మంచి మాట

మనిషి - ప్రవర్తన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుష్యుల ప్రవర్తనను బట్టి మనుష్యులను ఉత్తములు, దుర్మార్గులు, మిశ్రమ వ్యక్తులు అని విభజించారు. ఉత్తములు అనేవారిని సత్పురుషులు అంటారు. వీరిలో ఎప్పడూ మంచిగాను, హృదయము మనస్సు కూడా నలుగురికి మంచి చేయడానికే చూస్తుంది. ఎన్ని ఆటంకాలు కలిగినా మంచినే చేయటానికి చూస్తారు.
ఒకసారి సంత్ తులసీదాస్ ఒక దోపిడీ దొంగ తారసపడుతాడు. దొంగతనాలు మంచివి కాదని ఎన్నో విధాలుగా అతనికి చెప్పాడు. అన్నీ విన్న ఆ దొంగ కన్నీరు పెట్టాడు, తాను పాపిని క్షమించమని అడిగాడు. సంత్ తులసీదాసు ఇక అవన్నీ మరిచిపోయ భగవంతుని నామాన్ని జపించమని చెప్పి వెళ్లిపోయాడు. కాని ఆ దొంగ మరుసటి రోజే ఓ పెండ్లివాళ్ళను అడ్డగించి మొత్తం దోచుకున్నాడు. ఆ విషయం తులసీదాస్‌కి తెలిసి ఎంతగానో కుమిలిపోయాడు, తాను చేసిన ఇంత చెప్పినా దొంగ మారలేదని తన పని వ్యర్థం అయింది అని. సత్పురుషుల గుణం అలా వుంటుంది.
రెండోవారు దుర్మార్గులు. వీరినే దుర్జనులు అంటారు. తేలులా కుడుతూనే వుంటారు. పాములా పడగ విప్పి కాటువేసేవారు. ఇతరులు సుఖంగా వుంటే చూడలేరు, సహించలేరు. మంచి చెడు అనే భేదం తెలియదు. వారుపూర్తిగా అహంకారులు. ఇలాంటివారు కలియుగంలో ప్రపంచం నలుమూలలా మన చుట్టూ సమాజంలో వున్నారు.ఈ దుర్జనులు తాము బాగుంటే చాలని అనుకొంటారు. తమ సంపద కోసం పక్కవారిని యాతనలకు గురి చేస్తుంటారు.
ఇక మూడవవారు మిశ్రమ వ్యక్తులు. అయోమయ జీవులు. మంచి మనుషులతో మంచిగా, చెడ్డవారితో చెడుగా మెలిగేవారు. నూటికి నూరుపాళ్ళు స్వార్థపరులు. వీరినే గాలివాటం మనుషులు అంటారు. గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఎగిరే విస్తరి లాంటివాళ్ళు. కోరికలు అనే ఉయ్యాలలో వూగుతూనే వుంటారు.
పైన చెప్పిన ముగ్గురూ ప్రపంచం అంతటా వుంటారు. వీరికి ప్రగతి సాధించాలన్నా, పతనాన్ని అనుభవించాలన్నా వీరితోనే జరుగుతుంది. మనిషి ఆలోచనల వల్లే కోరికలు ఉద్భవిస్తాయి. కోరికలతో ముందుకు సాగుతారు. పతనం సంభవించినపుడు తట్టుకోలేరు. ఈ కోరికలు వలనే కర్మలు జరుగుతాయి. ఈ కర్మలను అనుసరించడం వల్లనే పరిణామాలు జరుగుతుంటాయి.
ఇట్లాంటి కోరికలవల్లే అలెగ్జాండర్ గ్రీకు నుంచి దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. ముందుకు సాగుతున్నాడు ఒకచోట ఒక ముని తపస్సు చేసుకుంటుంటే వెళ్లి అడిగాడు- ఈ భూమి ఎంతవరకు వుంది, నేను జయించుకోవాలి అనుకుంటున్నాను అన్నాడట. ముని పెద్దగా నవ్వాడు. ‘‘పిచ్చివాడా! నీ కోరికలు లాగా ఈ భూమికి అంతం లేదు. నీవు ఎక్కడినుంచి వచ్చావో మళ్లీ అక్కడికి వెళ్లాలి అనే కోరికను మనస్సులో తెచ్చుకో- నా వాళ్ళను చూడాలి అన తపనను తలంచుకో, ఇంతవరకు సంపాదించింది, జయించింది చాలు, తృప్తిపడు. నీవు యుద్ధానికి వచ్చినపుడు వచ్చిన సైన్యమెంత, ఇప్పుడు మిగిలిన సైన్యం ఎంత? మిగతావారు ఏరి? మావాళ్ళు ఏరి అని వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావు. చెప్పడానికి నీ దగ్గర ఏముంది? నీవు మంచివాడివి, నీవు దుర్మార్గుడివి. నీలో మిశ్రమ వ్యక్తులు వున్నారు. నీ సైన్యం కూడా విసుగు చెంది వుంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళను చూడాలనే తపన వుంటుంది. నీ సైన్యంలో అందరూ ఏకమై నీపై తిరుగుబాటు చేసి నిన్ను అంతం చేసేలోపల జ్ఞానవంతుడువుకా’’- అనేసరికి అలెగ్జాండర్ సెల్యుకస్ వైపు చూశాడు- ఇక చాలు అన్నట్లు తల ఊపాడు.
అట్లా కోరికలకు అంతం ఉండదు. ఆరంభం మాత్రమే. ఒక కోరిక తీరిన తరువాత మరో కోరిక పుడుతూనే ఉంటుంది. అందుకే కోరికలను జయంచడం కన్నా వాటిని నియంత్రించడం మేలంటారు విజ్ఞానవంతులు. కనుక మానవులంతా ఏది అవసరమో దానికోసం ప్రయత్నిస్తే చాలు మిగతా సమయంలో భగవంతుని నామాన్ని జపిస్తే పుణ్యం పురుషార్థము మిగులుతాయ.

- హిరణ్యమూర్తి