మంచి మాట

శ్రీవ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్గశిరమాసంలో తిరుప్పావై పాడని మహిళలు అరుదుగా ఉంటారు. నాడు శ్రీవ్రతాన్ని ఆచరించి ఆండాళ్ తల్లి శ్రీరంగణ్ణి మెప్పించి తన పతిగా చేసుకొన్నట్టుగానే ప్రతి కన్యారత్నమూ తనకు పాండురంగని వంటి నాథుడు కావాలని శ్రీవ్రతాన్ని ఆచరిం చటం ఆనవాయతిగా వస్తోంది. కన్యలేకాదు అటు స్ర్తిలు, పురుషులు అందరూ ఆ గోదాతల్లి అనుగ్రహాన్ని, ఆ యమ్మద్వారా తండ్రియైన రంగని అభిమానాన్ని చూర గొనాలని మాసాల్లోకెల్లా అతి శ్రేష్ఠమైన మార్గశిరంలో తిరుప్పావైను అనుసంధానిం చుకుంటూ ఉంటారు. రేపల్లెలో ఆనాడు కాత్యాయని వ్రతం చేసే కన్యకా మణులు సదా శ్రీకృష్ణుని తలుచుకున్నట్టే గోవులు కాచే గోపన్నలూ తమ నెచ్చలిని వదలి ఉండ లేనట్టుగా అనవరతమూ కృష్ణనామాన్ని స్మరిస్తూ ఆ కృష్ణ ప్రేమామృతాన్ని జుర్రుకుంటూ ఉంటారు.
ఈ కలియుగంలో ఆ కృష్ణప్రేమను అందుకోవాలని ఈ తిరుప్పావై పండుగను చేసే ప్రతిదేవాలయంలోను భక్తులు తండోపతండాలుగా చేరి తిరుప్పావైను సామూహికం గా పాడుతూ ఆ తల్లి కథను రసరమ్యంగా అర్చకుల నోట వినడానికి సమాయత్తం అవుతుంటారు. విల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుడు తన పూదోటలో దొరికిన తన ప్రాణప్రియను అల్లారు ముద్దుగా పెంచుకున్నట్టుగానే ఈ ధనుర్మాసంలో గోదాదేవిని అంగరంగ వైభోగంగా అలంకరించి అలంకార ప్రియుడైన రంగని సుందరంగా తీర్చిదిద్ది వారిరువురికి అర్చనాదులను జరిపి నారాయణస్మరణతో తులసిమాలలను వారికి అందిస్తుంటారు. ఆ గోదా దేవి పాడిన పాటలను రోజుకొక్కటి చొప్పున అనుసంధానించుకుంటూ నిత్య జీవితంలోను రేపల్లె అందాలను, కృష్ణుని అనుబం ధాలను స్మరించుకుంటారు. కలియుగం లోను కృష్ణనామాన్ని విడువకుండా పనులను చేసే విష్ణు చిత్తుని దినచర్యను తమ దినచర్యగా మలుచుకుంటారు కృష్ణ్భక్తులు.
నాడు విష్ణుచిత్తుని చేతుల్లో పెరుగుతున్న ఆ గోదాదేవి చిన్ననాటినుంచి కృష్ణకథలను విని అతనిపై అచంచలమైన ప్రేమను పెంచుకుని ప్రౌఢవయస్కురాలై గోపాలుణ్ణే తన నాథునిగా ఎంచుకుంది. ఆ తల్లి ప్రతిరోజు తులసిమాలలు, పూలమాలలను అందంగా కట్టి తాను ధరించి చూచుకొని ఆనందించి, ఆ తర్వాత వాటిని రంగని కైంకర్యానికి తన తండ్రికిచ్చి పంపేది.
ఒకరోజు ఎప్పటిలా అర్చకులు విష్ణు చిత్తుడు తెచ్చిన మాలలని రంగనికి అలకరించబోగా ఓ పొడవాటి వెంట్రుక తులసి మాలల్లో చిక్కుకుని పూజారులను అయో మయానికి గురిచేసింది. వారామాలలు అపవిత్రాలను నమ్మి విష్ణుచిత్తునకు తిరిగి ఇచ్చివేశారు. రంగని పూజచేయనిదే, రంగనికి తులసిమాలలు అర్పించనిదే మంచినీళ్లైనా ముట్టని విష్ణుచిత్తునకు ఈ సంఘటన కన్నీళ్లు తెప్పించింది. రంగా రంగా అని పదేపదే పలవరిస్తూ కనుల నీరు నింపుకుంటూ ఇంటికివెళ్లాడు. మరుసటి రోజు యథావిధిగా పూమాలలు అందించడానికి గోదాదేవి తాను మాలలు కట్టి వాటిని ధరించి పూదోటలో ఉన్న బావిలో తొంగిచూసి చిరునవ్వు చిందిస్తున్న ఆ చిన్నారి గోదాను చూచి విష్ణుచిత్తుడు అమిత వ్యాకులుడయ్యాడు. జరుగుతున్న అపరాధాన్ని తెలుసుకొని పదేపదే రంగని క్షమించమని వేడుకుంటూ తానే స్వయంగా మాలలల్లి రంగనికోసం తీసుకొని వెళ్లాడు. ఆ మాలలు అర్చకులు అలంకరించబోగా రంగడు ఎర్రని కనులతో అమితకుద్రుడయ్యాడట. వారు గడగడలాడిపోతూ విష్ణుచిత్తునకు విషయం వివరించబోగా రంగడు సావధానుడై నాకోపం ఆ విష్ణుచిత్తుని చిన్నది అల్లిన మాలలు ధరింపచేయట్లేదని అని చెప్పాడట. దాంతో ఆ రంగరంగని అపార కృపారసాన్ని చవిచూసినవారు విష్ణుచిత్తుని భాగ్యాన్ని కొనియాడారట. విష్ణుచిత్తుడూ పరవశుడై స్వామీ నా తనయను సైతం నీకే అర్పిస్తానని అంటూ పూలమాలలు, పూబోణిని రంగని అర్పించి వారిద్దరిని చూచి అమితానందభరితుడై రంగని నామంతో తరించిపోయాడట. అందుకే మనమూ ఆ గోదాదేవి, రంగనాయకులను స్మరిస్తూ మన జీవితాలను ఆనందభరితం చేసుకుందాం.

- కూకుట్ల యాదయ్య