కోదైకి విష్ణుమూర్తి కథలన్నింటినీ వినిపించేవాడు విష్ణుచిత్తుడు. ఆ హరికథలను విని హరి పట్ల ఆసక్తి, ఇష్టాన్ని పెంచుకొంది కోదై. కోదై గోదాగా మారి ప్రతిరోజు తన తండ్రి చేతతులసి మాలలు, పూమాలలను తానే తయారు చేసి తానుధరించి చూసి మురిసి తన నాథుడుగా ఇంకెతగా మురుస్తాడోఅని చింతిస్తూ పంపించేది.
ఒకనాడు విష్ణుచిత్తుడు వటపత్రశాయికి మాలాకైంకర్యం చేస్తుండగా పొటవాటి కేశం కనిపించడంతో మాల అపవిత్రం అయిందని ఎంతో బాధపడ్డాడు. కైంకర్యం చేయకుండానే తిరిగి వచ్చేశాడు. దీనికి కారణమేమిటా అని ఆలోచిస్తున్న వచ్చిన విష్ణుచిత్తులకు స్వామి మాలను ధరించి బావిలో నీడను చూసుకొని మురిసే గోదా దేవి కనిపించింది.
వేదన చెంది ఎంతటి పాపకార్యాన్ని చేస్తున్నావో నీకు తెలియడం లేదంటూ గోదాదేవికి చెప్పాడు. ఆ రాత్రి విష్ణుచిత్తులకు కలలో పెరుమాళ్ దర్శనమిచ్చి గోదా ధరించిన మాలనే తనకెంతో ఇష్టమని చెప్పడంతోనే నిద్రలోనే గోదాను, ‘‘శ్రీదేవియో, భూదేవియో, నీళాదేవియో ఈ ఇంట అవతరించిందని’’అంటూ పరవశించాడు విష్ణుచిత్తులు. ‘‘ననే్నలుటకు అవతరించావా...’’అని కీర్తిస్తూ ఆంటాళ్ అని. శూడికొడుత్తనాచియార్ అని పాటలు పాడాడు. గోదాకు శ్రీకృష్ణుని పై ప్రేమమూర్తి పెరగడం ముకుందుని పొందు సాధ్యమయ్యే రీతిని తెలుపమని తండ్రి అడిగింది. విష్ణుచిత్తులు.. ముందు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పొందుటకు గోపికలంతా మార్గశిరమాసంలో కాత్యాయనీ వ్రతం చేశారనీ , ఆ వ్రతవిధివిధానాలు అన్నీ చెప్పి తానే దగ్గరుండి వ్రతాన్ని నిర్వహింపచేశాడు తన కూతురి చేత విష్ణుచిత్తులు.
కాత్యాయినీ వ్రత విధానాన్ని తెలుసుకొన్న గోదాదేవి మార్గశిరమాసంలో ధనుస్సంక్రమణ దినాన కాత్యాయినీ వ్రతానికి సమాన ప్రతి పత్తిగ ల ‘మార్గళి’ వ్రతాన్ని గోదాదేవి చేపట్టింది. విల్లిపుత్తూరునే రేపల్లెగా భావించింది. వటపత్రశాయిని నందగోపునిగా, గోపభామలను తన చెలికత్తెలను గా వారిలో తానొకతెగా ఊహించుకొని వ్రతమాచరించింది. ఆ వ్రతమే శ్రీవ్రతం. ముప్పదిరోజులు సాగే ఈ వ్రతంలో నాడు గోపికల చిత్తవృత్తులను వారి హాస, హాస్య, లాస్యాలను ప్రకృతి సౌందర్యాలను, చివరగా శ్రీకృష్ణుని యందు తమకు గల ప్రేమానురక్తిని, శరణాగతిని వర్ణిస్తూ రోజుకొక పాశురంగా పాడింది. ఈ ముప్పైరోజుల పాశురాలే తిరుప్పావైగా నేడు తమిళ వాఙ్మయంలో ప్రసిద్ధిపొందాయి. ఆళ్వారులల్లో ఒకరిగా చివరకు ఆండాళ్ తల్లి స్థానం సంపాదించుకొంది. అంతేకాదు ఆశ్రీకృష్ణుని తన కోరిక మేరకు వివాహం చేసుకొంది. ఆ స్వామిలోనే తాను ఐక్యమైంది. ఆ మె రచించి పాడిన పాశురాలే దివ్యప్రబోధాలుగా బ్రహ్మానంద సాగర తరంగాలుగా మోక్షసౌధాన్ని చేరడానికి సోపానాలుగా నేడు నిలచి ఉన్నాయి. ఆ దివ్య ప్రబోధాలనే, ఆ దివ్యసోపానాలనే ప్రతి వైష్ణవాలయంలో ధనుర్మాసంలో అనుసంధానిస్తూ ప్రతివారు తమపై ఆ మహావిష్ణు అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు. మహత్వపూర్ణమైన తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని పఠించినా, విన్నా, శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుతారని తిరుప్పావై ఫలశ్రుతి విశదపరుస్తోంది కూడా.

- ఎ.సీతారామారావు