మంచి మాట

మనోవైచిత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో అత్యంత వేగవంతమయినది మనస్సు. క్షణకాలములో ముల్లోకాలను చుట్టిరాగలదు. చిత్రాతి చిత్రమైన మనస్సు చేసే చేష్టలు అంతా ఇంతా కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఏకకాలంలో ప్రదర్శించగల శక్తి కలది. సమస్త కార్యకలాపాలకు నిలయం. నాందీ ప్రస్తావనకు వేదిక. కార్యోన్ముఖులకు తొలి సోపానం. అంతఃకరణ చతుష్టయములలో మొదటిది. బుద్ధి, అహంకార, చిత్తాలకు ప్రేరణ కలిగించునది. జీవుని ఉత్తానుత్తాన దిశలుగా నడిపించునది.
మనసు నుండే ఈ సమస్త దృశ్య ప్రపంచము ఉద్భవించినది. ఇహపరములలో మోక్షమునకు మార్గదర్శి మనస్సే! మనోనిగ్రహము కలవానికి అది ఒక ప్రహేళిక. దీనిని అవలోకించుటకు అనాదిగా జీవుడు ప్రయాస పడుతూనే ఉన్నాడు. మనోవశమునకు మన ఉపనిషత్తులు అనేక తరుణోపాయములను నిర్వచించినవి. మనసు యొక్క గమ్యము ఆత్మానందము.
మనోనిగ్రహము యొక్క ప్రాధాన్యతను దానికి సహాయపడు మిగిలిన ఉపాధి లక్షణములను అత్యంత రమణీయంగా మనకు కఠోపనిషత్తు అందించినది.
ఆత్మస్థితిలో ప్రకాశించవలసిన జీవుడు మనస్సు మరియు ఇంద్రియాలతో కలిసి సుఖ దుఃఖాలను అనుసరిస్తున్నాడు. జీవుని అంతిమ లక్ష్యం మోక్షమని మన సనాతనం తెలియచేస్తోంది. పై శ్లోకము మానవ శరీరమనే రథములో ఆత్మరథికునిగా ప్రతిష్ఠితమైనది. రథమునకు సారధి బుద్ధి. సారధి చేతిలోని కళ్ళెము మనస్సు. అది కోరికల ఊటబావి. కళ్లెములచే నియంత్రించబడే అశ్వములు ఇంద్రియములు. లౌకిక విషయాలంపటమనే సుదీర్ఘ రహదారిలో జీవన రథం పయనిస్తున్నదని చాలా చక్కగా విపులీకరించినది. జీవుడు తన ఆత్మను మనస్సు మరియు ఇంద్రియములతో కలిపి భోక్తగా రమించుచున్నాడని తెలియచేస్తోంది.
నిత్య చంచలమైన మనసనే కళ్ళెమును బుద్ధి అనే సారథి చేతిలో నుంచి ఇంద్రియములనే అశ్వములను లౌకిక భోగోప విషయ రహదారిలో అతి జాగరూకతతో నడిపినగాని పరమ పదమును ఆత్మ చేరుకోదు. ఈ శరీరమనే రథము ఆత్మనే రథికుని అనాది మధ్య లయుడైన ఈశ్వరుని యందు అప్పుడే ప్రతిష్ఠించగలదని చాలా చక్కగ వర్ణించినది. రథికుడు సారధి అయిన బుద్ధికి తగిన విచక్షణ కలగచేయవలసిన అవసరమున్నది. విచక్షణాజ్ఞానము లోపించిన లౌకిక విషయోపయోగ భోగములలో పడి కొట్టుకొనుట తథ్యము. జీవుడు జితేంద్రియుడు కానిదే ముముక్షువు కాజాలడు. ఇంద్రియములనే అశ్వములు కోరికలతో మమేమకం కాకుండా, అటు నిటు చూడనివ్వకుండా నేరుగా పరమ పదము వైపు దౌడు తీయించవలెను.
ఈ జీవన యానములో రథికుడైన ఆత్మ తన ఏకత్వమును నిలుపుకొనక చంచలమైన మనసు మరియు ఇంద్రియములతో కలిసి ప్రయాణించిన జీవుడు లక్ష్యమునుచేరక అధోగతి పాలగును. ‘పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం’ అని శ్రీ శంకర భగవత్పాదులు తెలియజేసినట్లు అనేక యోనులలో మరల మరల జన్మిస్తూ సంసార కూపము నుండి విముక్తుడు కాడు. మనోవైచిత్రి ద్వారా జీవుడు అనుభవించే సుఖ దుఃఖముకు అంతముండదు.
కావున మనకు లభించిన ఈ శరీరమనే ఉపాధిని నిర్లక్ష్యము చేయకుండా అంతఃకరణ చతుష్టయములలో మొదటిదైన మనసును బుద్ధిలో నియంత్రించవలెను. అహంకారమనే నేనును ఆత్మగా గుర్తించవలెను. చిత్తమును పరబ్రహ్మము వైపు మరలించి లయము కావించవలెను. అప్పుడే నిర్వికల్ప, నిరామయ, మహాసమాధి స్థితుడగును.
మర్కట సమానమైన మనస్సును నియంత్రించుట కష్టం కాని అభ్యాస వైరాగ్యాల ద్వారా దానిని స్వాధీనపరచవచ్చునని శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి బోధించాడు. అభ్యాసయోగం, సాధనాయోగాల ద్వారా మనస్సు యొక్క ప్రభావాన్ని ఆత్మవైపు నడిపించవచ్చును.

-వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు