మంచి మాట

గీతాజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వమంగళకారిణి, సర్వసంశయ నివారిణి, సర్వార్ధ ప్రదాయిని అయిన భగవద్గీత మనిషికి తోడునీడఅంటే అతిశయోక్తికాదు. జీవన సంగ్రామంలో విజయాన్ని చేకూర్చడానికి భగవద్గీతనే ఉత్తమోత్తమైన అహింసాయుధం. ఉపనిషద్గోవుల దుగ్దము భగవద్గీతఅని పండితులు అంటారు. వేదాంగవేత్తలు భగవద్గీతను వేదాంత సారమని, బ్రహ్మవిద్య అనీ చెప్తారు. అర్జునునిఉపాధిగా చేసుకొన్న కృష్ణుడు జీవులయందు సమత్వమును, కర్మకౌశలమును మానవాళికి నేర్పించాడు. తెలిసినవారు గీత అద్వైతామృతమును బోధించుననియు, తద్వారా తత్వజ్ఞానంపొందుతారని దానివలన మోక్షం ప్రాప్తిస్తుందని అంటారు.
ఈశ్వరుని అంతర్యామిత్వమును భక్తియోగమును గీత ఉపదేశించుచున్నదని రామానుజుడు అన్నారు. కురుక్షేత్ర రణరంగంలోని బంధువులు, బాలలు, యువకులు, గురువులు వృద్ధులైన వారినందరినీ చూచి అర్జునుని కలిగిన నిరాసక్తతను గమనించి శ్రీకృష్ణుడు 700 శ్లోకములతో గీతను బోధించాడు. అర్జునుని శోకతప్తతను గని కృష్ణుడు ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో క్లైబ్యమును, హృదయ దౌర్బల్యమును పొందుట అర్జునుని వంటి వీరునికి తగదని హెచ్చరించాడు. ఆత్మ దేహము కాదు. దేహమందు దేహి ఒకడు కలడు. అతనికి కౌమార, యవ్వన జరలవలననే మరొక దేహము ప్రాప్తమగును. అతడు ఎన్నడును పుట్టడు, చావడు, ఉండి లేకుండా పోడు. అతడు నిత్యుడు, శాశ్వితుడు, చంపబడడు ఆ అతడే ఆత్మ అని నిత్యసత్యమైన ఆత్మను గూర్చి వివరించాడు.
నరుడు పాతబట్టలను వదిలి కొత్త బట్టలనెట్లు ధరించునో, దేహి జీర్ణ శరీరము వదిలి నూతన శరీరమును పొందును. దేహమును గూర్చి నీవు వగచుచున్నచో దానికై కాలమును వ్యర్థము చేసికొన పనిలేదని స్పష్టముగా శ్రీకృష్ణుడు చెప్పాడు.
గీత - అహంకారముచే మనిషి ప్రవర్తించినచో జీవితాన్ని వ్యర్థం చేసుకొన్నవాడౌ తాడు. కేవలం ఈ జగత్తంతా ఈశ్వరుని మాయా శక్తిరూపమే అందులోఉన్న నరుడు నిమిత్తమాత్రుడు గనుక నరుడు అన్ని ధర్మములను పరిత్యజించి ఈశ్వరునినే శరణుజొచ్చితే ఆ కృష్ణుడే అతనిని అన్ని పాపములనుండి విముక్తిని చేస్తాడు. శ్రీకృష్ణపరమాత్మనే స్వయంగా ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’- అన్నాడు కదా ఇదే గీతాబోధ.
ఏకాగ్ర చిత్తంతో, భక్తిశ్రద్ధలతో గీతను పఠిస్తూ, పరిశీలించువారికి ప్రతీ పదం ఒక కొత్త రహస్యం నిక్షిప్తమై యున్నట్లు అవగాహనకు వస్తుంది. మానవాళి జంతుదశనుంచి దివ్యునిగా దివ్యపథంలో సంచరించడానికి అవసరమైన గొప్ప గ్రంథం గీత. భగవద్గీత జీవనయానాన్ని సరళీకృతం చేసుకొని హరిసన్నిథి చేరడానికి ఇహలోకంలో ఆనందంగా జీవించి చరమదశలో మోక్షాన్ని పొందడానికి మార్గం చూపే జీవన కరదీపిక.
భగవద్గీతను అనుసరిస్తూ జీవనయాత్ర చేసే బుద్ధిమంతుడు కృష్ణ్భగవానుడే దేవ దేవుడని తెల్సికొనినవాడై అతనికి శరణుపొంది సుఖశాంతులతో జీవించి జీవితాన్ని సార్థక్యం చేసుకొంటాడు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు సందేహాలకు భగవద్గీతలోనే సమాధానాలు ఉన్నాయి. కనుక చిన్ననాటి నుంచి పిల్లలకు భగవద్గీత పట్ల ఆసక్తిని కలుగచేస్తే రాబోయే తరం అంతా కృష్ణమయం గా ఉంటుంది. భారతభూమి స్వర్గసీమగా తయారు అవుతుంది.
ఓ కిరీటీ! నా అవతారములు కర్మలు, దివ్యమైనవి ఎంతో నిర్మలమైనవి. మరి అలౌకికమైనవి. ఈ తత్త్వ రహస్యాన్ని తెలిసికొన్న ప్రతి వ్యక్తి దేహము చాలించిన పిదప పునర్జన్మ లేకుండా ననే్న చేరుకుంటాడు అని జ్ఞాన కర్మ సన్యాస యోగములో భగవానుడే స్వయంగా తెలియజేశాడు.
కనుక కర్తవ్యనిష్ఠను కలిగి అహరహం కృష్ణనామస్మరణ లోనే ఉంటూ కృష్ణుని దివ్యావతార గాథలను నిత్యం వింటూ, వినిపిస్తూ కర్మఫలాపేక్షకు దూరంగా ఉండి దుర్లభమమైన మానవజన్మను సార్థకం చేసుకొనే మనిషినే మనిషి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు