మంచి మాట

శివలీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతమయుడు, అర్థనారీశ్వరుడు, యావత్ జగతికి శక్తి ముక్తి ప్రదాయకుడు అయిన శివుడి లీలల్ని జ్ఞానులైనా, ఆధ్యాత్మిక విజ్ఞానఖనులైనా, చక్రవర్తులైనా, రారాజులు, రాజులు అయినా శంకరుని లీలా విశేష పరీక్షలకు బద్ధులే.
భారతదేశం వేదభూమి. దేశంలోని పుట్ట అయినా, పర్వతాలైనా, పారే నదులు సెలయేర్లు, చివరికి దట్టమైన అడవులు, యావత్ భారతదేశంలో మట్టి కూడా ప్రణవ ఓంకారనాదంతో పరిఢవిల్లేవే. సనాతన ధర్మం, వేద సంస్కృతి పుంఖాను పుంఖంగా ప్రణవ నాదానికి శృతిలయలు అందిస్తాయి.
వేదభూమి, పుణ్యభూమి, ఈ భూతలంలో అణువణువునా హరినామ సంస్మరణ, శివసంస్తుతికి ఆలవాలమై, వృక్షాలలో ఆకులైనా, కొమ్మలైనా ఓంకారనాదం పరిఢవిల్లే చైతన్యం వెల్లివిరుస్తుంది. అలాంటి దశలో హిందూ దేశంలో భద్రాయువు అనే రాజు పరమ శివభక్తుడై ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడే ధర్మప్రభువు. తన పాలిత దేశంలో శివాలయాలను నిర్మించి శివభక్తితత్పరులను ఘనంగా సేవించి ప్రజల మన్ననలందుకొన్న రాజుగా భద్రాయువు వినుతికెక్కాడు.
భద్రాయువు భార్య కీర్తిమాలిని భర్తకు తగ్గ భార్య. సుగుణశీలి, ముక్కంటి పాద పద్మాలను నిరంతరం ధ్యానించే పతివ్రతామతల్లి. ఒక పరి భద్రాయువు భార్యా సమేతంగా వనవిహారానికి బయలుదేరి వెళ్ళారు. వారికిఆ ప్రాంత వనశోభ ఎంతగానో ఆకట్టుకుంది. వారిద్దరూ ఆ పూల సువాసనల్ని ఆఘ్రాణిస్తూ పరవశులైనారు.
పూపొదల కావల ఏదో సందడి వినిపించి రాజ దంపతులు అక్కడ చూశారు. యవ్వన శోభలు శోభిల్లుతున్న ఒక యువ ప్రేమ జంట తమ లాగే వన విహారానికి వచ్చారని వారి సందడే అదిఅనివీరు గ్రహించారు. కీర్తిమాలిని వారిని చూచి ఆ జంట ముమ్మూర్తులా ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు కదా అని భద్రాయువుతో అంది. ఆ పరమశివుని మనసారా జ్ఞానించే నీకు సర్వం శివమయంగా తోచడంలో ఆశ్చర్యమేమీ లేదు అంటూ చతురోక్తులాడాడు.
ఉన్నట్టుండి రక్షించండి రక్షించండి అంటూ గావు కేకలు వినబడ్డాయి. ఈసారి మరింత గట్టిగా ఆ యువకుడు నా భార్యను పులిబారి నుండి రక్షించండంటూ రోదించడం రాజు చూశాడు.రాజు వారిని రక్షించాలని ముందుకు ఉరికారు. రాజు ప్రయత్నంఫలించలేదు. ఆ పులి ఆ యువకుని భార్యనుచంపితినేసింది. రాజ దంపతులిద్దరూ ఆ సంఘటనకు ఎంతో వగచారు.
యువకుడు రాజు వద్దకు చేరుకొని రాజా! నేనొక బ్రాహ్మణుడను. సౌందర్యవతి అయిన నా భార్య పులి బారిన పడుతుండగా వీరుడవు శౌర్యధనుడవు అయిన మీరు పులిని సంహరించి నా భార్యకు ప్రాణభిక్ష పెడతావని నమ్మాను. అయితే రాజ్యప్రజల్ని రక్షించాల్సిన రాజే ఈ ఘోరాన్ని చూస్తూ నా భార్యను రక్షించలేకపోయారు. ఇక ప్రజల్ని ఏమి రక్షిస్తారు అంటూ నిందోక్తులాడాడు. తిరిగి విప్రుడు ప్రభూ! నా ధర్మపత్ని లేకుండా నేను జీవించలేను. రాజా! నా భార్యను ఎలా కాపాడలేకపోయావు. రాజధర్మం రీత్యా నా భార్యకు బదులుగా నీ భార్యను నాకియ్యి అనిఅడిగాడు. రాజు ఆలోచించి విప్రోత్తమా మరొకరి ధర్మపత్నిని కోరడం ఎంతవరకు సమంజసంఅన్నాడు. ఆమాటలకు విప్రుడుతొట్రుపడకుండా రాజధర్మం నిర్వర్తించండి అన్నాడు. రాజధర్మం ముందు స్వధర్మాన్ని తలచి, వగచి లాభం లేదు. విప్రునికి రాజధర్మాన్ని అనుసరించి సపత్ని అయిన కీర్తిమాలినిని దానమచ్చాడు. అంతలో ఇటు తిరుగు రాజా! రాజుగా నీ రాజ్య పౌరులను ఎలా సంరక్షిస్తావో, నీకెంత భూతదయ వుందో పరీక్షించాలని ఈ మాయోపాయమైన బ్రాహ్మణ ప్రేమజంటను ప్రేరకంగా, ఆ యువతిని పులి భక్షించిందనే ఒక మాయోపాయమైన నాటకానికి తెరతీశామని చెప్తూపార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు.నీ రాజధర్మాన్ని మేం మెచ్చుకుంటున్నాం నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా... భద్రాయువు మీ సాన్నిధ్యం చాలని కోరుకోగా, కీర్తిమాలిని నిరంతర పతిసేవా భాగ్యాన్ని ఆకాంక్షించింది.

- దాసరి కృష్ణారెడ్డి