మంచి మాట

విశ్వాత్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మమనే ఆయుధం చేతిలో పట్టుకుని ఎంతటి కీకారణ్యంలో అయనా నడువవచ్చు. క్రూరమృగాలను సైతం మచ్చిక చేసుకోవచ్చు. కనుకనే హిరణ్యకశ్యపాది రాక్షసులు ఎంతటి ప్రమాదకరమైన వరాలను కోరినా ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు అతి సులభ ప్రయత్నమే చేస్తాడు.
ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనలను రక్షిస్తుందని చెప్పడానికే భగవంతుని కథలే మార్గాలు. భగవంతుడు సృష్టించిన ప్రాణులు ఎవరికి వారు వేటికి వాటి గుణాలతో సమ్మిశ్రీతం అయ పాపపుణ్యాల నే చట్రంలో ఇరుక్కుని జననమరణచక్రం బారిన పడుతున్నారు. భగవంతునిచే సృష్టించబడిన ప్రకృతి పరమాత్మ తత్వానే్న అనుసరిస్తున్నది. ఆ ప్రకృతిని మానవుడు తన కురచ బుద్ధితో నాశన మొనరుస్తున్నాడు. అతడూ వృద్ధిపొందడంలో వెనుక పడుతున్నాడు.
ఒకానొక కాలంలో హిరణ్యకశ్యపుడు భగవంతుని దగ్గర ఏ ఆయుధముతోను తాను చంపబడకూడదన్న వరాన్ని పొందాడు. ఆ దైవం కావాలనుకొంటే ఆయుధం కానిది ఏముంది ఈ లోకంలో. కాలం మూడిన హిరణ్యకశ్యపుణ్ణి భగవంతుడు తన గోర్లనే ఆయుధాలతోనే ప్రాణాలు తీశాడు. కనుక భగవంతుణ్ణి ప్రేమచేత మెప్పిస్తే ఆ భగవంతుని స్థానాన్ని కూడా ఇస్తాడేమో కాని ఆ భగవంతుణ్ణి ద్వేషించడంఅంటే అతనికి ఉన్నది అజ్ఞానమనే తెలుస్తుంది. ఆ అజ్ఞానమే అధర్మాన్ని చేయస్తుంది. సర్వలోకరక్షకుడైన పరమాత్మను ఏ ఒక్కచోటనో ఉంటాడు అతడు పరిమిత దృష్టి కలిగి ఉంటాడని అనుకున్నవారు ఆ భగవంతుడికి తెలియకుండా ఈ పనిని ఈ రహస్య ప్రాంతంలో చేసేస్తే సరిపోతుంది అనుకొంటే ఎలా కుదురుతుంది. హృదయ స్థానంలో ఉండే పరమాత్మ కళ్ళు కప్పడం అంటే అజ్ఞానమే కదా. ఆ దృష్టితో చేసే అధర్మాలను కాలరాచి ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు రాక తప్పదు కదా.
ఈ ధర్మం అర్థం కావాలంటే ధర్మసూక్ష్మం తెలియాలి. ఈ ధర్మ సూక్ష్మాలు అర్థం కావాలంటే భగవంతుణ్ణి నిశితంగా పరిశీలించాలి. తన్నుతాను పరీక్షించుకోవాలి. తాను కూడా భగవంతుని మాదిరి అయపోవాలి. అపుడు సంధేహమేమీ లేకుండానే సర్వం అర్థం అయపోతుంది. సర్వానికి భగవంతుణ్ణి కారణుడు అని తెలుసు కొంటే ఏ ధర్మమూ తెలియకపోయనా భగవంతునిగా మారే అవకాశాలూ ఉన్నాయ. తెలిసి చేసినా తెలియక చేసినా భగవంతునిపై పెంచుకున్న ప్రేమ మనిషిలో భక్తి అనే బీజాన్ని నాటుతుంది. ఆ భక్తే సర్వములోనూ భగవంతుడున్నాడన్న నిజాన్ని తెలుపుతుంది.
విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మనే విశ్వాత్మగా గ్రహిస్తాడు భక్తుడు. విశ్వసృష్టి చేసిన విశ్వాత్మను తెలుసుకొన్న తర్వాత ఇక వేరుదానితో పని ఉండదు. ఆ విశ్వాత్మనే ప్రతిహృదిలోను ఉంటాడని తెలుసుకొంటే భగవంతుని సర్వాంత ర్యామితత్వం బోధపడుతుంది. ఒక్కసూర్యుడు అనేక ఘటాలలోఉన్న జలంలో కనిపించడంలోను, ఒక్క మట్టే కుండలుగాను, గోడలుగాను, పైకప్పుగాను కనిపించడం లోనూ భగవంతుని సర్వాంతర్యామి తత్వాన్ని ఎరుకపర్చడమే.
దానే్న భారతీయం దైవం ఒక్కడే అంటుంది. కనుకనే సర్వేజనా సుఖినోభవన్తు అంటుంది. చేసే పనిని బట్టి కులాలు ఏర్పడ్డాయ అనడంలోను ఇదే తత్వం గోచరిస్తుంది. అందుకే కులాలకు, మతాలకు హైందవం ప్రాధాన్యమివ్వదు. సనాతన ధర్మానికే విలువనిస్తుంది. ప్రాధాన్యం సంతరిస్తుంది.
చెట్టు పుట్టా, రాయ రప్పా, కొండకోనా ప్రతి దానిలోను పరమాత్మ ఉన్నాడన్న నిజాన్ని సామాన్యులకు అర్థం కావడానికి అనేకానేక పండుగలు పర్వాలు ఆరంభమైనాయ. ప్రతి పండుగలోని అంతరార్థాన్ని విడమర్చి చూస్తే సర్వంలో దైవం ఉన్నాఢన్న నిజం తెలుస్తుంది. విశ్వాత్మ అయన పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే భగవద్గీతను ప్రతిరోజు పఠిస్తే చాలు. విష్ణు సహస్రనామావళిని చదివి అర్థం చేసుకుంటే అందులోని ప్రతి పదమూ విశ్వాత్మగురించే చెబుతుంది.

- సాయ కృష్ణ