మంచి మాట

బంధము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుట్టగానే అనురాగబంధంతో పెనువేసుకొంటాడు. తల్లి అనురాగ బంధం తో ఆశిశువును కట్టిపడేస్తుంది. ఆ శిశువు పెరిగి పెద్దయ్యేకొద్దీ ఎన్నో రకాల బంధాలల్లో నో చిక్కుకుంటాడు. ఆ బంధాల వల్లే అతను కీర్తిమంతుడుగానో అపకీర్తి మంతుడుగానో కూడా చలామణి అవుతుంటాడు. బంధం స్వార్థాన్ని నేర్పిస్తే అతడు కుసంస్కారిగా స్వార్థపరుడుగా అనురాగబంధాల్లో చిక్కువిడదీయలేని బంధీ అవుతాడు.
అదే బంధం భగవంతుని యందు ఏర్పడితే భగవంతుని మీద అచంచలమైన నమ్మకాన్ని ప్రోదిచేస్తే ఆ బంధమే సమాజంలోని ప్రతి ప్రాణిపట్ల సమబుద్ధిని ఏర్పరు స్తుంది. లోకకల్యాణకారకమైన పనులు చేయడానికి ఆ బంధమే ప్రేరేపిస్తుంది. బంధాల్లో చిక్కుకున్న మానవునికి దుఃఖమూ సుఖమూ కూడా బంధాలవల్లనే కలుగుతాయ కనుకనే బంధాల్లో చిక్కుకోకుండా తామరాకుపై నీటిబొట్టులాగా ఉండాలని జ్ఞానులు సూచిస్తారు. ఈ బంధమే ఆనందాన్ని, దుఃఖాన్నికలిగిస్తుంది. బంధం బలపడడానికి అవసరాలు, ప్రేమలు, స్వార్ధం అన్ని ఉత్ప్రేరకాలు అవుతాయ. రక్తసంబంధాల వల్ల ఏర్పడే బంధాలు వారిపై చూపించే ప్రేమకు, వారినుంచి పొందే అనుభూతులకు మూలకారణం అవుతుంది. అట్లానే అవసరాల నిమిత్తం సమాజంలోని అనేకమంది వ్యక్తులతో అనుబంధాలు పెంచుకుంటారు. ఈ అనుబంధం అనేది సమాజంలో మనస్థానాన్ని నిర్ణయిస్తుంది. అనైతిక అనుబంధాలు మన పతనాన్ని శాసిస్తాయి.
ఇవికాక ద్వేషం, అసూయ, ఓర్వలేనితనం, అహంకారం, అవతల వ్యక్తి చేసిన ద్రోహం, అకారణ ద్వేషం కూడా బంధానికి కారణాలుగా మారుతాయ. ఈ బంధాలు మోక్షానికి ప్రతి బంధకాలుగా ఉండిపోతాయ. అందుకే ఎవరితో నైనా ఏ బంధాన్ని పెనవేసుకోక ఎప్పటికయ్యెది కప్పటికా మాటలాడి అన్నట్టు ఆ సందర్భోచితంగా ప్రవర్తిస్తే బంధాలు మరోకాలానికి మోసుకెళ్లకపోతే మరోజన్మకు అవకాశం ఉండదు.
కీర్తికాంక్ష కూడా మోక్షబంధానికి ప్రతిబంధకమే నంటారు సర్వసంగపరిత్యాగులు. ఒకసారి రామభక్తుడైన కబీరు దగ్గరకు వచ్చి నేను నా కమండలాన్ని గాలిలో నిలబెట్టగలను . నీవు నిలబడెతావా అన్నాడు. కబీరు ఆయన చేతిలోఉన్న దారపుండను గాలిలోకి ఎగరేసాడు. ఆ దారపుఉండ విడివడగా వచ్చిన దారం ఏ ఆధారంలేకుండా గాలిలోనే ఉండిపోయంది. దాన్ని చూచే వాళ్లంతా కబీరు జేజేలు పలుకగా జేజేలు నాకు కాదు నాయనలారా ఆ శక్తిమంతుడు శ్రీరాముడే అనిచెప్పగా కమండలాన్ని నిలబెట్టగలను అన్న సన్యాసికి జ్ఞానోదయమై తప్పు క్షమించమని అడిగాడు. అపుడు కబీరుదాసు నాయనా నువ్వు చాలా శక్తిమంతుడివి. అణిమాది అష్టసిద్దులు వశం చేసుకున్నావు. మోక్షానికి, దైవానుగ్రహానికి చేరువులో ఉన్నావు. కాని నీ మనసును అలౌకికం వైపు మళ్లించుటలో విఫలమయ్యావు. కీర్తికాంక్ష, ధన వ్యామోహం, నేను గొప్ప అనే అహంకారం నీ మోక్షార్హతకు ప్రతి బంధకాలుగా తయారయ్యాయి. అవి తొలగించుకుంటే భగవంతునితో నీ బంధం పటిష్టమవుతుందని హితబోధ చేశాడు.
అట్లా ఏబంధమైనా మళ్లీ మళ్లీజనన చక్రంలో బంధించేది అయతే వాటిని కనికరం లేకుండా వదులుకోవడానికి సిద్ధపడాలి. దీనికి భగవంతుని తత్వ్తాని అర్థం చేసుకొంటే చాలు. ఆ భగవంతునికి మారురూపుగా మెలిగితే చాలు అపుడేఏర్పడే బంధం ఏదైనా అది బంధించవీలులేనిదిగా ఉంటుంది. దీనే్న అర్జునునికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. చేయంచేవాడు, చేసేవాడు కర్తకర్మక్రియ అన్నీ కూడా భగవంతుడే. భగవంతుని చేతిలోకీలుబొమ్మగా ఉన్న మానవునికి బంధాలు ఎందుకు? సర్వం ఈశ్వర మయంగా తలుస్తూ ప్రతి పనిని ఈశ్వరార్పణం చేస్తూ ఉంటే బంధాలు ఏర్పడవు. ఒకవేళ ఏబంధమైనా ఏర్పడితే అది కేవలం ఈశ్వరసంబంధ బంధమే అవుతుంది. నిశ్చింతగా నిర్మలంగా ఈశ్వరనామాన్ని స్మరణచేస్తూ కాలం గడపగలిగితే చాలు.

- జి. కల్యాణి