మంచి మాట

శివోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కాలమైనా శివపూజకు అడ్డు ఉండదు. శివా అనినోరారా పిలవడానికి ఏ కార్తీకమో లేక వైశాఖ కానక్కర్లేదు. గుణీతీతుడైన శివునకు ఫలానా మాసాలు ఇష్టం ప్రీతికరం అని శాస్త్రాలు చెపుతున్నాయంటే అందులో ఒక అంతరార్థం ఉండి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. సామాన్యులు మూఢులు శివానుగ్రహం అనే వస్తువు తెలీని వారు చాలా మందే ఉండి ఉంటారు. అటువంటి వారు కనీసం ఈ ప్రత్యేక మాసాల్లో నైనా భగవంతుణ్ణి తలిస్తే కొన్నిపుణ్యకార్యాలు చేయడం మొదలెట్టితే అదే అలవాటుగా మారి వారిలో సత్వగుణాలు ప్రకాశించే వీలు కలుగుతుంది. కనుక ఈ మాసాల్లో ఫలానా దేవునికి ఈ పూజలు చేయాలనేది పెద్దలు చెప్పారు. అసలు రూపమే లేని భగవంతుడు కదా ఆయనకు శివుడని , విష్ణువుఅని మనమే పేర్లు పెట్టుకున్నాం. కనుక ఆ పేరుకుతగ్గట్టుగా పూజలు చేయడం ఆరంభిస్తే భగవంతుని అనుగ్రహాన్ని తప్పక పొందుతాడని పెద్దల ఆలోచన అయఉండవచ్చు. అలా అర్థం చేసుకోక ఫలానా మాసంలో చేస్తే పుణ్యం రెట్టింపు వస్తుంది కనుక మిగతా రోజుల్లో పాపపు పనులు చేసి ఆ ఒక్కమాసంలోనే మంచి పనులు చేస్తానంటే భగవంతుడు మన కన్నా తెలివి గలవాడే కదా. కనుక ఆయన మంచి కి మంచి చెడు కు చెడు ఫలితాలను ఇచ్చి వూరుకుంటాడు. కనుక ఏ మాసమైనా ఏ కాలమైనా శివా అని నోరారా పిలవడం అనడంఅలవాటు చేసుకోవాలి.
ఎవరైతే నిత్యం శివునికి నానా విధ సుమధుర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి ఇహలోకంతోపాటు పరలోకంలోను ప్రాప్తించనిదంటూ వుండదు. నదిలో, చెరువు, సముద్రంలో స్నానమాచరించాలి. అది కుదరని నగర వాసులు ఇంట్లోనే వేకువ జామునే లేచి నిత్యం స్నానం చేసేటపుడు గంగాయమునలు మనసున స్మరిస్తే వాటిలో మునిగినంత పుణ్యాన్ని ఆ సర్వేశ్వరుడు ఇస్తాడు.అంటే ఇక్కడ కూడా శరీరానికే కాదు కావాల్సిన శుభ్రత కేవలం మనసుకు కూడా అని చెప్పక చెబుతున్నారు.
అందుకే మామూలు నీటినే గంగేచ, యమునేచ, కృష్ణాకావేరీ జలస్మిన్ కురు అని మనసులో భావించుకుని ఆ పరమ శివుని తలుచుకుని స్నానం చేయాలి. అని చెప్పడంలోని అంతరార్థం. ఈశ్వరునికి నీటితోకానీ, పాలతో కానీ అభిషేకం చేస్తారో వారికి ఆ పరమాత్ముడు పాపాలను భస్మం చేసి మోక్షప్రాప్తి కలిగిస్తాడు.
మనసు ప్రశంతంగా పవిత్రంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా పవిత్రంగా మారుతుందో అప్పుడు మనసు భగవంతునిపై నిమగ్నమవుతుంది. అంతేకాక మనసులో ఆధ్యాత్మిక పరిమళాలు వెదచల్లి మనసు ఒకానొక ఆలౌకికమైన అనిర్వచనీయమైన ఆనందానికి గురవుతుంది.
మనసు పరిశుద్ధమైనప్పుడు అవతలి వారి గురించి వారికి మంచి చేయాలన్న దాన్నిగురించి ఆలోచిస్తాము. ఎందుకంటే త్యాగమే మహోన్నత గుణమని మన వేదాలు చెబుతున్నాయ. దీన్ని అలవాటుగా చేసుకోవాడానికే కొన్ని ప్రత్యేక మైన దినాల్లో కాని , కొన్ని ప్రత్యేకమైన మాసాల్లో కాని శివుని పేరిట, విష్ణువు పేరిట దానాలు చేయమని చెప్తారు. గుప్పెడంత దానం చేస్తే గోతామంత పుణ్యాన్ని భగవంతుడు మనకు ఇస్తుంటాడు. ఈ దానాలవల్ల అనేక జన్మల దారిద్య్రం నశించి అనంత పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని శాస్త్ర వచనం. మనం చేసే పనులను చూసి మనలోని ఈశ్వర భక్తి ని చూచినపుడు మాత్రమే ఈశ్వరుడు ఎంతో సంతసించి మనకు అనంతమైన పుణ్యఫలాలను కలిగిస్తాడు. మనసా వాచా కర్మణా భగవంతుని యందు భక్తిని తద్వారా సాత్వికగుణాన్ని కలిగిఉండడమనేది మనుషులకు సహజగుణంగా ఉండాలి. అపుడే వారు మానవులుగా పరిగణింపబడుతారు. వారిలో మానవత్వంలేనపుడు మానవరూపంలో ఉండే దానవులుగానే చూస్తారు కాని మానవుల్లాగా అనుకోరు. కనుక రూపంలోను గుణంలోను భావంలోను మనుష్యులుగా మసల గలిగిననాడు భగవంతునికి భక్తుని తేడా ఏమీ ఉండదు. కనుక అందరు భక్తి అనే గుణాన్ని ప్రోది చేసుకోవాలి. భక్తి బీజాలను మనసున నాటింపచేసుకోవాలి. పరుల్లో పరమాత్మను చూచే నేర్పును కలిగి ఉండాలి.

-శ్రీష్ఠి శేషగిరి