మంచి మాట

మాతృసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం క్రితం శ్రీశైలంలో కౌండిన్యుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన జీవితం పూర్తిగా భగవత్సేవకే అంకితం చేశాడు. రోజూ భగవంతుని గూర్చి, ఆయన లీలలను గురించి ప్రజలకు చెప్పేవాడు. ఒక రోజు ఆయనకు భగవంతుడు కలలో కనిపించి, ఈ మానవ జీవితం తరువాత నీవు స్వర్గంలో నా ప్రక్కనే ఉంటావు అని చెప్పాడు. దానితో కౌండిన్యుడిలో ఒకింత గర్వం పొంగింది. తను భగవంతునికి అత్యంత ప్రియమైనవాడినని గర్వపడుతుండేవాడు. ఒక రోజు కౌండిన్యుడికి ఒక సందేహం వచ్చింది. భగవంతునికి తనంత ప్రియమైనవాడు మరొకరు ఎవరైనా ఉన్నారా అని ఆ సందేహం.
చిత్రంగా ఆ రోజురాత్రే కౌండిన్యుడికి కలలో భగవంతుడు కనిపించాడు. కలలోనే భగవంతుడిని తన సందేహం అడిగాడు కౌండిన్యుడు. భగవంతుడు ఒక చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పాడు. ‘‘కౌండిన్యా, నా ప్రక్కనే ఉండటానికి అర్హత పొందిన మరొక అద్భుత వ్యక్తి కూడా వున్నాడు. అతడు ఎవరో కాదు ఈ ఊరిలోనే చెప్పులు కుట్టే హరి అనే నా భక్తుడు అని చెప్పాడు. కౌండిన్యుడు ఆశ్చర్యపోయాడు. హరి భగవంతునికి ఏ విధంగా అత్యంత ప్రీతిపాత్రడయాడో కౌండిన్యుడికి అర్థంకాలేదు! అందుకని మరుసటి రోజు పొద్దునే్న హరివద్దకు వెళ్లి అసలు విషయం తెలుసుకుందామని కౌండిన్యుడు నిశ్చయించుకొన్నాడు. పొద్దునే్న కౌండిన్యుడు చెప్పులు కుట్టే హరి ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి పరిసరాలు చర్మ దుర్గంధంతో నిండి ఉన్నాయి! హరి గుడిసె లోపల తెగిన, చెడిపోయిన చెప్పులున్నాయి. హరి తెగిన చెప్పును కుడుతున్నాడు. కౌండిన్యుడిని చూస్తూనే హరి లేచి నిలబడి నమస్కారం పెట్టి
‘‘మహానుభావా! మీరు మా ఇంటికి రావడమేమిటి? పిలిస్తే నేనే వచ్చేవాడినిగా. నేను ఎంతో అదృష్టవంతుడిని. మీరు రావడంవలన నా జన్మ ధన్యమైంది. తమరు ఇక్కడ కూర్చోండి, ఇప్పుడే వస్తాను అని ఓ చిన్న బల్లను చూపించి గుడిసెలోపలికి వెళ్ళాడు. కొంతసేపు కౌండిన్యుడు అక్కడే కూర్చున్నాడు. హరి లోపల ఏంచేస్తున్నాడో కౌండిన్యుడికి అర్థం కాలేదు. పూజ చేస్తున్నాడా? లేక మంత్ర తంత్రాలు ఏమైనా చేస్తున్నాడా అనే సందేహం కౌండిన్యుడిలో కలిగింది. ఇక ఉండబట్టలేక తడిక సందులోనుండి లోపలికి దృష్టి సారించాడు. లోపల హరి తన ముసలి తల్లి కాళ్ళు పిసికి, నొప్పులకు లేపనం పూశాడు. ఆమెకు అతి మెల్లగా పాలు తాగించాడు. ఆ తల్లి పాలు త్రాగి మెల్లగా కళ్ళు తెచి, నాయనా నీకు భగవంతుడు తోడు ఉంటాడు, నీకు ఆ భగవంతుని ప్రక్కన చోటు దొరుకుతుంది అని చెప్పింది.
కౌండిన్యుడికి జ్ఞానదయం అయింది. భగవంతునికి దగ్గర అవ్వాలంటే కేవలం భక్తి పూజలు మాత్రమే కాదు, మానవసేవే మాధవసేవ అని, తల్లిని మించిన దైవం లేదు. అందుకే హరి భగవంతునికి ప్రీతిపాత్రుడయినాడు.
తల్లిసేవ తరువాత హరి బయటకు వచ్చి ‘‘మహానుభావా! మీ చెప్పులు తెగాయా?’’ అని అడిగాడు.
‘‘లేదు నాయనా, నా అజ్ఞానం తెగిపోయింది’’ అని హరికి నమస్కరించి, ‘వస్తాను, నీకు భగవంతుని కృప ఎల్లవేళలా ఉంటుంది’ అని కౌండిన్యుడు తన ఇంటివైపు అడుగులు వేశాడు. ఆశ్చర్యపోవడం హరివంతైంది.
ఆ రోజునుండే కౌండిన్యుడు తన ప్రవచనాలు వినేందుకు వచ్చినవారికి తల్లిదండ్రుల సేవ గురించి, కష్టాలలో వున్నవారిని ఆదుకోవలసిన ఆవశ్యకత గురించి బోధించి ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాడు.
మానవ జీవితం క్షణభంగురమే కానిఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మంచివారి ఉపదేశాలు, మంచిగ్రంథాల పఠనం, భగవంతుని భజనలు ఉపకరిస్తాయ. సజ్జన సాంగత్యం మంచి దారిని చూపెడుతుంది. ఉన్నతుల జీవిత చరిత్రలు కూడా మార్గదర్శకం చేస్తాయ. కనుక వీటిపై దృష్టి పెడితే ప్రతివారు సజ్జనులుగా మారే అవకాశం ఉంది.

-కంచనపల్లి వెంకట కృష్ణారావు