మంచి మాట

శుభదినము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని సృష్టిలో మనకు అన్నీ అద్భుత రహస్యాలే. ఆదికాలం నుండి మానవుడు చేసే ప్రతి చర్య భగవత్ సంకల్పబలమే. తరిగే కాలాన్ని, పెరిగే మనిషి ఆయుష్షును ఎవరూ ఆపలేరు. మన జననం మనకు తెలియదు.. మన మరణం మరెవరికీ తెలియని మర్మం. అదే దేవరహస్యం. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. పంచభూతాలు మనల్ని నడిపించే ప్రత్యక్ష దైవాలు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే లోకకళ్యాణం, లేదంటే ప్రళయం. ఇప్పటికే ఈ భూప్రపంచంలో ఎన్నో విపత్తులు చూస్తేనే వున్నాము. మానవులు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారు. ఈ కలియుగంలో వరదలు, తుఫానులు, భూకంపాలు వచ్చి ప్రాణ ఆస్తి నష్టాలు అనునిత్యం చూస్తూనే ఉంటున్నాము. దీనికి కారణం మనమే అన్నది జగమెరిగిన సత్యం. గాలి, నీరు, నింగి, నేల, నిప్పులను నిత్యం కాలుష్యం చేస్తున్నాము. నేడు తినే తిండి అంతా రసాయనాల మిళితం. నాడు వందేళ్ళు ఆరోగ్యంగా జీవించే మనం నేడు 20 ఏళ్ళకే చేవ చచ్చిన జీవశ్చవాల్లా బ్రతుకుతున్నాము. తప్పని తెలిసినా.. తప్పని పరిస్థితుల్లో జీవిస్తున్నాము. అదే మానవ నైజం.
భగవంతుని దృష్టిలో మనమంతా సమానులే. ఈ కుల మతాలు, ఆస్తి అంతస్థులు, అధికారాలు, హోదాలు మనిషికి కొలమానాలు కావు. కానీ ఈ కలియుగంలో అవే రాజ్యమేలుతున్నాయి. రాజులు, రాజ్యాలు, జమిందారులు అంతా మట్టిలో కలిసిపోయినా, ఈ ప్రజాస్వామ్యంలో రౌడీలు, రాజకీయ నాయకులు రాజ్యమేలుతున్నారు. కాని భగవంతుని దృష్టిలో వాళ్ళు చేసిన పాపాలకు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించడం ఖాయం. కొన్ని సంఘటనలు మనకు అపుడపుడు కనిపిస్తూనే ఉన్నాయి. మనిషిగా తప్పులు చేసినా.. తన అంతరాత్మ సాక్షిగా ఏదో వేదనకు గురికావడం తథ్యం. మనిషి మనిషిలా జీవించడంలో ఎంతో హాయి వుంది. అదే సత్యం.
భగవంతుడు ప్రతి మనిషికి ఏదో ఒక వరం ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. ఒకడు రాజు కావచ్చు.. మరొకడు సేవకుడు కావచ్చు. అందులో ఏ భేదం లేదు. అందరూ పల్లకి ఎక్కాలనుకుంటే మోసేవారెవరు? భగవంతుడు మనకై అరవై నాలుగు కళలు ప్రసాదించాడు. ఎవరు ఏ కళలోనైనా రాణించవచ్చు. ఎవరి శక్తిమేరకు వారు విజయాలు సాధించవచ్చును. కాని ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. భగవంతుడు మనల్ని ఈ భూమిమీదకు పంపే వేళలోనే మనకేమి కావాలో ఏమి చేయాలో నిర్ణయిస్తాడు. అంతా నేనే.. నేను లేనిదే ఏమీ లేదు అని విర్రవీగే వారికి ఆ భగవంతుడే తగిన గుణపాఠం చెబుతాడు. రైతు పంటలు పండిస్తే అందరికీ ఆహారం. మరి అందరూ రైతులు కాలేరు కదా! రైతు పంట పండించాలంటే.. భూమి కావాలి. ఎద్దులు కావాలి, కూలీలు కావాలి. విత్తనాలు కావాలి. ఎరువులు కావాలి. వర్షాలు కావాలి. ఇవన్నీ ఎవరు ఇస్తారు? భగవంతుడు ఇస్తాడు. అందుకే భగవంతుడు లేనిదే మనం లేము.
ఈ జన్మనిచ్చిన భగవంతునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. మనసారా భగవంతున్ని కొలవడం తప్ప. మనం నడిచేదారి పదిమందికి ఆదర్శం కావాలి. అందుకు ఎంతోమంది మనకు ఈ భారతభూమిలో పుణ్యపురుషులు అవతరించి.. మనకై ఏన్నో అద్భుత మహాకావ్యాలు, పురాణాలు, వేదాలు అందించారు. వాటిని ఆచరించి.. వారు చూపిన దారిలో నడిచి మహాత్ములు కాకపోయినా మంచి మనుషులుగా జీవించాలి. ఈ భరతమాత కీర్తిని దశదిశలా దిగంతాల అంచులు దాటించాలి. భరతమాత ముద్దుబిడ్డలుగా గర్వంగా జీవించాలి.
శ్రీరాముడైనా.. శ్రీకృష్ణుడైనా నడిచిన మార్గము ధర్మమార్గము. వారు చూపిన మార్గము అందరూ ఆచరించదగ్గది. అహంకారంతో విర్రవీగిన రాక్షసులను హతమార్చాడు. అధర్మ మార్గాన పయనించేవారి పీచమణిచారు. సామాన్య మానవులమైన మనం ఈర్ష్య అసూయాద్వేషాలను విడనాడాలి. అపుడే ఈ జన్మకు సార్థకత. ధర్మమార్గాన నడవాలి. ఆ భగవంతున్ని సదా స్మరిస్తూ వుంటే ప్రతిక్షణం మనకు ఓ శుభదినం అవుతుంది. అదే మనం భగవంతుడికిచ్చే హృదయనివాళి.

- కురువ శ్రీనివాసులు