మంచి మాట

ఉప-ని-షత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించేవి వేదాలు. ఇవి జ్ఞానానికి పుట్టిళ్లు! బ్రహ్మతత్త్వాన్ని బోధిస్తాయి గనక వేదాంతం!
‘వేద’ అంటే తెలుసుకోవడం.. వేద జ్ఞానాన్ని తెలుసుకున్న వాడు బ్రహ్మదేవుడు! ఆయన తెలుసుకుని ఇతరులకు బోధించాడు గనుకనే వేదాలను ‘బ్రహ్మవిద్య’ అంటారు!
ఒక్కటిగా వున్న వేదాన్ని నాలుగుగా విభజించి, వాటికి ఒక రూపాన్ని తెచ్చినవాడు వేదవ్యాసుడు. అలా విభజించబడిన ప్రతి వేదము తిరిగి ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా విభజించబడింది. అవి ‘సంహిత (మంత్రభాగం), బ్రాహ్మణాలు (పూజలు, యజ్ఞాలు మొదలైనవి); అరణ్యకాలు (ఉపాసనము), ఉపనిషత్తు (పరమాత్మ తత్త్వం)! ఈ ఉపనిషత్తులే వేదాంగాలు అని కూడా పిలువబడుతాయి. నాలుగు వేదాలలో మొత్తం 1180 ఉపనిషత్తులు ఉండేవట! కాని ప్రస్తుతం 108 ఉపనిషత్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయట.. మంత్రాలతో సహా! ఇందులోను పది ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవంటారు ప్రాజ్ఞులు. అవి.. ‘ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, చాందోభాగ్య, బృహదారణ్యక’ ఉపనిషత్తులు.
ఇక ‘ఉపనిషత్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. ‘ఉప’ అంటే సమీపంగా, ‘ని’ అంటే క్రింద; ‘షత్’ అంటే కూర్చుండడం అని అర్థం. అంటే శిష్యులు గురువుకు సమీపంగా క్రింద కూర్చుని వేదాంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉప అంటే సమీపం కదా.. గురువుగారికి దగ్గరగా కూర్చోవాలని కాదు, గురువు బోధనను, మనోభావాన్ని సరిగ్గా గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ ఆకళింపు చేసుకుంటూ, మన మనసును ఆయన మనసుతో అనుసంధానం చేస్తూ శ్రద్ధగా వింటూ అర్థం గ్రహిస్తూ నేర్చుకోవాలన్నమాట.
ఇక ‘ని’ అంటే క్రింద అని కదా. అంటే గురువుగారు కూర్చున్న స్థానానికి క్రిందగా అని కాదు- శిష్యుడు తాను ఎంత తెలివిగలవాడైనా, గురువు తనకన్నా ఎక్కువ తెలిసినవాడని, వారిని గౌరవిస్తూ, వినయ విధేయతలు కలిగి వుండాలి. అప్పుడే గురుముఖతః వెలువడిన జ్ఞాన గంగ, అజ్ఞానులైన శిష్యుల్ని చేరుకుంటుంది. వారి బుద్ధులను ప్రక్షాళనం చేస్తుంది. ఇక ‘షత్’ అంటే కూర్చోవడం కదా! అలా అని గురువుగారికి దగ్గరగా (శారీరకంగా, ఆనుకుని) కూర్చోవడం కాదు. చంచలమై అటూ ఇటూ పరుగులు తీసే మనసును అదుపు చేసి, శ్రద్ధతో మనసు పెట్టి గురువు బోధను వినాలన్నమాట!
వేదాంతం.. ఆ మాట వింటేనే ఒకలాంటి అనుభూతి కలుగుతుంది. అటువంటి వేదాంతం.. ఉపనిషత్తు.. మంత్రాన్ని అర్థం, భావం, సూక్ష్మార్థంతో సహా విని, ఆకళింపు చేసుకుని ఆచరించగలగాలి. భూమిమీద ప్రతి జీవిలోను భగవంతుడున్నాడు. కాని మనిషి తనలోని భగవంతుని గుర్తించలేక, మనిషి మనిషిగానే ప్రవర్తిస్తున్నాడు. మనం సాధారణంగా జీవితం చివరి దశలో నేర్చుకునేది, అలవరచుకునేది వేదాంతం అని అనుకోవడం పరిపాటి. కాని ఈ తత్త్వం.. భగవత్తత్వం. జీవితం ఆరంభ దశనుంచీ ఒంటబడితేనే మానవుడు నీతి నిజాయితీలతో, నియమ నిష్ఠలతో క్రమబద్ధమైన జీవితానికలవాటు పడతాడు. మానవత్వాన్ని పెంపొందించుకుని సమాజానికి దేశాభివృద్ధికి తోడ్పడగలుగుతాడు. మనిషి తనలోని భగవంతుని గుర్తించి, ఆయనను చేరాలన్నా, మహోన్నతుడైన వ్యక్తిగా ఎదగాలన్నా మార్గదర్శకాలు ఉపనిషత్తులే!
సారహీనమైన బ్రతుకులను సారవంతముగా చెయ్యగలిగేది ఉపనిషత్సారమే!

- రేవతి