మంచి మాట

సత్యరూపుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యరూప సదాచార సత్యధర్మ పరాయణ
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే
సత్యమే భగవంతుడు. నిత్యము సత్యవ్రతమును ఆచరిస్తే భగవంతుని పూజించినట్టే. శాంతి, సహనము సత్యాన్ని ఎల్లప్పుడు అంటిపెట్టుకునే వుంటాయి. సత్యాన్ని పలికించే వ్యక్తి మనసులో భయం ప్రవేశించదు. భయరహితమైన మనసే శాంతిని సూచిస్తుంది. నడవడి అనే మున్నీటిని దాటడానికి సత్యము ఓడవలే సహాయపడుతుంది అని శతకకారులు సెలవిచ్చారు. సత్యాన్ని ప్రవచించే వారిని లోకం నమ్ముతుంది. గౌరవిస్తుంది. అనృతం పలికేవారిని అసహ్యించుకుంటుంది. సత్యాన్ని నమ్ముకుని ప్రయత్నిస్తే విజయం కాస్త ఆలస్యమైనా పయనం భయరహితంగా వుంటుందని వివేకానందుడు బోధించాడు.
సత్యము నాశనము లేనిది. క్షరము కానిది. సత్యమునకే కట్టుబడి జీవితాన్ని సవాలుగా తీసుకుని నానా యాతనలు పడ్డ హరిశ్చంద్ర మహారాజు ఎనలేని కీర్తి గడించాడు. చరిత్రలో చిరస్థానాన్ని సంపాదించారు.
నిజాన్ని చెప్పే మనిషి మాటనే లోకం విశ్వసిస్తుంది. నిజం నిర్భయంగా చెప్పగలిగేవాడే మొనగాడు. నిజం అనేక సందర్భాల్లో కఠినంగా కనిపించవచ్చును. వాస్తవికత ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు భిన్నంగా వుండవచ్చును. సత్యాన్ని గ్రహించిన మనిషికి ఆరాటంనుంచి విముక్తి లభిస్తుంది. ఊరట కలుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం దొరికిందన్న సంతోషం కలుగుతుంది. సత్యాన్ని క నుగొన్న ఆర్కిమెడిస్ ఆనందంతో గెంతులేసాడు.
అసత్యాన్ని చెప్పడం ద్వారా మనిషి అశాంతిని ఆహ్వానిస్తాడు. అసత్యం ద్వారా కలిగిన హానికి తానే కారకుడని తన్ను తాను నిందించుకుని అశాంతిని పొందుతాడు. మానసిక అస్వస్థతకు గురవుతాడు. సత్యాన్ని చెప్పే వ్యక్తి ఏ అనర్దం ఎదురైనా ధైర్యంగా నిలబడతాడు. ఆత్మస్థయిర్యాన్ని అలవరుచుకుంటాడు.
కానీ సత్యవ్రతాన్ని ఆచరించడానికి ప్రపంచంలో అనేక అడ్డంకులు ఎదురొస్తాయి. ధన మాన ప్రాణ రక్షణకు అసత్యం ప లకడం తప్పుకాదని భాగవత శ్లోకం చెప్పినా అది కేవలం అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రయోగించాలి. అసత్య ప్రచారంతో తాత్కాలికంగా వనే్నకెక్కినవారు సత్యం బయటపడగానే అప్రతిష్ట పాలవుతుండడం మనం కళ్లారా చూస్తున్న సత్యం.
సత్యమనే ధర్మాన్ని నిత్యం ఆచరించిన శ్రీరాముడు అనేకమందికి ఆరాధ్య దైవం. సత్యం వద, ధర్మం చర అన్న నీతి సూత్రం ప్రాచీన కాలంనుంచి వాడుకలో వున్నదే. సత్యం, శివం, సుందరం దేవదేవుని ప్రతిరూపాలు. ప్రతి మనిషి శీల సంపదను పెంచేది సత్య గుణం. మానసిక బలాన్ని ప్రసాదించేది సత్యము మాత్రమే. తనకు తాను సత్యాన్ని అనుసరిస్తూ ఇతరులకు సత్యాన్ని మాత్రమే నిర్దేశించే వ్యక్తి విజయాన్ని తప్పక స్వీకరిస్తాడు. ఈలోకంలో ఎన్నాళ్లు జీవించామన్నది కాక ఎంత మంచిని కలుగచేసామని చూసుకొంటూ మన జీవితయానాన్ని సాగిస్తే పరలోకానికి మంచిని మోసుకెళ్లగలుగుతారు. మరు జన్మకేవలం భగవంతుని దర్శనాన్ని కలుగచేసేది గా ఉంటుంది.

**

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-వై.వి.రమణారావు