మంచి మాట

రామనామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగానికి సంబంధించిన రామరాజ్యమే నేటికి జనులు ఇష్టప డుతుంటారు. రాక్షసులెందరినో మట్టుపెట్టి అర్జునుడికి గీతను బోధించిన ద్వాపర యుగంలోని కృష్ణుని కన్నా అందరి నోట్లో రామ రామ అనే పదమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ రామ అన్న పదం ధర్మానికి మారుపేరుగా ఉంటుంది. రామరాజ్యము ధర్మరాజ్యం. అక్కడ అవినీతి అధర్మము, అవిద్య అజ్ఞానము ఇలాంటి వాటికి చోటు లేదు. ఆ రాజ్యములోని అందరూ చదువుకున్నవారే. నాగరికత నేర్చినవారే. ఒకరిది కావాలని ఆశపడేవాళ్లు లేరు. ఒకరికి దానం చేసే స్థాయ ఉన్నవారే కాని ఒకరి సంపదను అన్యాయంగానో, అక్రమంగానో లాక్కొని అనుభవించాలని అనుకునేవారు కాదు.
అందుకే నేటికి కలియుగంలో ఉన్నాసరే రామరాజ్యం కావాలని అనుకొంటారు. మనం కూడా విద్యావంతులము అయతే, నాగరికత నేర్చుకుంటే ధర్మపు విలువను తెలుసుకొంటే చాలు ఎవరికీ తలవంచనక్కర్లేదు. రాముని లాగా జీవించవచ్చు.
రావణాసురుల్లాంటి వారిని ఎదురించవచ్చు. రామరాజ్యంలో శాశ్వతమైన మానవతా విలువలకు ఆటపట్టుగా ఉండేది. ఆ రామరాజ్యాన్ని మానవాదర్శంగా రామాయణ అంతర్గత జీవన సరళి శాంతికి సోపానము కాగలదని మహాత్ములందరూ ఆమోదించారు. శ్రీరాముని గుణములు, సీతామహాసాధ్వి చరిత్రము అజరామరములు సాటిలేనివని కీర్తించారు. కనుకనే అందరి నోట రాముని పేరు వినబడాలని రాముని అయనాన్ని అందరూ తెలుసుకొంటే ధర్మాచరణకు పూనుకొంటారని వాల్మీకి తన శిష్యులు రాముని కొడుకులైన లవకుశలకు రామాయణగానాన్ని నేర్పించారు.
రామనామం శాంతిని, శక్తిని, సమాజ ఔన్నత్యాన్ని, దేశసౌభాగ్యాన్ని సాధించే మార్గం. ప్రతివ్యక్తి జీవితంలో శాంతి, సౌఖ్యాలు రావాలంటే రామతత్త్వం అలవర్చుకోవాలి. ‘‘కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం’’ అనే రామతత్త్వ సాధకులు దేశాన్ని పరిపుష్టి చేయగలరు. సద్బుద్ధి వలన సత్కార్యము దానివలన పుణ్యము దానివల్ల సరియైన ఉత్తమమైన జన్మ కలుగుతుంది.
కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని వ్యక్తి ఫలాపేక్ష రహితంగా తన కర్తవ్యాన్ని తాను చేస్తే చాలు. భారాన్ని అంతా కృష్ణపరం చేస్తే వారి యోగక్షేమాలను కృష్ణుడే చూస్తానని గీతలో స్వయంగా చెప్పాడు. అటువంటి నారాయణుని మీద భారం వేసి ఫలాపేక్ష మీద కోరికను నశింపచేసుకొని జీవించడం మొదలుపెడితే చాలు రామరాజ్యం దానంతట అదే చేకూరుతుంది.
‘‘శ్రీరామ జయరామ జయ జయ జయ రామ’’ అన్న నామాన్ని ప్రతిరోజు జపిస్తుంటే జపించిన వారిలో అద్భుతమైన స్వరము, చిత్తశుద్ధి, శాంతిసౌభాగ్యాలు కలుగుతాయ. రాక్షస ప్రవృత్తిని నిర్మూలించి జీవిత విలువలను ప్రతిష్ఠింపచేసే దివ్యౌషధం రామనామం. ఓసారి విశ్వామిత్ర యాగాన్ని ధ్వంసం చేయాలని అనుకొని మారీచ సుబాహులు వెళ్లారు. అక్కడ వారికి రాముడు ధనుర్ధారియై కనిపించాడు. వారితో పోరాడారు. మారీచుని ఎంతో దూరంగా పడవేసేట్టు రాముడు ఒక్కబాణంతో తరిమివేశాడు. ఆ బాణపు దెబ్బ రుచిచూచిన మారీచుడు మళ్లీ రామునితో పోరాడాలనే అనుకోలేదు. నాటి నుంచి రామశబ్దాన్ని జపిస్తూ కాలాన్ని వెళ్లదీసాడు. చివరకు రావణుని ప్రోద్బలంతో రాముని దగ్గరకు జింక రూపంలో వచ్చి రాముని చేతిలోనే ప్రాణాలను కోల్పోయాడు.
ఓం కారం సృష్ట్యాది లోని నిర్గుణ, నిరాశ్రయ, నిరాకార శూన్యసంకేతం. శ్రీరామ ధ్యానం సంపూర్ణ సద్గుణ ప్రజ్ఞాపరమార్థ ప్రాప్తి పథం. జన్మజన్మల నరక శిక్షలను రూపుమాపేదే రామనామం. నారాయణలోని ‘రా’ నమశ్శివాయ లోని ‘మ’ కలిపి ‘రామ’ ఏర్పడిదంటే అది రెండు శక్తుల సమన్వయమే. కనుకనే రామశబ్దం అత్యంత పవిత్రమైంది.
అట్లా ఒక్కసారి రామనామాన్ని మనసారా జపిస్తే చాలు వేయ జన్మల పాపమైనా నాశనమైపోతుంది. ఇక జన్మంతా పుణ్యకార్యాలు చేస్తూ ధర్మాచరణకు పూనుకోవచ్చు. కనుక ప్రతివారు రామశబ్దాన్ని విడవకుండా జపించాలి.

- సాయకృష్ణ