మంచి మాట

వందే వాల్మీకి ముని కోకిలమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మును పుట్టను పుట్టిన ముని కృతమున
మూడున్నరధ్యాయముల జూచుకో’’
అన్నాడు. నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ఎవరీ పుట్టను పుట్టిన ముని, ఆయన కృతమై ఆచంద్రతారార్కము వెలుగొందే ఇతిహాసమేది. ఆయనే వాల్మీకి మహర్షి ఆయన వెలువరించిన సద్గ్రంధము, పంచమవేదమైన శ్రీమద్రామాయణము ఆ మహనీయుని జయంతి నేడు. ఉత్తమ మానవ ధర్మాలను లోకానికి చాటటానికే రామాయణం రచించాడు- వాల్మీకి ఆదికవి అనీ, ముని పుంగవుడని అందరిచేత ప్రశంసలనందుకొన్న మహనీయుడు- శ్రీమద్రామాయణం ఒక మహాపురుషుని చరిత్ర, త్యాగ నిరతిని ప్రబోధించే చరిత్ర ‘‘త్యాగేనైకే అమృతత్త్వమానసః’’ అన్నది శ్రుతి. మానవ జాతికి మహాపదేశ మిచ్చే ఇతిహాసం, కావ్యం- రామాయణం. రసవత్తర ఇతివృత్తం, ఆపాత మధురమైన గానం- యిమిడి ఉన్న మహోదాత్త గ్రంథం రామాయణం. దాన్ని అందించిన కారణజన్ముడు వాల్మీకి మహర్షి. అటువంటి వాల్మీకి వల్మీకసంభవుడు. కిరాతుడు. దారిదోపిడీలు ఆయన నిత్యకృత్యం. ఓరోజు సప్తమహర్షులు కిరాతకునికి తారసపడ్డారు. వారి డబ్బు తస్కరించుదామని వారిని నిర్బంధించాడు. గద్దించాడు. వారన్నారు. ఓయ మూర్ఖ! మా దగ్గర శాశ్వతమైన ధనం ఉండగా ఈ నశ్వరమైన ధనం మేమెందుక దాచుకుంటాం? నీవు తెలివి తక్కువతో దోచుకుంటూ దాచుకుంటున్నావు. నీ దగ్గరేదైనా నిలించిందా? నిలవని దానికి ఈపోరాటం ఆరాటం ఎందుకు నిలిచేదానికోసం యత్నించు అన్నారు.
‘అయ్యా మీ మాటలు నాకు ఈటెల లాగా అయి మనస్సుకు నాటుకున్నాయి. నాకేదో తెలియని అనుభూతినందిస్తున్నాయి. నాకేదయినా తరుణోపాయం చెప్పండని’’ ప్రార్థించాడు ఆమాటలకు ఆ బోయవాడు. త్రికాలజ్ఞులైన సప్తమహర్షులు అతడొక కారణజన్ముడని తెలిసి రామ అనే అక్షర ద్వయాన్ని ఉపదేశించారు. అదే తారకమంత్రం. దానిని వ్యత్యయం చేసి ‘‘మరా’’ అని జపిస్తూనే ఉన్నారు కిరాతుడు. ఈ సందర్భంగా తంజావూరును పాలించిన రఘునాథరాయలవారు రచించిన ‘‘వాల్మీకి చరిత్రము’’ మనే నాలుగువందల నలుబడి నాలుగు పద్యములలో (సీస పద్యములు) అత్యంత రమణీయంగా ఉండి, పతంజలి యోగశాస్త్ర విషయాన్ని ప్రస్ఫుటిస్తుంది.
ఆ రామ నామ జపానుభావంబున అంతర్ముఖ జాడవల్ల నల్ల నల్లని మొగులుండు నానాట గనుపించె. నదియు గోదండకాండాంకితమగు సగుణ భావము నొందె సగుణ భావంలెల్ల రూపింప నిర్గుణ రూపమగుచు గోటి కవి చంద్రతేజమై కొమరుమిగిలె- అంటూ రఘునాథరాయలు ధ్యానయోగ స్థితి, పరాకాష్ఠను అనన్యసామాన్యంగా తెలిపారు. సగుణము నిర్గుణోపాసనకు మొదటి మెట్టు. బ్రహ్మపదార్థము నిర్గుణము. అది అనంతము. తేజో మయము. ఉపాసకుడు మంత్రదేవతను కనులందుంకుచొని నిమిలిత నయనుండై జపమాచరిస్తాడు. మొదట్లో ఆరూపము పరిస్ఫుటంగా నిలువదు. రాముడు నీలమేఘశ్యాముడు. అందుకే నల్లని మొగులుగా కనిపించాడు. తరువాత తర్వాత మనః స్థిరత్వము కుదిరింది బోయకు. అందుండి కోదండాంకితమైన శ్రీరాముడు అగుపించాడు. దీనియందు బుద్ధి నిలిపి ధ్యానించాడు బోయ. అది కోటి రవిచంద్రతేజమై నిర్గుణరూపంగా మారింది. రఘునాథరాయలు అద్వైతాన్ని అంగీకరించిన వైష్ణవుడు.కనుక సగుణము నిర్గుణముగా మారినట్లు గా చెప్తూ బోయ అనే సాధకుడు పరతత్త్వ సిద్ధిని పొంది వాల్మీకి మహర్షి అయన విధాన్ని చెప్పాడు. ఈ ప్రక్రియలో చుట్టూ ఒక పుట్ట పెరిగిపోయంది. అందులో మునిగి పోయందాయన మూర్తి మహర్షిగా పుట్టనుంచి బయటకు వచ్చాడు అందుకే మును పుట్టను పుట్టిన ముని అన్నాడువాల్మీకి మహర్షిని త్యాగయ్య. వాల్మీకి అంటే ఓ సాధకుడని అర్థం తెలుసుకొంటే తారకమైన విద్యలో ప్రకృష్టజ్ఞానసంపన్నుడై వల్మీకం నుంచి ఆవిర్భవించి త్రికాలజ్ఞుడైన ప్రాచేతసుడైనాడు. కరకు బోయ పరమ యోగి అయనాడు. లౌలికఅలౌకిక జీవితద్వయానికి అమేయమైన కావ్యబంధి యనే సేతు బంధాన్ని నిర్మించి జీవ బ్రహ్మ్యైకస్థితి పొందే మార్గాన్ని దర్శింపచేసిన మహానుభావుడు వాల్మీకి మహర్షి.

- పసుమర్తి కామేశ్వర శర్మ