మంచి మాట

కోరికల నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరికలు అనేవి మానవునిలో సహజం. కాని కోరికలను నియంత్రించుకుంటే ఎంతో ఉన్నతిని పొందవచ్చు. దీనికి మనిషిలో ధర్మాచరణ పట్ల ఇచ్ఛ కలగాలి. కోరికను మునులు, రుషులు కూడా కోరికలను పూర్తిగా త్యజించలేకపోయారనే మన పురాణాలు చెబుతాయ. విశ్వామిత్రుడు కూడా తన కోరికలను అదుపు చేసుకోలేక ఎన్నో ఏళ్ల తపస్సును వ్యర్థపరుచుకుని తిరిగి జ్ఞానవంతుడై తపస్సు ఆచరించాడు. తాను అనుకొన్నదాన్ని సాధించాడు. కనుకలో మానవుడు కోరికలను పూర్తిగా లేకుండా చేసుకొలేకపోయనా సరే ఆ కోరికలను నియంత్రించుకున్నా వారికి సత్ఫలితాలే వస్తాయ.
మనిషిలో సత్వరజస్తమోగుణాలు ఉంటాయ. సత్వగుణులైతే వారిలో కోరికల నియంత్రణ సులభమవుతుంది. అట్లాకాక పోతే రజోగుణం కామక్రోధాలోభాలకు గురిచేస్తుంది. తామసగుణం మరింత మలినగుణాలను ప్రోదిచేస్తుంది. గుణాల మిశ్రమాన్ని ఛేదించలేక పోతున్న మానవులు భగవంతుని యెడల ప్రీతిని కలిగి భగవంతుని ఆరాధిస్తే చాలు గుణాతీతుడైన భగవంతుడు గుణాల వల్ల కలిగే దోషాలను పరిహరింపచేస్తాడు.
కామ క్రోధ లోభాలు అనే గుణాలు చైతన్య రూపంలోని ఆత్మను కప్పివేస్తాయి. గాజు బుడ్డిపై బూడిదను పూసినపుడు అసలు ఆకారం ఎలా కనబడదో ఈ మురికి కప్పినపుడు చైతన్యశక్తి గల ఆత్మ కూడా మందగమనం కలది అవుతుంది.
అందుకే జ్ఞానులు శత్రువులను జయంచాలంటే ముందు మనసులోని కోరికపై విజయం సాధించాలంటారు. ఇంద్రియ విజయులైనవారికి లోకంలో ఏ శక్తి యైనా అధీనంలోనే వుంటుంది.
కోరికలను నియంత్రించాలనుకొని వౌనంగా ఉంటే మనిషి సరిపోదు. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా అతనిలోని మనస్సులోని ఆలోచనలను ఎట్లా గైతే నిరంతరం స్రవిస్తుంటాయో అట్లానే కోరికలు కూడా లేనట్టుగా కనిపించి తిరిగి చిన్న సంఘటనతోనే విజృంభిస్తాయ. మనిషిని అతలాకుతలం చేస్తాయ.
మానవుడు ఎప్పుడైనా ముఖాముఖిగా కనబడే శత్రువుపై విజయాన్ని కఠోర శ్రమతోనైనా సాధిస్తాడు. కాని కనబడని కోరికలను జయంచడం సులభం అనుకోడు. దానికి నిరంతర సాధన సత్ సంగం కావాలి. సజ్జన స్నేహం చేయాలి. నిరంతరం భగవంతుని కథలను వినాలి. భగవంతుని గూర్చే ఆలోచించాలి. కాని ఐహిక సంబంధమైన పనుల జోలికి వెళ్లకుండా ఉండాలి. చిన్నకోరిక పుట్టినా దాన్ని వెంటనే దూరంగా తరిమేయాలి లేకపోతే ఆ భావననే ఊసరవెల్లిలాగా బహురూపాలను పొందుతుంది.
దేవీ మహాత్య్మంలో చెప్పినట్లుగా రక్తబీజుణ్ణి అమ్మ ఎన్ని సార్లు సంహరించినా వాని రక్తంబొట్టు నేలకు తాకి మరల మరలా రక్తబీజులు పుట్టినట్టుగానే తిరిగి మానవులోని కోరికలు పుడుతూనే ఉంటాయ. వాటిని సమూలంగా పెరికి వేయలేకపోయనా నిరంతర భగవంతుని సాధన చేస్తూ ఉంటే ఒకనాటికి ఆ కోరికలే నశిస్తాయ.
సర్వ ప్రాణికోటిలో మానవజన్మ మహోతృష్టమైంది. కాని ఈ జన్మ క్షణ భంగురమైంది. కనుక ఉన్నంతలో మంచి కార్యాలు చేసి పాపపుణ్యాలను సంపాదించుకొనే వీలు ఈ ఒక్కజన్మకే ఉన్నందున పుణ్యకార్యాలు చేయడానికే యత్నించినవారు పరమాత్మకు ఇష్టులవుతారు. కోరికలను భగవంతునికి ఇష్టమైన పనులు చేయాలనే తలంపుల వైపు కు మళ్లిస్తే చాలు వారు విజయులు అయనట్లే. అందుకే గీత మనిషిని ఈశ్వరార్పణ బుదిధతో ఫనులు చేయమంటుంది. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. ఫలితంపైన ఆశ వుండదు.కనుక కోరిక జనించదు. దానివల్ల భగవంతునికి ప్రీతి ప్రాతులయ్యే అవకాశాన్నిపొందుతారు.
మంచి చెడ్డలను విస్మరించి ఇంద్రియ లోలుడవైతే మనిషి తనకు తానే శత్రువు అవుతాడు. అట్లాకాక పరమార్ధ దృష్టిని అలవరుచుకుని భగవద్భక్తిని పెంపొందించుకుని సన్మార్గములో నడవడం ఆరంభిస్తే చాలు మనిషికి మనిషే మిత్రుడు అవుతాడు. భగవంతుణ్ణి కూడా తన కళ్ల ఎదుట నిలబెట్టుకోగలుగుతాడు. దీన్ని నిరూపించే ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయ. తన ధర్మాన్ని తాను ఆచరిస్తే చాలు. కర్తవ్య విముఖుడు కాకుండా ఉంటేచాలు అతనికి భగవంతుడే అన్ని విధాల సాయ మొనరుస్తాడు. కనుక ప్రతివారు భగవంతుని యందుభక్తిని పెంపొందించుకోవాలి.

- కె. యాదయ్య