మంచి మాట

కృష్ణామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలకడానికి సరళమైంది. చూడడానికి సుందరసుమనోహరమైనది. ముచ్చట్లు చెప్పడానికి మధురమైంది. కీర్తించడానికి బ్రహ్మానందమైనది. వినడానికి శ్రవణపేయమైనది. న్రేతానందాన్ని హృదయానందం కలిగించే లక్షణాలున్న దానిని ఎవరు వదులుకుంటారు. కావాలని ఎవరు కోరుకోరు? అటువంటి మహామహిమాన్విత లీలామానస చోరుడు శ్రీకృష్ణుడు. దేవకీదేవి ముద్దుల తనయుడు. గోపబాలకులకు గోపాలుడు, గోపికల మానసచోరుడు, రుక్మిణీపతి, సత్యాదేవి అతిప్రియబాంధవుడు, అర్జునునికి ప్రత్యక్షదైవం, ధర్మరాజాదులకు మార్గదర్శి, రాధాదేవికి ప్రియాతిప్రియతముడు, కుచేలాదులకు వాత్యల్య మిత్రుడు, గజేంద్రాదులకు ఆర్తజన రక్షకుడు. లోకానికి ఓ సద్గురువు. రాజకీయ నాయకుడు రాజనీతిజ్ఞుడు. యోగుల హృదయాల్లో నివసించేవాడు. సంజయ దృతరాష్ట్రాదులకు తత్త్వ బోధకుడు, కంస చాణూరదుర్యోదనాదులకు సింహస్వప్నం. దుష్టలను దునుమాడే వీరాధివీరుడు. సక్కుబాయ నామదేవాదులకు పరమాత్ముడు. ఇన్ని లక్షణాలుండేవాడు కేవలం దేవాదిదేవుడు పరమాత్మ శ్రీమన్నానారాయణుడు కాక మరొకరు ఎలా అవుతారు? తనే్న నమ్ముకున్నవారిని కాపాడే భగవంతుడు. తన్ను ఏవిధంగా తలిస్తే ఆవిధంగానే దర్శనమిచ్చే దైవం. తను నచ్చిన వారు నిల్చుమంటో నిల్చునే పండరి నాథుడు.
ఈ అపారకృపాంబురాశి అయన పరంధాముని సదా ఎవరు జపిస్తుంటారో వారిని తన రూపుకు తెచ్చేవాడు. ఎవరైతే కృష్ణకథలను ఆసక్తిగా వింటారో వారిని తన అక్కున చేర్చుకునేవారు. తననే నమ్ముకున్నవారు కష్టాలకడలిలో ఉన్నా వారిని వూతమనే నావనెక్కించి ఒడ్డుకు చేర్చువాడు. అట్లాంటి కృష్ణుణ్ణి వేదవేత్తలు ఆగమశాస్త్రాలతో పూజిస్తారు. పండితులు కవులు వేనోళ్ల కృష్ణచరితాన్ని వ్రాస్తూ చదువుతూ అందరికీ చెబుతూ ఆనందడోలికలూగుతారు. నాట్యకారులు కృష్ణామృతాన్ని తనవితీరా ప్రదర్శిస్తూ కృష్ణమాయలో ఒదిగిపోతారు. గాయకులు కృష్ణనామాన్ని కీర్తిస్తూ ఆయనచూపిన లీలలను తలుచుకుంటూ సంకీర్తనల్లో పొదుగుకొని పాడుకుంటారు. పామరజనం సైతం కిష్టయ్య కన్నయ్య అంటూ తమ పిల్లలనే కృష్ణునిగా వూహించుకుంటూ కృష్ణచేతలను స్మరించుకుంటారు. ఇలా అందరినీ ఆకట్టుకునే మాయనే కృష్ణమాయ. పెనుమాయ. ఈ మాయకు చిక్కని వారుంటారు. ఆఖరికి శివుడైననను కృష్ణమాయలో చిక్కి హరిహరసుతోద్భవానికి కారణమయనవారే కదా. అంతటి పరమేశ్వరు డే కృష్ణా అంటే మీరాబాయ జ్ఞానదేవు, నామదేవు, గోరానికుంభార్ ఇలా ఎందరెందరో కృష్ణుని రూపును తమ మనసుల్లో ప్రతిష్టించుకున్నవారే. ఆ చిన్ని కృష్ణుని ప్రతి చర్యా భక్తునికి కరతలామలకమే కదా.
కాలంలో కలిగినది కాలంలోనే కలసిపోతుంది అనే నిజాన్ని తెలుసుకోమని అర్జునుని గీతోపదేశం చేశాడు. తను కాక వేరైనది ఏదీ లేదని చెప్తూ కర్తకర్మక్రియ కూడా కృష్ణుడే అని నమ్మినవారి యోగక్షేమాలను తానే చూస్తానని స్వయంగా భగవద్గీతలో చెప్పాడు.
అట్లా అన్నాడుకనుకనే గజేంద్రుడు అలనాడు యోగుల హృదయాల్లో నివసించేవానివి, సాధువుల ఇండ్లల్లలో మెలిగేవానివి అయన నీవు అసలు ఉన్నావా, ఉంటే నీవు చెప్పేది నిజమే అయతే ఉన్నపళాన లేచి రమ్మనాడు. ఎక్కడంటే అక్కడ తలుచుకుంటే చాలు దర్శనమిచ్చేవాడు కదా కృష్ణుడు అట్లాంటి కృష్ణుడంటే నేను సేవించే లోకంబులు లోకేసులు ....డేకాకృతివెలుగు నతని నే సేవింతున్ ... పతిత పావనుడు లోకేశుడు కదా... అనుకున్నాడు. అట్లాంటి ఆ కృష్ణుణ్ణి నేను ఎక్కడనుంచి రమ్మంటే అక్కణ్ణుంచే వస్తాడా అనుకున్నాడు అనుకొన్నవెంటనే కలడందురు దీనుల యెడ ... కలడందరు రన్నిదిశలను........ మరి నా కోసం కలుగడే నాపాలి కలిమి సందేహింప గలిమి లేములు లేక గలుగువాడు ...... అనుకొన్నాడు. అఖిలరూపముల్ దన రూపమైనవాడు ఆదిమధ్యాంతములు లేక యడరువాడు... వినడే.. చూడడే.. తలపడే.. వేగరాడే.. అనుకొన్నాడు. అట్లాఅని వూరుకుంటే భక్తజన రక్షకుని గురించి తెలిసే దెట్లా అందుకే గజేంద్రుడు ఓ కమలాప్త.... శరణార్థిని నన్ను గావవే నన్ను రక్షించవయ్యా అని దీనాతి దీనంగా వేడుకుంటూనే అల వైకుంఠపురంబులో నగరిలోఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః పాతేందు కాంతోపలోత్పల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు.. అని మొరవెట్టుకున్నాడు .
సామాన్య మానవులైతే రమావినోదులైతే వేరుమాట ఇక్కడ ఉన్నది పరంధాముడు ఆర్తజనపరిత్రాణుడు... శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై ... పరుగెత్తుకు వచ్చేవాడే కదా నిజమైన భక్తపరాయణుడు శ్రీమన్నారాయణుడు. అందుకే తలవండి సదా హరేరామ రామరామ హరే హరే హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే...

- రఘువందిత