మంచి మాట

జీవన సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకి తన గూటిలోని కోకిల గుడ్లను తన గుడ్లుగా పొదిగి పిల్లల్ని చేసి, రెక్కలు వచ్చేదాకా కాపాడుతుంది. ఒక వృక్షం లేలేత తీగెకు తండ్రిలా ఊతమిచ్చి తన గుండెలమీద అల్లుకునే అవకాశాన్నిచ్చి, విస్తరించే సౌకర్యాన్ని కలిగిస్తుంది. చీమలు కష్టపడి నిర్మించుకున్న పుట్టను సర్పానికికి అప్పగించి పక్కకు తప్పకుంటాయి. అదే జీవుల జీవన సౌందర్యం.
భగవత్ తత్త్వంలో ప్రపంచం అంటే సర్వజీవకోటి. అందులో మనుషులు ఒక భాగం మాత్రమే. వేర్లు, కాండం, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పండ్లు- ఇవన్నీ కలిస్తేనే చెట్టు. మనమూ అంతే. సర్వాంగములు కలిసిన ఒక ప్రాణి. ఈ లోకంలో మనిషితోపాటు జీవిస్తున్న సకల జీవరాశులు మనిషికి తోబుట్టువు వంటివి. ఏక సూత్రప్రాయంగా జన్మించిన మనిషి మాత్రం తోటి వారిపట్ల నిరసనలు, దూషణలు, ద్వేషాలు, దురాగతాలతో నిత్యం సతమతమైపోతున్నాడు.
ఈ లోకం పంచభూత నిర్మితమైనది. ఈ భూత సంచయం మూల పదార్థం నుంచి ఏక పదార్థం నుంచి విడిపోయిన కణ సముదాయమే తప్ప వేరే పదార్థం కాదు. ఆ బ్రహ్మ బీజం నుండి మూల వేరు నుండి శాఖోపశాలుగా విస్తరించిన వృక్ష సంపదే ఈ పచ్చని ప్రకృతి.
ప్రకృతికీ, జీవజాలానికి సృష్టి ఆదినుండీ అవినాభావ సంబంధం వుంది. అసలు ప్రకృతిలోంచే జీవం ఉద్భవించి రకరకాల జీవులుగా రూపాంతరం చెందింది. అనేక దశల రూపాంతరాల అనంతరం సుదీర్ఘ కాలం తర్వాత ఏర్పడిన అత్యున్నత రూపమే మనిషి.
మనిషి ప్రకృతి వేరు వేరు కాదు. ప్రకృతిలోని పంచభూతాలు లేకుండా మనిషి మనుగడే లేదు. చిత్రం ఏమిటంటే వివిధ దశల ద్వారా రూపాంతరం చెందిన జీవరూపం అయిన మనిషి, భగవంతుడు అచ్చం తనలాగే ఉండి ఉంటాడని ఊహించి చిత్రాలు వేశాడు, శిల్పాలు చెక్కాడు, కావ్యాలు రాశాడు, కథలుగా అల్లాడు. కీర్తనలు గానం చేశాడు. కానీ ఈ సృష్టిలో మనిషితోపాటు జన్మించి జీవిస్తున్న జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, సముద్ర జీవాలు పని కూడా ఈ సృష్టికి మూలకారకుడైన భగవంతుడు మనిషి ఊహించినట్లే తమలాగా ఉంటాడని ఊహించి ఉండవు. అంతటి జ్ఞానం వాటికి లేదు. వాటి ధ్యాస ఆహారం, నిద్ర, సంతానోత్పత్తి, తోటి జీవులకు సాయపడటం, ప్రకృతి సమతుల్యతను పరిరక్షించడం.
మనిషి మనిషే మహామేధావి కనుకనే తన పరిణామం ఏమిటో దశావతారాల ద్వారా లోకానికి తెలియపరిచాడు. తన శక్తి ఏమిటో ఆకాశ మార్గం ద్వారా గ్రహాంతరాళాలకు దూసుకుపోతున్నాడు. ఒక పరిధి దాటిపోయిన విజ్ఞానం విశ్వ నాశనానికి కారణం అవుతుందేమోనన్న సందేహాలకు తావిచ్చేలా చేస్తున్నాడు.
సృష్టిలోని జీవజాలం యావత్తు ప్రకృతి సమతుల్యత కోసం పాటుబడుతూ పరిశ్రమిస్తుంటే మనిషి ప్రకృతి విధ్వంసానికి కారకుడవుతున్నాడు. అడవులను, అడవిలోని జీవజాలాలను, సముద్రంలోని జీవజాలాలను, వేటాడి వెంటాడి సంహరిస్తూ తనకు తానే ముప్పు తెచ్చుకుంటున్నాడు. మానవ నైజంలో మార్పు రావాలి. అందుకు తోడుగా ప్రకృతిలోని వృక్షాలను, జీవజాలాలను అభివృద్ధి చేయాలి. ఈ ప్రపంచం ఆ భగవంతుడు సృష్టించిన అందమైన ప్రపంచంగా, అద్భుత ప్రపంచంగా మార్చి జీవన సౌందర్యంలోని మహదానందాన్ని ఆవిష్కరింపజేయాలి. అప్పుడే ఈ సృష్టికి న్యాయం చేసినట్లు. సృష్టిలోని ప్రతి ప్రాణికి ఉపకారం జరిగినట్టు.

-పి.వి.రమణకుమార్